Soak Seeds : ఆ గింజలను నానబెట్టుకుని తింటే బరువు తగ్గటంతోపాటు శరీరానికి ఎన్నో పోషకాలు అందుతాయ్!
పెకాన్ నట్స్ గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. జీర్ణక్రియ, జీవక్రియను పెంచడం ద్వారా త్వరగా బరువు తగ్గేందుకు సహాయపడుతుంది. వీటిలో కొవ్వు పదార్థాలున్నప్పటికీ..ఒలేయిక్ ఆమ్లం ఆకలి మందగించేలా చేస్తుంది కాబట్టి బరువు తగ్గడంలో తోడ్పడుతుంది.

If you soak the seeds and eat them, you will lose weight and get many nutrients for your body!
Soak Seeds : కొన్ని రకాల గింజలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. శరీరానికి తగిన పోషకాలను అందిస్తాయి. ముఖ్యంగా అధిక బరువుతో బాధపడుతున్న వారు గింజలను నానబెట్టుకుని ఉదయాన్నే అల్పాహారంగా తీసుకోవటం వల్ల మంచి ఫలితం ఉంటుంది. బరువు తగ్గటంతోపాటు మంచి పోషకాలు శరీరానికి అందుతాయి. బరువు తగ్గించేందుకు దోహదపడే గింజల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
బాదం ; బాదం పప్పుల్లో విటమిన్ ఇ పుష్కలంగా ఉంటుంది. కాల్షియం, ఐరన్, కొవ్వు ఆమ్లాలు కూడా ఎక్కువ మొత్తంలో ఉంటాయి. బాదం పప్పులు శరీరంలో మంచి కొలెస్ట్రాల్ ను పెంచి ఎల్ డిఎల్ చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తాయి. కడుపును ఎక్కువ సేపు నిండుగా ఉంచుతాయి. కడుపు ఉబ్బరం నుంచి ఉపశమనం కలిగించడానికి సహాయపడతాయి. బాదంపప్పులను రాత్రిపూట నీటిలో నానబెట్టి ఉదయం ఖాళీ కడుపుతో తినడం వల్ల తొందరగా బరువు తగ్గుతారు. కడుపును ఎక్కువ సేపు నిండుగా ఉంచుతాయి. శరీరానికి శక్తిని కూడా అందిస్తాయి.
ఎండు ఖార్జూరాలు ; ఎండు ఖర్జూరాల్లో ఐరన్ కంటెంట్ ,ఫ్లోరైన్ అత్యధికంగా ఉంటుంది. విటమిన్స్, మినరల్స్ ఎక్కువగా ఉన్నాయి. డేట్స్ ను రెగ్యులర్ గా తినడం వల్ల కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది. అనేక అనారోగ్య సమస్యలను దూరం చేస్తుంది. ఇవి తినడానికి తియ్యంగా ఉంటాయి. ఎండు ఖర్జూరాలను నేరుగా తినడం కంటే నీటిలో వేసి రాత్రంతా నానబెట్టి ఉదయం పరగడుపు తిని, ఆ నీరు తాగితే ఆరోగ్య ప్రయోజనాలు రెట్టింపు అవుతాయి. బరువు తగ్గడం సులువు అవుతుంది.
నల్ల ఎండుద్రాక్ష ; నల్ల ఎండు ద్రాక్ష ఆరోగ్యానికి ఎంతో మంచిది. మలబద్ధకాన్ని నివారించడంలో బాగా ఉపయోగపడుతుంది. వీటిలో ఉండే ఫైబర్ శరీరానికి రోగనిరోధక శక్తిని అందిస్తుంది. శరీరంలో ఉండే వ్యర్థాలను పోగొట్టేందుకు, బరువు తగ్గేందుకు దోహదపడుతుంది. రక్తం తక్కువగా ఉన్నవారు వీటిని తినడం వల్ల రక్తం పడుతుంది. షుగర్ ను కంట్రోల్ లో ఉంటుంది.
పెకాన్ నట్స్ ; పెకాన్ నట్స్ గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. జీర్ణక్రియ, జీవక్రియను పెంచడం ద్వారా త్వరగా బరువు తగ్గేందుకు సహాయపడుతుంది. వీటిలో కొవ్వు పదార్థాలున్నప్పటికీ..ఒలేయిక్ ఆమ్లం ఆకలి మందగించేలా చేస్తుంది కాబట్టి బరువు తగ్గడంలో తోడ్పడుతుంది. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. చర్మానికి ఎంతో మేలు కలిగిస్తాయి.
అంజీరా ; అంజీరాలో పోషకాలు అధికంగా ఉంటాయి. ఎ,బి. విటమిన్లతోపాటు కాల్షియం, ఇనుము, మాంగనీస్, సోడియం, పొటాషియం, పీచుపదార్ధాలు ఉంటాయి. ప్రీరాడికల్స్ తో పోరాడి అనారోగ్యాలు దరిచేరకుండా చేస్తాయి. మెదడు పనితీరును చురుకుగా ఉండాలా చేస్తాయి. అధిక రక్తపోటు ను అదుపులో ఉంచటంలో సహాయపడతాయి. బరువును నియంత్రిస్తాయి.
అవిసె గింజలు ; అవిసె గింజల్లో పీచు అధికంగా ఉంటుంది. శరీరానికి కావాల్సిన శక్తిని అందిస్తాయి. రోగనిరోధక శక్తిని పెంచటంతోపాటు బరువును అదుపులో ఉంచటంలో తోడ్పడతాయి. రోజు ఒక టీ స్పూన్ చొప్పున నానబెట్టి తీసుకుంటే మంచి ఫలితాలు పొందవచ్చు.
మెంతులు ; ప్రతిరోజు రెండు టీ స్పూన్ల మెంతులను నీటిలో నానబెట్టి ఆనీటిని ఉదయాన్నే తాగటం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. కీళ్ల నొప్పులు తగ్గుతాయి. పేగులు శుభ్రపడి మలబద్ధకం సమస్య తొలగిపోతుంది. రక్తంలో చక్కెర నియంత్రణలో ఉంటుంది. అంతేకాకుండా నెలసరి సమయంలో వచ్చే నొప్పులు తగ్గుతాయి.