Drinking Water : నీళ్లు ఎక్కువగా తాగితే గుండె జబ్బులు రావా!
తక్కువ నీళ్ళు తాగే వారిలో రక్తంలోని ప్లాస్మాలో సోడియం శాతం పెరుగుతున్నట్లు కనుగొన్నారు. ప్రతిరోజు నీళ్ళు తాగిన మోతాదును బట్టి ప్లాస్మాలోని సోడియం శాతం మారిపోతుందని గుర్తించారు. తక్

Water
Driking Water : నీళ్లు ఎక్కువగా తాగుతున్నారా అయితే అది మీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని భావించాలి. ఎందుకంటే ఇటీవలి అనేక అధ్యయనాల్లో నీరు ఎక్కువగా తాగే వారిలో గుండె జబ్బుల బారిన పడే అవకాశాలు చాలా తక్కువని తేలింది. యూరోపియన్ సొసైటీ ఆఫ్ కార్డియాలజీ నిపుణులు సైతం ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. నీళ్ళు ఎక్కువగా తాగే వారిలో గుండెజబ్బులు, అకస్మిక మరణాలు చోటు చేసుకోవని అంటున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఎక్కవ శాతం మంది కనీస పరిమాణంలో నీళ్ళు తాగటం లేదని అధ్యయనాలు తేల్చాయి.
తక్కువ నీళ్ళు తాగే వారిలో రక్తంలోని ప్లాస్మాలో సోడియం శాతం పెరుగుతున్నట్లు కనుగొన్నారు. ప్రతిరోజు నీళ్ళు తాగిన మోతాదును బట్టి ప్లాస్మాలోని సోడియం శాతం మారిపోతుందని గుర్తించారు. తక్కువ నీరు తాగే వాళ్ళల్లో సోడియం సాంద్రత పెరిగిపోయి గుండెజబ్బుల బారిన పడే అవకాశాలు వారికి ఎక్కవగా ఉంటాయట. మధ్య వయస్సు వారిలో సీరమ్ లోని సోడియం శాతం, తాగే నీటి శాతం అధారంగా భవిష్యత్తులో గుండె ముప్పుల ప్రమాదాలను అంచనా వేయవచ్చని అంటున్నారు.
తక్కవ నీరు తాగే వారిలో గుండెలోని ఎడమ జఠరిక గోడలు మందంగా మారి గుండె పోటులకు దారి తీయవచ్చట. 44నుండి 66 ఏళ్ళ వయస్సు గల 16వేల మందిని ఈ అధ్యయనానికి ఎంపిక చేసి 70 నుండి 90 సంవత్సరాలు వచ్చే వరకు గమనించారు. అయితే ఈ అధ్యయనంలో తక్కువ నీరు తాగి ప్లాస్మాలో సోడియం శాతం ఎక్కువగా ఉన్న వారిలో ఎడవ జఠరిక బాగం మందంగా మారి గుండె జబ్బుల బారిన పడి మరణించినట్లు తేలింది. నిపుణులు సూచన ప్రకారం ప్రతిరోజు ఆడవాళ్ళైతే 1.6 లీటర్ల నుండి 2.1 లీటర్లు వరకు మంచినీళ్ళు తాగాలి. మగవారైతే 2 లీటర్ల నుండి 3 లీటర్ల వరకు నీళ్ళు తాగాలి. ఇలా చేస్తే గుండె జబ్బుల బారిన పడకుండా ఉండవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.