Avoid These Foods : ఈ 5 ఆహారాలను కలిపి తీసుకోవటాన్ని నివారించటం మంచిది
నారింజ, నిమ్మ వంటి సిట్రస్ పండ్లలో యాసిడ్ ఉంటుంది. ఈ యాసిడ్‌ను పాలలో కలిపి తీసుకుంటే, పాలు గడ్డకట్టి జీర్ణ సమస్యలు ఉత్పన్నం అయ్యే ప్రమాదం ఉంటుంది. అందువల్ల, వాటిని కలిపి తీసుకోవటం మానుకోవటం మంచిది.

WRONG FOOD COMBINATIONS
Avoid These Foods : విటమిన్ డి , కాల్షియం, ఐరన్ , విటమిన్ సి వంటి కొన్ని ఇతర పోషకాలు కలిగిన ఆహారాలు శరీరానికి ఎంతో ప్రయోజనాన్ని కలిగిస్తాయి. అయితే కొన్ని ఆహార కలిపి తీసుకోవటం వల్ల శరీరానికి అసౌకర్యాన్ని కలిగించడంతోపాటుగా, ఆరోగ్య సమస్యలను కలిగిస్తాయి. ఆహారాలను కలిపి తీసుకోవటం ఆరోగ్యకరమైనదని పోషకాహార నిపుణులు సూచిస్తుంటారు. అయితే ఇది అన్నిసమయాల్లో ఆరోగ్యకరం కాదనే చెప్పాలి. ఆహారంలో వివిధ రకాల ఆహార పదార్థాలను చేర్చుకోవడం వల్ల పోషకాహార లోపాలను నివారించవచ్చు. మిక్సింగ్ ఆహారాలను తీసుకునే సందర్భంలో శరీరానికి హాని కలిగించే కొన్ని ఆహారాలు ఉంటాయి. ఉదాహరణకు పెరుగును పాలతో కలిపి తీసుకోరాదని ఎప్పటినుంచో మన పెద్దలు చెబుతుంటే వింటూనే ఉంటాం. ఇదే తరహాలో కలిపి తీసుకోకుండా నివారించవలసిన మరికొన్ని ఇతర ఆహారాలు కూడా ఉన్నాయి. వాటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
READ ALSO : భోజనం చేశాక నడకతో ఎన్ని లాభాలో తెలుసా
ఎలాంటి ఫుడ్ కాంబినేషన్స్‌కు దూరంగా ఉండాలి ;
1. ఆహారంతో పండ్లు
మనం తీసుకునే ఆహారానికి తీపి రుచిని కలిగించటానికి చాలా మంది పండ్లను కలిపి తీసుకుంటారు. అయితే ఆహారంతో పాటు పండ్లను కలిపి తీసుకోవద్దని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. వీటిని కలిపి తింటే జీర్ణ సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంటుంది. పండ్లను బ్రేక్ ఫాస్ట్ గా విడిగా తీసుకోవాలి. అంతేకాకుండా ఆహారం, పండ్లు తీసుకునే మధ్య తగినంత సమయం గ్యాప్ ఉండాలని సూచిస్తున్నారు. భోజనం చేసిన వెంటనే పండ్లు తినే అలవాటు చాలా మందిలో ఉంటుంది. భోజనం చేసిన గంట తరువాత మాత్రమే పండ్లు తినటం ఉత్తమం.
READ ALSO : మీ వాట్సాప్ బ్లాక్ అయిందా? రీస్టోర్ చేయండిలా!
2. కొవ్వు కలిగిన మాంసంతో జున్ను
కొవ్వు కలిగిన జంతు మాంసాలతో కలిపి చీజ్ తీసుకోవడం వల్ల సంతృప్త కొవ్వు , సోడియం స్థాయిలు అధికంగా పెరుగుతాయి. ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని మరింత పెంచుతుంది. మొత్తం ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది. ఆహారాన్ని సమతుల్యం చేయడానికి తక్కువ కొవ్వులు కలిగిన మాంసాన్ని తినేందుకు ఎంచుకోవాలి. సాధ్యమైనంత వరకు ఈ రెండింటి కలయికను నివారించటం ఉత్తమం.
READ ALSO : Pistachio For Blood Sugar : పిస్తాలు రక్తంలో చక్కెరను తగ్గిస్తాయా ? వాటిని మీ ఆహారంలో ఎలా చేర్చుకోవాలంటే..
3. సిట్రస్ పండ్లతో పాలు
నారింజ, నిమ్మ వంటి సిట్రస్ పండ్లలో యాసిడ్ ఉంటుంది. ఈ యాసిడ్‌ను పాలలో కలిపి తీసుకుంటే, పాలు గడ్డకట్టి జీర్ణ సమస్యలు ఉత్పన్నం అయ్యే ప్రమాదం ఉంటుంది. అందువల్ల, వాటిని కలిపి తీసుకోవటం మానుకోవటం మంచిది. వాటిని తీసుకునే విషయంలో తగినంత సమయం గ్యాప్ ఇవ్వాలి.
READ ALSO : Dry Fruits : డ్రై ఫ్రూట్స్ ను ఆహారంగా తీసుకుంటే ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు పొందొచ్చంటే ?
4. ఐరన్, కాల్షియం
ఐరన్ , కాల్షియం మనిషి శరీరానికి రెండు ముఖ్యమైన పోషకాలు. ఈ రెండు కలిపి తిన్నప్పుడు, శరీరం రెండు పోషకాలను ఏకకాలంలో గ్రహించలేదు. రెండింటినీ బాగా గ్రహించడం కోసం, విటమిన్ సితో ఇనుము, విటమిన్ డితో కాల్షియం కలిసి ఉన్న ఆహారాలను తీసుకోవాలి.
READ ALSO : Thyroid Problems : థైరాయడ్ సమస్యతో బాధపడుతున్నవారు తీసుకునే ఆహారం విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు !
5. చేపలతో పాలు
మాంసాహారంతో పాలు, వాటి అనుబంధ ఉత్పత్తులను కలిపి తీసుకోవటం ఏమాత్రం శ్రేయస్కరం కాదు. పాలుతో మాంసాన్ని కలపడం శరీరానికి చాలా హానికరం. ఇలాంటి ఆహారా విధానాలు కొన్నిసార్లు అనుకోని ఉపద్రవాలను తెచ్చిపెడతాయి.