Mumbai : కాఫీ బార్ యువకుడి ఆశయం చూసి షేక్ హ్యాండ్ ఇచ్చి ఆల్ ది బెస్ట్ చెబుతున్న కస్టమర్లు

ఓ యువకుడు తన కాఫీ షాపు ముందు ఓ వినూత్నమైన బోర్డు పెట్టాడు. అతని కాఫీ షాపుకు వచ్చి కాఫీ తాగాక ఆ బోర్డు చూడకుండా ఉండలేరు. చూశాక..వెరీ గుడ్ అంటూ హేక్ హ్యాండ్ ఇచ్చి మరీ ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు.

Mumbai : కాఫీ బార్ యువకుడి ఆశయం చూసి షేక్ హ్యాండ్ ఇచ్చి ఆల్ ది బెస్ట్ చెబుతున్న కస్టమర్లు

Yong mans Dream of Going Global Viral

Updated On : August 17, 2023 / 5:04 PM IST

Dream of Going Global Viral : ఈరోజుల్లో ఓ చిన్న వ్యాపారం చేయాలన్నా ఏదో ఒక కొత్తదనం ఉండాల్సిందే. లేదంటే ఈ పోటీ ప్రపంచంలో నిలిచే పరిస్థితి లేదు. షాపు పేరులో కొత్తదనం ఉండాలి. అందరికి ఆకట్టుకునేలా ఉండాలి. ఇదేం పేరురా బాబూ ఇలాంటి ఐడియాలు ఎక్కడ్నుంచి వస్తారా నాయినా అనేలా ఎన్నో పేర్లను చూశాం. సోషల్ మీడియా వేదికగా కొత్త కొత్త పేర్లు తెగ వైరల్ అవుతుంటాయి.అలాగే తమ ప్రొడక్ట్ ను సేల్ చేసుకోవటానికి ఓ కొత్త నినాదం..ఇలా ఏదోక రూపంలో కొత్తదనం ఉండాలి.

అలా ముంబైలో ఓ యువకుడు తన కాఫీ షాపు ముందు ఓ వినూత్నమైన బోర్డు పెట్టాడు. అతని కాఫీ షాపుకు వచ్చి కాఫీ తాగాక ఆ బోర్డు చూడకుండా ఉండలేరు. చూశాక..వెరీ గుడ్ అంటూ షేక్ హ్యాండ్ ఇచ్చి మరీ ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు. మరి అంతగా ఆకట్టుకునేలా ఆ బోర్డులో ఏముంది..?

New Survey On Lies : అబద్ధాలు ఎక్కువగా చెప్పేది అబ్బాయిలేనట.. అమ్మాయిలు కాదట

మయాంక్ పాండే (Mayank Pandey) అనే యువకుడు ముంబై (Mumbai) మహానగరంలో రద్దీ రోడ్డు పక్కన ది కాఫీ బార్ (Coffee bar) పేరుతో చిన్న స్టాండ్‌పై కాఫీ స్టాల్ (coffee stall) పెట్టుకున్నాడు. తన కాఫీ స్టాల్‌ని అతి పెద్ద మార్కెట్‌గా తీర్చిదిద్దాలనేది ఆశ, ఆశయం కూడా. తన ఆశయాన్ని మర్చిపోకుండా ఎప్పుడు మోటివేట్ చేసేలా ఓ బోర్డు ఏర్పాటు చేసుకున్నాడు.తన చిన్న షాపు ఎదుట ఓ బోర్డుపై ”నేను నా కాఫీ బార్‌ను గ్లోబల్ మార్కెట్‌కు తీసుకెళ్లాలనుకుంటున్నాను”.. అని రాసి పెట్టుకున్నాడు.

అలా అతని వద్ద కాఫీ తాగడానికి వచ్చే వారంతా ఈ బోర్డు చూసి ఆశ్చర్య పడుతూ.. శభాష్ అంటూ మెచ్చుకుంటున్నారు. అతడికి షేక్ హ్యాండ్ ఇచ్చి.. ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు. వారిలో ఎవరో ఆ బోర్డును ఫోటో తీసి సోషల్ మీడియా లో పోస్ట్ చేసారు. దీంతో ఈ వార్త నెట్టింట తెగ వైరల్ అవుతోంది. వెరైటీగా ఏది కనిపించినా తెలిసినా నెటిజన్లు ఎలా స్పందిస్తారో తెలిసిందే. అలా అతని కోరిక నెరవేరాలని కోరుతు కామెంట్స్ పెడుతున్నారు.