Immune System : వ్యాధి నిరోధక శక్తిని బలోపేతం చేయటం ఎలాగంటే?

ఒత్తిడి శరీరం యొక్క రోగనిరోధక ప్రతిస్పందనను తగ్గిస్తుంది. దీనివల్ల గుండె సంబంధిత సమస్యలతోపాటు, మానసిక సమస్యలు ఎదురవుతాయి.

Immune System : వ్యాధి నిరోధక శక్తిని బలోపేతం చేయటం ఎలాగంటే?

Immunity

Updated On : December 19, 2021 / 4:11 PM IST

Immune System : వైరస్ లు, వైరల్ ఇన్ఫెక్షన్ల వంటి వ్యాధులతో పోరాడటానికి, మీ రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడం చాలా ముఖ్యం. రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి మీరు ఈరోజు అనేక జీవనశైలి మరియు ఆహారంలో మార్పులు చేసుకోవాలి. తగినంత నిద్రపోవడం మరియు మీ ఒత్తిడి స్థాయిలను తగ్గించుకోవటం మంచిది. ఎక్కువ రోగ నిరోధక శక్తి ఉంటే అనేక రకాల, వైరస్లు, ఫ్లూ నుంచి మీ శరీరాన్ని రక్షిస్తుంది. ఈ రోగ నిరోధక శక్తి సహజసిద్ధంగా పెంచుకోవడం ఉత్తమం.

జంక్ ఫుడ్ కి అలవాటు పడ్డవారికి  ఐరన్, కాపర్, ఫోలిక్ యాసిడ్, విటమిన్ ఎ, విటమిన్ బి మరియు విటమిన్ సి లోపానికి కారణం అవుతుంది. ఈ విటమిన్లు అన్నీ మీ రోగనిరోధక శక్తిని పెంచడానికి ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి కాబట్టి విటమిన్లు మరియు పోషక ఆహారం తప్పనిసరిగా తినాలి ముఖ్యంగా ఆకుకూరలు తింటే అనుకోకుండా వచ్చే వ్యాధులను నివారించే రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

ప్రతిరోజూ కొంత శారీరక శ్రమ చేయటం వల్ల వ్యాధినిరోధక శక్తి పెరిగేందుకు అవకాశం ఉంది. శారీరక శ్రమ రోగనిరోధక కణాలు , ప్రతిరోధకాల ఉత్పత్తిని ప్రోత్సహిస్తాయని పరిశోధనల్లో తేలింది. ఇంట్లో నడవడం ,జాగింగ్ వంటి వాటి వల్ల శరీర రోగనిరోధక శక్తి పెరుగుతుంది. కనీసం 7-8 గంటల నిద్ర పోవాలి అంతకన్నా తక్కువ సేపు నిద్రించే వారికి అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది అని వివిధ వైద్య అధ్యయనాలు చెబుతున్నాయి. తక్కువ సమయం నిద్రించడం వల్ల కూడా రోగనిరోధక శక్తి తగ్గుతుంది. కాబట్టి రోగనిరోధక శక్తి పెరగడానికి మంచి నిద్ర తప్పనిసరి.

ఒత్తిడి శరీరం యొక్క రోగనిరోధక ప్రతిస్పందనను తగ్గిస్తుంది. దీనివల్ల గుండె సంబంధిత సమస్యలతోపాటు, మానసిక సమస్యలు ఎదురవుతాయి. ఇతరుల నుంచి మనకు అనేక అంటువ్యాధులు, సూక్ష్మక్రిములు, బ్యాక్టీరియాను మన శరీరంలోకి చేరతాయి. ఆహారం తీసుకునే సమయంలో చేతుల్ని శుభ్రం చేసుకోవడం చాలా ముఖ్యం. ముఖ్యంగా పిల్లలలో పరిశుభ్రత నైపుణ్యాలను పెంపొందించడం అవసరం.

ముఖ్యంగా వ్యాధి నిరోధక శక్తి పెరగాలంటే పోషకాహారం తీసుకోవటం మంచిది. తాజాగా ఉండే పండ్లు, కూరగాయలను ఎక్కువగా ఆహారంలో భాగం చేసుకోవాలి. ఇలా చేయటం వల్ల వ్యాధి నిరోధక శక్తి పెంపెందించుకోవచ్చు. తద్వారా చిన్నచిన్న ఆరోగ్యసమస్యల నుండి శులభంగా భయటపడవచ్చు.