Rainy Season : వర్షకాలంలో ఆరోగ్యసమస్యలు చుట్టుముట్టకుండా!
వానాకాలంలో తేలికపాటి ఆహారాలు తీసుకోవటం మంచిది. ఇవి త్వరగా జీర్ణం అవుతాయి. గుమ్మడి, గ్రీన్ వెజిటేబుల్స్ తో ఉడికించిన పదార్ధాలు, ఆవిరి మీద ఉడికించిన సలాడ్స్, ఫ్రూట్స్, పెసరపప్పు, కార్న్ వంటివి తీసుకోవాలి. డయాబెటీస్ ఉన్న వారు వర్షకాలంలో మరిన్ని జాగ్రత్తలు పాటించాలి.

Food (1)
Rainy Season : వర్షాకాలంలో ఆరోగ్యం గురించి మరింత ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ సీజన్లో కొన్ని ఆహారాలకు మరియు అలవాట్లకు దూరంగా ఉండాలి. కారంతోకూడిన ఆహారాలు, ఎసిడిక్ ఫుడ్స్, పుల్లని వాటికి కూడా దూరంగా ఉండాలి. ఎక్కువ ఉప్పు ఉండటం వల్ల అజీర్తి, హైపర్ అసిడిటి, మరియు కడుపుబ్బరానికి దారి తీస్తాయి.
వానాకాలంలో తేలికపాటి ఆహారాలు తీసుకోవటం మంచిది. ఇవి త్వరగా జీర్ణం అవుతాయి. గుమ్మడి, గ్రీన్ వెజిటేబుల్స్ తో ఉడికించిన పదార్ధాలు, ఆవిరి మీద ఉడికించిన సలాడ్స్, ఫ్రూట్స్, పెసరపప్పు, కార్న్ వంటివి తీసుకోవాలి. డయాబెటీస్ ఉన్న వారు వర్షకాలంలో మరిన్ని జాగ్రత్తలు పాటించాలి. పాదాల సంరక్షణ జాగ్రత్తలు తీసుకోవాలి. వర్షాకాలంలో ఇంట్లో ఉన్నా చెప్పులు ధరించాలి. జారకుండా గ్రిప్ ఉండే చెప్పులు ఎంచుకోవాలి.
వర్షకాలంలో సాధారణ టీలకు బదులుగా హేర్బల్ టీలను సేవించటం వల్ల మంచి ఫలితం ఉంటుంది. హెర్పల్ టీలలో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. జింజర్ టీ , గ్రీన్ టీలు తాగవచ్చు. ఇవి వర్షాకాలంలో వచ్చే గొంతు నొప్పి, ఫ్లూ వంటివి అనారోగ్య సమస్యలను నివారిస్తాయి. వర్షకాలం బయటకు వెళ్ళలేని పరిస్థిలో ఇంట్లోనే పుష్ అప్ లు, యోగా, తేలికపాటి వ్యాయామాలు చేయటం మంచిది. దీని వల్ల వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది. బయటి ఆహారాల జోలికి వెళ్లవద్దు. ఇంట్లో తయారు చేసిన వేడి వేడి ఆహారాలను మాత్రమే తీసుకోవటం మంచిది.
వర్షాకాలంలో చర్మ అలర్జీ సమస్య ఎక్కువగా వస్తాయి. తడిగా ఉన్న దుస్తులు, తడి బూట్లు, రెయిన్‌కోట్‌లు, జాకెట్లు, గ్లోవ్‌లు, వంటి వాటి వల్ల చర్మానికి ఫంగల్ ఇన్‌ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంది. చర్మానికి వచ్చే అలర్జీల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వర్షాకాలంలో వచ్చే అలర్జీల్లో మొటిమలు, తామర. అధిక తేమ కారణంగా వస్తాయి. తగిన జాగ్రత్తలు పాటించటం ద్వారా ఆరోగ్య సమస్యలు కాపాడుకోవచ్చు.