Oily Skin : ఆయిలీ స్కిన్ తో బాధడుతుంటే….ఇవిగో చిట్కాలు మీకోసం!….

వెనిగర్, రోజ్ వాటర్‌ల మిశ్రమం ముఖానికి రాయటం వల్ల మంచి ఫలితం ఉంటుంది. జిడ్డు చర్మం పై మురికిని తొలగించేందుకు ఉపకరిస్తాయి.

Oily Skin : ఆయిలీ స్కిన్ తో బాధడుతుంటే….ఇవిగో చిట్కాలు మీకోసం!….

Oily Skin

Updated On : February 24, 2022 / 1:37 PM IST

Oily Skin : ఆయిలీ స్కిన్ సమస్యతో నిత్యం చాలా మంది బాధపడుతుంటారు. ముఖ్యంగా అమ్మాయిలు ఈ సమస్యతో ఇబ్బందిపడుతుంటారు. చర్మంపై జిడ్డు కారణంగా మొటిమలు ఏర్పడటం తద్వారా మచ్చలు పడటం చూడటానికి ఇబ్బంది కరంగా ముఖం తయారు కావటం వంటివి జరుగుతుంటాయి. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా చర్మంపై జిడ్డు తొలగించుకోవటం వారికి సాధ్యం కాదు. చర్మం లోపల ఉండే సెబేషియస్ గ్రంధులు అవసరమైన దాని కంటే ఎక్కువగా స్రావాల్ని ఉత్పత్తి చేయడమే ఈ సమస్యకు ప్రధాన కారణం. ఆయిలీ స్కిన్‌తో బాధపడేవారు దీని నియంత్రణకు మార్కెట్లో లభించే అనేక ఫేస్ క్రీమ్ ఉత్పత్తులను వాడుతుంటారు. అయితే వీటిలో ఉండే కొన్ని రకాల రసాయనాలు చర్మానికి హానికలిగిస్తాయి.

ఇంట్లో సహజసిద్ధంగా కొన్ని చిట్కాలను అనుసరిస్తే చర్మంపై జిడ్డును తొలగించుకోవటం సులభం. వీటిని రోజు వారిగా అనుసరించటం వల్ల మంచి ఫలితం ఉంటుంది. చర్మంపై ఉండే అదనపు నూనెలు తొలగిపోయి చర్మం అందంగా , ఆకర్షణీయంగా, మృదువుగా మారుతుంది.

చర్మంపై జిడ్డును తొలగించే చిట్కాలు ;

పాలు ముఖానికి రాసుకుని15 నిమిషాల పాటు అలానే ఉంచాలి. ఆతరువాత చల్లని నీటితో ముఖాన్ని కడగాలి. ఇలా చేయటం వల్ల పాలు చర్మంలో పేరుకుపోయిన జిడ్డుదనాన్నిపోగడతాయి. చర్మంపై జిడ్డుదనాన్ని తగ్గించడంలో తేనె బాగా ఉపకరిస్తుంది. తేనెను ముఖానికి పూతగా వేసుకోవాలి. 15 నిమిషాల తర్వాత కడిగటం వల్ల ముఖంపై జిడ్డుదనం పోతుంది.

చర్మంలో పేరుకుపోయిన మురికితో పాటు, అధికంగా పేరుకుపోయే జిడ్డుదనం తొలగించేందుకు నీళ్లలో నిమ్మరసం, ఐస్‌తో ముఖమంతా శుభ్రం చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. కొబ్బరి పాలు కూడా ముఖంలో జిడ్డు తనాన్ని తొలగించటంలో సహాయపడతాయి. వేడినీళ్లతో ముఖం కడుక్కోవడం వల్ల చర్మంలో ఉన్న అదనపు జిడ్డు సులభంగా బయటకు పోతుంది.

ఆయిలీ స్కిన్ ఉన్నవారు ఎక్కువసార్లు ముఖం కడుక్కోవటం మంచిదికాదు. ఎందుకంటే మీరు ఉపయోగించే సబ్బుల్లోని రసాయనాలు చర్మంపై ప్రభావం చూపుతాయి. దీని వల్ల చర్మం డ్రైగా మారిపోతుంది. అందుకే రోజుకు రెండు మూడు సార్లకు మించి ముఖాన్ని సబ్బుతో కడగరాదు.

వెనిగర్, రోజ్ వాటర్‌ల మిశ్రమం ముఖానికి రాయటం వల్ల మంచి ఫలితం ఉంటుంది. జిడ్డు చర్మం పై మురికిని తొలగించేందుకు ఉపకరిస్తాయి. ఎప్పటికప్పుడు ముఖాన్ని స్క్రబ్ చేసుకోవటంతో చర్మంపై పేరుకుపోయే మృతకణాలను తొలగి చర్మ గ్రంధులు యాక్టివ్‌గా మారతాయి. రోజూ ఉపయోగించే సబ్బులు లేదా లిక్విడ్‌లు కూడా ఆయిల్ ఫ్రీగా ఉంటే చర్మానికి మేలు జరుగుతుంది.

బాదం పొడిని, తేనెతో కలిపి ఆ మిశ్రమాన్నిముఖానికి అప్లై చేయాలి. కలబంద గుజ్జు కూడా బాగా పనిచేస్తుంది. రెండు చెంచాల ఓట్స్ పొడిని, కలబంద గుజ్జుతో మిక్స్ చేసి ముఖానికి రాసుకోవాలి. కొద్ది నిమిషాల పాటు ముఖానికి మర్దన చేసి ఆతరువాత చల్లటి నీళ్లతో కడుక్కోవాలి. ఇలా చేయటం వల్ల సులభంగా చర్మంలోని జిడ్డు తొలగిపోతుంది.

గుడ్డు తెల్లసొనలో ఒక చెంచా తేనె, శెనగపిండి కలిపి ప్యాక్‌గా తయారు చేసుకోవాలి. ఈ ప్యాక్‌ను ముఖానికి పూసి 20 నిమిషాల పాటు అలానే ఉంచాలి. తర్వాత ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. పోషకాహారం తీసుకోవాలి. నూనె ఎక్కువగా ఉండే పదార్థాలను తినకపోవటం బెటర్.