Pushups : కండరాల నిర్మాణానికి పుషప్స్!
పుషప్స్ మొదట్లో కొంచెం కష్టంగానే అనిపించినా తరువాత అలవాటై పోతుంది. ముందుగా రోజుకు 10 పుషప్స్ తో ప్రారంభించి నెమ్మది నెమ్మదిగా వాటిని పెంచుతూ పోవాలి.

Muscle Build Pushups
Pushups : మనిషి ఆరోగ్యంగా ఉండేందుకు రోజువారిగా వ్యాయామాలు చేయటం అన్నది చాలా అవసరం. ముఖ్యంగా రోజు వారి వ్యాయామాలు చేసే వారు కండరాల పటిష్టతపై కూడా దృష్టిపెట్టాలి. ఇందుకోసం ప్రత్యేకమైన వ్యాయామాలను ఎంచుకోవాలి. ప్రస్తుతం ఉరుకుల పరుగుల జీవితం, ఒత్తిళ్ళు, ఆహారపు అలవాట్లు వెరసి కండరాలు బలహీనంగా మారుతున్నాయి. సరైన వ్యాయామంతోపాటు, తినే ఆహారం విషయంలో జాగ్రత్తలు పాటించక పోవటమే ఇందు కారణం. సరైన వ్యాయామాలు చేయకపోవటం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు చుట్టుముడుతున్నాయి.
వ్యాయామాలు చేసేందుకు జిమ్ లకే వెళ్ళాల్సిన పనిలేదు. కండరాల నిర్మాణం కోసం ఇంట్లోనే ఉదయం సమయంలో కొద్ది సేపు పుషప్స్ చేస్తే సరిపోతుంది. ప్రధానంగా కండరాల నిర్మాణానికి పుషప్స్ వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు. శరీరంలోని అదనపు కొవ్వులను కరిగించటంలోను పుషప్స్ సహాయపడతాయి. రెగ్యులర్ గా పుష్ అప్స్ చేయడం వల్ల ఎముకలు ఎంతో దృఢంగా మారతాయి. బెల్లీ ఫ్యాట్ తగ్గించుకోవచ్చు. పుషప్స్ చేసే సందర్భంలో కొన్ని రకాల జాగ్రత్తలు తప్పనసరి. ఎందుకంటే చేతులు, నడుము, భుజాలపై అధిక వత్తిడి పడుతుంది. దీని వల్ల కొంత నొప్పి బాధను అనుభవించాల్సి ఉంటుంది. సరైన శిక్షకుడి పర్యవేక్షణలో పుషప్స్ చేయటం మంచిది.
పుషప్స్ మొదట్లో కొంచెం కష్టంగానే అనిపించినా తరువాత అలవాటై పోతుంది. ముందుగా రోజుకు 10 పుషప్స్ తో ప్రారంభించి నెమ్మది నెమ్మదిగా వాటిని పెంచుతూ పోవాలి. సరైన పద్ధతిలో పుషప్స్ చేయటం ద్వారా శరీరానికి పూర్తిస్థాయి శక్తి లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఒక రోజులో మగవారు 40 పుషప్స్, స్త్రీలు 20 పుషప్స్ చేయవచ్చు. పుషప్స్ చేయడం వల్ల చేతులు, కాళ్లు, నడుం కింద, వెనుక భాగాల్లో కండరాలు ధృడంగా తయారవుతాయి. పుషప్స్ చేయటం వల్ల గుండె కొట్టుకునే వేగం పెరుగుతుంది. దీంతో బ్లడ్ పంపింగ్ సామర్ధ్యం మెరుగవుతుంది. అయితే కొన్ని రకాల సమస్యలతో బాధపడుతున్న వారు పుషప్స్ చేయకుండా ఉండటమే మంచిది. శిక్షకుల పర్యవేక్షణలో వారి సూచనలు, సలహాలు పాటిస్తూ ఇలాంటి వాటిని చేయటం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది.