Rock Salt : హిమాలయన్ రాక్ సాల్ట్ తో ఆరోగ్య ప్రయోజనాలు బోలెడు…

ఒత్తిడి తగ్గేందుకు రాక్ సాల్ట్ ఉపకరిస్తుంది. రాక్ సాల్ట్ ను తీసుకోవడం వల్ల ఒత్తిడితోపాటుగా, డిప్రెషన్ సమస్య తొలగిపోతుంది.

Rock Salt : హిమాలయన్ రాక్ సాల్ట్ తో ఆరోగ్య ప్రయోజనాలు బోలెడు…

Himalayan Salt

Updated On : February 23, 2022 / 8:58 PM IST

Rock Salt : ఉప్పు ఎక్కువ తీసుకుంటే ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్న నేపధ్యంలో సాధారణ సాల్ట్ కి బదులుగా రాక్ సాల్ట్ ని ఉపయోగించుకోవడం మేలని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. ఈ రాక్ సాల్ట్ ని హిమాలయన్ సాల్ట్ అని కూడా అంటారు. దీనిలో 84 రకాల పోషకాలు ఉన్నాయని చెప్తారు. రాతి ఉప్పులా ఉండే ఈ ఉప్పును హిమాలయాల్లోని రాతి స్పటికాలతో తయారు చేస్తారు. సాధారణ ఉప్పులా కన్నా ఇందులో సహజంగానే అయోడిన్ ఉంటుంది. తక్కువ ఐరన్ ఉంటుంది. మినరల్స్ అత్యధికంగా ఉంటాయి. పొటాషియం, జింక్, మెగ్నీషియం , కాల్షియం వంటివి కూడా ఉంటాయి. సాధారణ ఉప్పుతో పోలిస్తే దీని ధర కొద్దిగా ఎక్కవగానే ఉంటుంది.

లో బీపీ సమస్యతో బాధపడేవారు నిమ్మరసంలో సాల్ట్ కలిపి తీసుకుంటాం. అయితే మామూలు సాల్ట్ కు బదులుగా ఈ రాక్ సాల్ట్ ను ఉపయోగించాలి. బీపీ ని కంట్రోల్ లో ఉంచడానికి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. హృదయ సంబంధిత సమస్యలు రాకుండా చూసుకోవచ్చు. కొలెస్ట్రాల్ కూడా పెరిగకుండా ఉంటుంది. శరీరంలో పేరుకుపోయిన విష పదార్థాలను బయటకు పంపేందుకు దోహదపడుతుంది. ప్రతి రోజు తీసుకోవడం వలన శరీరంలో ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్ సమంగా ఉంటుంది. శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతున్నవారు ఈ రాక్ సాల్ట్ మేలు చేస్తుంది.

ఒత్తిడి తగ్గేందుకు రాక్ సాల్ట్ ఉపకరిస్తుంది. రాక్ సాల్ట్ ను తీసుకోవడం వల్ల ఒత్తిడితోపాటుగా, డిప్రెషన్ సమస్య తొలగిపోతుంది. అధికబరువు సమస్యతో బాధపడుతున్న వారు సాధారణ సాల్ట్ కి బదులుగా రాక్ సాల్ట్ ని తీసుకుంటే బరువు తగ్గొచ్చు. కొవ్వును కరిగించడానికి తోడ్పడుతుంది. రాక్ సాల్ట్ ని తీసుకోవడం వల్ల నిద్రలేమి సమస్య, ఆస్త్మా, డయాబెటిస్, స్టోన్స్ వంటి సమస్యలు రాకుండా చూడవచ్చు. సైనస్ సమస్యకు రాక్ సాల్ట్ చక్కని పరిష్కారం చూపిస్తుంది. డయాబెటిక్ లెవెల్స్ ను నియంత్రణలో ఉంచుతుంది.

అయితే హై బీపీ సమస్యలు ఉన్నవారు ఉప్పును తీసుకోక పోవటమే మంచిది. రాక్ సాల్ట్ ను కూడా మోతాదుకు మించి తీసుకోకూడాదు. అధిక మొత్తంలో వినియోగిస్తే ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఎదురవుతాయి. కీడ్నీ, గుండె సమస్యలతో బాధపడుతున్న వారు వైద్యుల సూచనలు సలహాలు పాటించి రాక్ సాల్ట్ ను వాడుకోవటం ఉత్తమం.