High Blood Pressure : అధిక రక్తపోటు సమస్య.. కొన్ని వ్యాయామాలకు దూరంగా ఉండటమే మేలు

కొన్ని రకాల వ్యాయామాలు రక్తపోటు స్థాయిని తక్షణమే పెంచుతాయి. దీంతో మైకము, శ్వాస ఆడకపోవడం వంటి సమస్యలు ఉత్పన్నం అవుతాయి.

High Blood Pressure : అధిక రక్తపోటు సమస్య.. కొన్ని వ్యాయామాలకు దూరంగా ఉండటమే మేలు

High Blood Pressure

High Blood Pressure : అధిక రక్తపోటు , హైపర్‌టెన్షన్ జీవనశైలి కారణంగా వచ్చే సమస్య. చాలా మంది తమ శరీరంలో ఈ సమస్య ఉన్నప్పటికీ కనీసం దాని గురించి తెలుసుకోలేరు. మరి కొంత మంది తెలిసినా అశ్రద్ధగా వదిలేస్తారు. ఇలా చేయటం వల్ల చివరకు అనారోగ్యాల బారిన పడే ప్రమాదాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. హైపర్‌టెన్షన్‌తో బాధపడేవారు ప్రతిరోజు రక్తప్రసరణ స్ధాయిలను సమతుల్యంగా ఉండేలా చూసుకోవాల్సిన అవసరం ఉంది. లేకపోతే అకస్మాత్తుగా గుండెపోటుకు గురయ్యే ప్రమాదం ఎదుర్కోవాల్సి వస్తుంది. కొన్ని రకాల వ్యాయామాలు రక్తపోటు సమస్యతో బాధపడుతున్నవారికి మేలు కలిగిస్తే మరికొన్ని వ్యాయామాలు మాత్రం ప్రమాదకరంగా మారతాయి.

హైపర్‌టెన్షన్‌తో బాధపడేవారు రోజూ వ్యాయామం చేయడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వాకింగ్, జాగింగ్, యోగా వంటి సాధారణ వ్యాయామాలు చేయడం వల్ల ఒత్తిడి స్థాయిని తగ్గించడంతోపాటు రక్తపోటు స్థాయిలను కూడా తగ్గించవచ్చు. అయితే కొన్ని రకాల వ్యాయామాలు రక్తపోటు స్థాయిని తక్షణమే పెంచుతాయి. దీంతో మైకము, శ్వాస ఆడకపోవడం వంటి సమస్యలు ఉత్పన్నం అవుతాయి. 180/100mmHg అంతకంటే ఎక్కువ రక్తపోటు ఉన్న వారు కొత్త వ్యాయామలు ప్రారంభించే ముందు వైద్యుడి నుండి వైద్య సలహా తీసుకోవటం మంచిది.

జాగ్రత్తగా ఉండవలసిన కొన్ని వ్యాయామాలు ;

వెయిట్ లిఫ్టింగ్ ; శక్తికోసం, ఎముకలను బలోపేతం చేయడానికి, ఎముక సంబంధిత గాయాల ప్రమాదాన్ని తగ్గించడానికి వెయిట్ లిఫ్టింగ్ ఉపయోగకరంగా ఉంటుంది. హైపర్‌టెన్షన్ రోగులకు, బరువును ఎత్తడం రక్తపోటు స్థాయిని అదుపులో ఉంచటానికి తీవ్రమైన అనారోగ్యాల ప్రమాదాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది. అయితే కఠినమైన బరువులు ఎత్తటం, వ్యాయామం చేయటం వల్ల ఒత్తిడి స్థాయిని ప్రమాదకర స్థాయికి పెంచుతుందన్న విషయాన్ని గుర్తించాలి.

రన్నింగ్ ; అధిక రక్తపోటుతో వ్యవహరించే రోగులకు జాగింగ్, మరింత వేగంలేకుండా ఉండే పరుగు, సైక్లింగ్ వంటి వాటిని వైద్యులు సిఫార్సు చేస్తున్నారు. అధికవేగంతో పరిగెత్తటం ఏమాత్రం మంచిది కాదు. ఇలా చేయటం వల్ల రక్తపోటు స్థాయి తక్షణమే పెరుగుతుంది. దీనివల్ల ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంటుంది.

స్కూబా డైవింగ్ ; అధిక రక్తపోటు ఉన్నవారు డైవింగ్ చేసేటప్పుడు రక్తపోటు స్ధాయి మరింత పెరిగే ప్రమాదం ఉంటుంది. ఇది గుండెపోటు, స్ట్రోక్ వచ్చే ప్రమాదాన్ని పెంచుతుంది, నీటి లోతుల్లో ఉన్న సమయంలో కొన్ని సందర్భాల్లో ప్రాణాంతకం కావచ్చు. ఈ వాటర్ స్పోర్ట్స్‌ని ఎంచుకునే ముందు వైద్యుడిని సంప్రదించటం మంచిది. ముందస్తుగా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవటం ఉత్తమం.