Fathers Day gifts and wishes : నాన్నతో కాసేపు గడపండి .. ‘ఫాదర్స్ డే’కి అదే మీరిచ్చే విలువైన బహుమతి

మన కోసం నాన్న ఎన్నో త్యాగాలు చేసి ఉంటాడు. తన ఇష్టాల్ని మర్చిపోయి ఉంటాడు. నాన్నకి బాగా ఇష్టమైన వస్తువులు .. పనులు ఏంటో ఎప్పుడైనా అడిగారా? అసలు మీతో కూర్చుని కాసేపు మాట్లాడటం ఎంత ఇష్టమో గమనించారా? కనీసం ఈ ఫాదర్స్ డే రోజు అయినా నాన్న ఇష్టాన్ని తీర్చండి.

Fathers Day gifts and wishes : నాన్నతో కాసేపు గడపండి .. ‘ఫాదర్స్ డే’కి  అదే మీరిచ్చే విలువైన బహుమతి

Fathers Day gifts and wishes

Updated On : June 17, 2023 / 4:30 PM IST

Fathers Day gifts and wishes : తను తండ్రి కాబోతున్నాను అని తెలిసినప్పుడు ఎంతో గర్వంగా ఫీలవుతాడు నాన్న. పిల్లలు పుట్టాక వారి ఎదుగుదల కోసం అహర్నిశలు కష్టపడతాడు. నాన్న కష్టానికి వెల కట్టలేం. ఏమిచ్చినా రుణం తీర్చుకోలేం. కానీ చిన్న చిన్న సంతోషాలు వారికి పంచడం పిల్లల బాధ్యత. ఫాదర్స్ డే రోజు సర్పైజ్ గిఫ్ట్ ఇవ్వండి. సంతోషాన్ని పంచండి.

Father’s Day 2023 : నాన్న కష్టాన్ని గుర్తించండి.. నాన్న ఇష్టాలు నెరవేర్చండి

నాన్నంటే అందరికీ ప్రాణమే. కానీ ఆయనపై ఉన్న ప్రేమను ప్రకటించడానికి సందర్భం ఉండాలి కదా.. మీకు మీ ఫాదర్ అంటే ఎంత ఇష్టమో చెబుతూ స్వయంగా మీరే గ్రీటింగ్ కార్డ్ తయారు చేయచ్చు. రంగు రంగుల స్కెచ్‌ పెన్నులతో అందమైన పదాలతో నాన్న గురించి అందమైన కవిత లేదా మీ మనసులోని భావాలను నింపి ఇవ్వొచ్చు.. కార్డు చూడగానే నాన్న కళ్లలో ఆనందం మెరుస్తుంది. ఒకప్పుడు గ్రీటింగ్స్ కార్డ్స్ హవా బాగా ఉండేది. ఇప్పుడంతా సెల్ ఫోన్లలో మెసేజ్‌లు.. అవి అంతగా మనసుని హత్తుకోవు. అందుకే స్వయంగా మీ దస్తూరితో మీరే తయారు చేసిన గ్రీటింగ్ కార్డ్ ఇచ్చి నాన్నని సంతోషపరచండి.

 

మీ ఫాదర్‌తో సినిమా చూసి చాలా రోజులు అయ్యి ఉండొచ్చు. ఎందుకంటే మీ జనరేషన్‌కి నచ్చిన సినిమాలు వారికి నచ్చకపోవచ్చు. మీ ఫాదర్‌కి ఇష్టమైన సినిమాకి తీసుకెళ్లండి. లేదా ఇంట్లో టీవీలోనే చూపించండి.  ఇక ఏ హోటల్ కో.. లేదంటే ఆయనకు ఇష్టమైన ప్రదేశానికి తీసుకెళ్లండి. తల్లితండ్రులకి పిల్లలతో కాసేపు మాట్లాడాలని ఉన్నా.. ఎప్పుడూ ఉద్యోగాలతో బిజీగా ఉండే పిల్లల్ని ఇబ్బంది పెట్టకూడదని పేరెంట్స్ ఆలోచిస్తారు. అలా వారు పిల్లల మాటలకు కూడా నోచుకోలేకపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రోజంతా మీతో మాట్లాడుతూ గడిపితే వారి సంతోషం ఎంతని చెప్పాలి.

Daughter Gift : మొదటి జీతంతో తండ్రికి విలువైన గిఫ్ట్ ఇచ్చిన కూతురు.. వీడియో వైరల్

నాన్నకి కూడా బోలెడు ఇష్టాలు ఉంటాయి. కుటుంబ బాధ్యతల్లో పడి.. ఖర్చులెందుకని చాలా ఇష్టాల్ని పోస్టుపోన్ చేసుకోవడమే మర్చిపోవడమో చేసి ఉంటారు. అవేంటో తెలుసుకుని మీకు వీలైతే తీర్చేయండి. మంచి డ్రెస్, ఇష్టమైన సెల్ ఫోన్, ఇష్టమైన పెర్ఫ్యూమ్స్ ఇలా.. చాలా చాలా ఉంటాయి కదా.. ఇందులో మీరు సెలక్ట్ చేసుకుని బహుమతిగా ఇవ్వొచ్చు.

 

ఆరోగ్యం బాగాలేకో.. దూరాన ఉండో తనకెంతో ఇష్టమైన బంధువులో, స్నేహితులనో కలవడానికి పలకరించడానికి కూడా నాన్న ఇబ్బంది పడి ఉండొచ్చు. కొంచెం సమయం కేటాయించి వారితో మాట్లాడించండి. మీ ఇంట్లో పాత ఆల్బమ్స్ ఉంటాయి కదా.. ఓసారి వాటిని బయటకు తీయండి. చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు మీ ఫ్యామిలీ తీయించుకున్న ఫోటోలు ఉంటాయి కదా.. అవన్నీ ఓసారి చూస్తూ మీ ఫ్యామిలీతో గడపండి. ప్రతి సందర్భంలో నాన్నతో ముడిపడి ఉన్న జ్ఞాపకాలు ఫోటోల్లో ఉంటాయి.. అవన్నీ గుర్తు తెచ్చుకోవడం ఎంత సంతోషాన్నిస్తుంది.

precious gift for father : తండ్రికి కొడుకు ఇచ్చిన విలువైన బహుమతి .. చూడగానే ఆ తండ్రి కన్నీరు ఆగలేదు..

సెలబ్రేషన్ అంటే హంగులు, ఆర్భాటాలు అవసరం లేదు. ఎప్పటికీ కలిసి ఉండే మనసులు.. పంచుకునే బంధాలు.. ఒక కుటుంబం సంతోషంగా కలిసిమెలసి ఉంటే సంబరపడేది అమ్మానాన్నలే.  పేరెంట్స్ కోసం  ప్రత్యేకంగా సెలబ్రేట్ చేసుకునే సందర్భాల్లో ఇవే వారికి నిజమైన ఆనందాన్ని ఇస్తాయి. తల్లితండ్రులతో కలసి ఉండండి.. వారికి కంటికి రెప్పలా కాపాడుకోండి.. వారి కళ్లలో కన్నీరు రాకుండా చూసుకోండి. ఇవే ప్రతి తండ్రికి.. తల్లీకి బిడ్డలు చేసే వేడుకలు.. ఇచ్చే బహుమతులు. హ్యాపీ ఫాదర్స్ డే.