Water intoxication : నీళ్లు మోతాదు మించి తాగారో… ఇక అంతే
మన మూత్రపిండాలకు తగినంత నీరు ఉన్నంత వరకు వాటి పనితీరు సరిగా ఉంటుంది. ఒకవేళ హైడ్రేషన్ మరీ ఎక్కువైపోతే నేరుగా మూత్రపిండాలపై ప్రభావం పడుతుంది. కానీ చాలామంది కిడ్నీల ఆరోగ్యం కోసం నీటిని ఎక్కువగా తీసుకుంటుంటారు. అదే మంచిదని నమ్ముతుంటారు.

drink too much water
Water intoxication : రోజుకి ఎనిమిది గ్లాసుల నీళ్లు తాగాలని కొందరు.. రెండు లీటర్ల నీళ్లు తాగాలని కొందరు.. చెప్తుంటారు. అలా కాదు.. దాహమేసినప్పుడు నీళ్లు తాగితే చాలంటారు ఇంకొందరు. మన శరీరానికి సరిపడా నీళ్లు తాగకపోతే మాత్రం… నీరసం, అలసట లాంటివే కాదు.. కొన్నిసార్లు ప్రాణాల మీదకే రావచ్చు. ఇదంతా మనకు తెలిసిందే. కానీ నీళ్లు ఎక్కువ మోతాదులో తాగితే కూడా ఆరోగ్యానికి నష్టమని మీకు తెలుసా…?
READ ALSO : Cholesterol : ఉల్లి తినడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయి అదుపులో ఉంటుందా?
నీరు.. జీవకోటి మనుగడకు ప్రాణాధారం. మరి ఆ ప్రాణమే ప్రాణం తీస్తుందా? అవును.. నీరు అధిక మోతాదులో తీసుకుంటే కిడ్నీలపై ప్రతికూల ప్రభావం తప్పదు. ఒక వ్యక్తి ఆరోగ్యంగా ఉండాలంటే నీళ్లు అవసరం. శరీరాన్ని హైడ్రేటేడ్ గా ఉంచడానికి నీరు ఎంతో ఉపయోగపడుతుంది. కానీ అదే నీరు మోతాడు మించితే మాత్రం సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. నీరు శరీర బరువులో 50 నుంచి 70శాతం మధ్య ఉంటుంది. ఇది శరీరానికి తప్పనిసరిగా కావాల్సిన కెమికల్. శరీరంలోని అవయవాలు, కణాలు, కణజాలాలు అన్నీ సరిగా పని చేయడానికి నీరు అవసరం. మరి అంతటి ఉపయోగమున్న నీరు కూడా మితి మీరి తీసుకుంటే ప్రమాదమే.
READ ALSO : Hot Water : పొట్ట శుభ్రతకు, బరువు తగ్గేందుకు.. గోరు వెచ్చని నీరు ఎంతో మేలు
ఎక్కువ తాగితే..
ఆరోగ్యమైన వ్యక్తులు కూడా ఎక్కువ నీరు తాగడం వల్ల సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అప్పుడప్పుడు అథ్లెట్లు, లేదా కఠినమైన వ్యాయామాలు చేసేవాళ్లు తమని తాము అధికంగా హైడ్రేట్ చేసుకోవడానికి నీరు ఎక్కువ తీసుకుంటారు. అలాంటప్పుడు కిడ్నీలు అదనపు నీటిని తొలగించలేవు. దీనివల్ల రక్తంలోని ఉప్పు సాంద్రత కూడా పలుచన అవుతుంది. ఈ పరిస్థితిని హైపోనైట్రేమియాఅని పిలుస్తారు. ఇది ప్రాణాంతకం కావచ్చు.
READ ALSO : Watery Eyes: కంట్లోంచి నీరు కారుతుందా.. పెద్ద కారణమే ఉండొచ్చు.. ముందే జాగ్రత్త పడండి
శ్వాస, చెమట, మూత్రవిసర్జన, పేగు కదలికల ద్వారా నీటిని శరీరం నుంచి కోల్పోతుంటాం. అలాంటప్పుడు ఏదో ఒక పద్ధతిలో శరీరానికి నీటి సరఫరాను కలిగించాలి. అయితే.. ఒక వ్యక్తి ప్రతిరోజు ఎంత నీటిని వినియోగించాలనే దానిపై ప్రామాణికమైన కొలత లేదు. శారీరక శ్రమ, శరీర బరువు.. శరీరానికి ఎంత నీరు అవసరమో నిర్ణయిస్తాయి. అంతేకాదు.. వాతావరణం కూడా ఇందులో ప్రధాన పాత్ర పోషిస్తుందని వైద్యులు చెబుతున్నారు. అయితే.. సగటు రోజుల్లో 3 లీటర్ల వరకు, వేసవిలో 3.5 లీటర్ల నీరు వరకు తాగవచ్చని డాక్టర్లు సలహా ఇస్తున్నారు.
READ ALSO : Rainwater : వర్షపు నీరు ఎందుకు తాగరో? మీకు తెలుసా..
కిడ్నీలకు కష్టం..
మన మూత్రపిండాలకు తగినంత నీరు ఉన్నంత వరకు వాటి పనితీరు సరిగా ఉంటుంది. ఒకవేళ హైడ్రేషన్ మరీ ఎక్కువైపోతే నేరుగా మూత్రపిండాలపై ప్రభావం పడుతుంది. కానీ చాలామంది కిడ్నీల ఆరోగ్యం కోసం నీటిని ఎక్కువగా తీసుకుంటుంటారు. అదే మంచిదని నమ్ముతుంటారు. కానీ వైద్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఎక్కువ నీరు తాగడం వల్ల వ్యర్థాలను తొలగించడానికి కిడ్నీలు చాలా కష్టపడాల్సి వస్తుంది. అంతేకాదు.. నీరు ఎక్కువ తీసుకోవడం వల్ల మరిన్ని ప్రతికూల ప్రభావాలు కూడా శరీరంలో కనిపిస్తాయి.
READ ALSO : Breastfeeding : చంటిబిడ్డలకు పాలిచ్చే తల్లులు ఎలాంటి ఆహారం తీసుకోవటం మంచిదంటే ?
తరచుగా అతిగా ఆందోళ పడటం, చిన్న పనికే ఎక్కువ అలసట.. కనిపిస్తే అధిక నీరు శరీరంలో చేరిందనడానికి అది సంకేతం. అంతేకాదు.. నీరు తీసుకున్న తర్వాత కూడా మూత్రవిసర్జన చేయలేకపోతే కూడా కిడ్నీలు వాటి సామర్థ్యానికి మించి పని చేయాల్సి ఉంటుంది. ఇది కూడా ప్రమాదమే. అధికంగా నీరు తీసుకోవడం వల్ల శరీరంలోని సోడియం, ఇతర ఎలక్ట్రోలైట్ లు పలుచన అవుతాయి. దీనివల్ల మెదడులోని కణాలపై ప్రభావం పడుతుంది. ప్రాణానికే ముప్పు కలుగుతుంది. కాబట్టి మోతాదుకు మించి నీటి వినియోగం ఎప్పటికైనా ప్రమాదమేనంటున్నారు వైద్య నిపుణులు.