కుంకుడుకాయలతో తలస్నానం…ఎన్ని లాభాలో తెలుసా

ఇప్పుడంటే షాంపూలు వచ్చి చేరాయి. కానీ, ఇంతకు ముందు తల స్నానానికి కుంకుడుకాయలు, శీకకాయలు వాడేవారు. ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో కుంకుడుకాయలకి స్థానం లేకుండా పోయింది. అయితే, షాంపూలు పడని వాళ్ళో, మళ్ళీ మన పాత పద్ధతుల వైపు వెళ్దాం అని ఉత్సాహం ఉన్న వాళ్ళో కుంకుడుకాయల గురించి ఆలోచిస్తున్నారు. ఈ కుంకుడు కాయలు వల్ల జుట్టుకి చేకూరే లాభాలేమిటో తెలుసుకుందాం.
– కుంకుడుకాయల్లో ఉన్న విటమిన్స్ ఏ, డీ వల్ల జుట్టు బాగా పెరుగుతుంది. అందులో ఉన్న విటమిన్స్ జుట్టు కుదుళ్ళకి బలాన్నిచ్చి జుట్టు పొడవుగా ఒత్తుగా పెరిగేలా చేస్తాయి. ఈ విటమిన్స్ కొత్త ఫాలికిల్స్ ఏర్పడడానికి సహాయం చేస్తాయి. సీబమ్ ప్రొడక్షన్ కి హెల్ప్ చేసి జుట్టుకి నరిష్‌మెంట్ ని అందిస్తాయి.
– చుండ్రూ, స్ప్లిట్ ఎండ్స్, హెయిర్ ఫాల్, వంటివన్నీ కుంకుడుకాయలని రెగ్యులర్ గా యూజ్ చేస్తూ ఉంటే దూరమౌతాయి. పైగా, ఒకసారి ఈ సమస్య తీరిపోయాక మళ్ళీ రాకుండా కుడా ఉంటాయి.
– స్కాల్ప్ మీద ఫంగస్ పెరగడం వల్ల చుండ్రు సమస్య వస్తుంది. కుంకుడు కాయలు స్కాల్ప్ ని పూర్తిగా శుభ్రపరుస్తాయి. దాంతో స్కాల్ప్ మీద ఫంగల్ గ్రోత్ ఉండదు. రెగ్యులర్‌గా కుంకుడుకాయలతోనే తలస్నానం చేస్తూ ఉండడం వల్ల చుండ్రు సమస్య పూర్తిగా పోతుంది.
-కుంకుడు కాయల రసం నాచురల్ షాంపూగా పని చేస్తుంది. జుట్టుకి పోషణనిస్తుంది. దాంతో, జుట్టు మెరుస్తూ ఉంటుంది. జుట్టు ఒత్తుగా కూడా పెరుగుతుంది. కుంకుడుకాయల్లో ఉన్న విటమిన్స్ వల్ల జుట్టు డ్రై గా అవ్వకుండా ఉంటుంది. సిల్కీ, స్మూత్ హెయిర్ మీ సొంతమవుతుంది.
-కుంకుడుకాయల్లో ఉండే యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ వలన హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది. జుట్టు చిక్కులు లేకుండా స్మూత్ గా ఉంటుంది.
కుంకుడు కాయలని జుట్టు కోసం రెండు రకాలుగా వాడవచ్చు – రసంలాగా, పొడిలాగా. ఉసిరికాయలు, శీకాకాయ కూడా కలిపి వాడవచ్చు.
కుంకుడు కాయల రసం
1. పది కుంకుడు కాయల నుండి పెంకు తీయండి.
2. శీకాకాయ కూడా కలిపి ఈ రెండింటినీ మరిగించండి.
3. రాత్రంతా చల్లారనివ్వండి.
4. పొద్దున్నే వడకట్టి షాంపూ లాగా నే యూజ్ చేయండి.
5. అయిపోయిన తర్వాత నీటితో కడిగేయండి.
రీటా, శీకకాయ పొడి
1. గుప్పెడు శీకాకాయల్ని పొడి చేయండి.
2. అలాగే, గుప్పెడు కుంకుడు కాయల్ని కూడా పొడి చేయండి.
3. ఈ రెండింటినీ కలిపు వాటర్ యాడ్ చేసి పేస్ట్ లా చేయండి.
4. ఈ పేస్ట్ ని మీ స్కాల్ప్ కి అప్లై చేసి గుండ్రంగా మసాజ్ చేయండి.
5. ఇలా పది నిమిషాలు చేసిన తరువాత శుభ్రంగా తలస్నానం చేయండి.