Liver : కాలేయానికి నష్టం కలిగించే అలవాట్లు!
చాలా మందిలో కాలేయం జబ్బుపడ్డా లక్షణాలు వెల్లడి కావటానికి పది నుంచి ఇరవై సంవత్సరాల వరకు కూడా సమయం పడుతుంది. సుదీర్ఘమైన ఈ సమయంలో కాలేయ కణాలు క్రమంగా దెబ్బతిని వ్యాధి ముదిరిపోతుంది.

Liver
Liver : శరీరంలో కీలక విధులు నిర్వర్తించే అవయవాలలో కాలేయం అత్యంత ముఖ్యమైనది. శరీరంలో ఇతర భాగాలతో పోలిస్తే దెబ్బతిన్న కణాలను తిరిగి అభివృద్ధి చేసుకోగల సామర్ధ్యం కాలేయానికి మాత్రమే ఉంటుంది. కాలేయం వివిధ రకాల సమస్యల కారణంగా దెబ్బతిన్నా తిరిగి పునరుద్ధరించుకునే శక్తి కాలేయానికి మాత్రమే ఉంటుంది.
ఇటీవలి కాలంలో ఎక్కవ మంది కాలేయ జబ్బుల బారిన పడుతున్నారు. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. మితిమీరిన, దీర్ఘకాల మద్యపానం, హెపటైటిస్ బి, సి. వైరస్ ఇన్ ఫెక్షన్, ఊబకాయం వల్ల ఎక్కువ మంది కాలేయ వ్యాధులకు గురవుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు. ముందుగా కామెర్ల వ్యాధి తోప్రారంభమౌతుంది. దీనికి వెంటనే చికిత్స చేయించుకోని పక్షంలో అది ముదిరి కాలేయం పనితీరు తీవ్రంగా దెబ్బదీస్తుంది.
కామెర్ల లో హెపటైటిస్ ఎ, ఇ. వైరసుల వల్ల వచ్చేవి చాలా ప్రమాదకరంగా మారతాయి. కలుషితమైన నీళ్లు, తిండి వల్ల ఈ తీవ్రమైన వైరసులు శరీరంలోకి చేరుతుంటాయి. హైపటైటిస్ ఎ, ఇ వైరసులతో కామెర్ల వ్యాధి వస్తుంది. చాలా కాలం పాటు మితిమీరి మద్యపానం చేయటం వల్ల కాలేయం తీవ్రంగా దెబ్బదింటుంది. లివర్ స్లిరోసిస్ వ్యాధి వస్తుంది. ఊబకాయం వల్ల ఫాట్ సిరోసిస్, నాన్ అల్కోహాలిక్ స్టియటోనాష్ ఏర్పడుతుంది.
ఇటీవలికాలంలో అధికశాతం మందిలో ఈ ఫాట్ స్లిరోసిస్ అధికంగా ఉంది. ఫాట్ సిరోసిస్ బి, సి దశలలో కాలేయ కణాలు చాలా వరకు పనిచేయలేని స్థితికి చేరుకుంటాయి. పిల్లలో కనిపిస్తున్న కాలేయ వ్యాధులు పుట్టుకతో వచ్చేవిగా చెప్పవచ్చు. అనారోగ్యకరమైన అలవాట్లు కారణంగా కాలేయం వ్యాధులు వచ్చే అవకాశాలు అధికంగా ఉంటాయి. దీని వల్ల కాలేయం దెబ్బతింటుంది. సకాలంలో గుర్తించగలిగితే కాలేయ వ్యాధులను సర్జరీలతో పనిలేకుండా మందులతో నివారించుకోవచ్చు. నిర్లక్ష్యం చేస్తే మాత్రం పరిస్థితి చేజారిపోయి ప్రాణాలే పోయే అవకాశం ఉంటుంది.
చాలా మందిలో కాలేయం జబ్బుపడ్డా లక్షణాలు వెల్లడి కావటానికి పది నుంచి ఇరవై సంవత్సరాల వరకు కూడా సమయం పడుతుంది. సుదీర్ఘమైన ఈ సమయంలో కాలేయ కణాలు క్రమంగా దెబ్బతిని వ్యాధి ముదిరిపోతుంది. కళ్లు పచ్చగా మారతాయి, చర్మంపై దురదలు , ఆకలి మందగించటం, నీరసంగా ఉండి ఎప్పుడూ నిద్రపోతుండటం, కడుపులో వికారం, ఏకాగ్రత కోల్పోవటం, జ్జాపకశక్తి మందగించటం, చివరకు కోమాలోకి వెళ్ళటం జరుగుతుంది. లివర్ వ్యాధులుకు ప్రస్తుతం మంచి మందులు అందుబాటులోకి వచ్చాయి.సకాలంలో వైద్యుల వద్ద కు వెళ్ళగలిగితే సమస్యల నుండి సులభంగా బయటపడేందుకు అవకాశం ఉంటుంది.