Raksha Bandhan 2023 : మార్కెట్లో కొత్తగా QR కోడ్ రాఖీలు.. మొబైల్‌తో స్కాన్ చేస్తే చాలు

ఏటా రాఖీ పండుగ వస్తుంది. అన్నదమ్ములకు అక్కాచెల్లెళ్లు రాఖీ కట్టడం ఈ పండగ ప్రత్యేకత. ప్రతి సంవత్సరం వినూత్నమైన రాఖీలు కొనడానికి చాలామంది ఇష్టపడతారు. అలాంటి వారికోసం QR కోడ్ రాఖీలు అందుబాటులో వచ్చాయి. ఈ రాఖీల ప్రత్యేకత ఏంటో చదవండి.

Raksha Bandhan 2023 : మార్కెట్లో కొత్తగా QR కోడ్ రాఖీలు.. మొబైల్‌తో స్కాన్ చేస్తే చాలు

Raksha Bandhan 2023

Raksha Bandhan 2023 : అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక రాఖీ. ఈ పండుగ దగ్గర్లోనే ఉంది. రకరకాల రాఖీలతో మార్కెట్లు సందడిగా ఉన్నాయి. డోరేమాన్, భీమ్ వంటి రాఖీలు పిల్లల్ని ఎంతగానో అట్రాక్ట్ చేస్తుంటే.. ఈసారి మార్కెట్లోకి కొత్త రాఖీలు వచ్చాయి. అవే QR కోడ్ రాఖీలు. వీటి ప్రత్యేకత ఏంటో తెలుసుకోవాలని ఉందా?

రాఖీ ఎప్పుడు తీసేయాలి?

రాఖీల తయారీకి రాజస్థాన్ ఎంతో ప్రసిద్ధి. దేశంలో అమ్మే రాఖీలలో 50 శాతం రాఖీలు ఇక్కడే తయారు చేస్తారు. అల్వార్‌లో అయితే అనేక రకాల డిజైన్లలో వినూత్నమైన రాఖీలు తయారవుతాయి. ఎప్పటిలాగే ఈసారి కూడా ఆకర్షణీయమైన డిజైన్లతో రాఖీలు రూపొందించారు. రాఖీ పౌర్ణిమ దగ్గరకి వస్తుండటంతో కొత్త కొత్త రాఖీలతో మార్కెట్ కళకళలాడుతోంది.

ఈ ఏడాది QR కోడ్ డిజైన్‌తో కొత్త రాఖీలు తయారు చేసారు. ఈ రాఖీలు జనాలను ఎంతగానో అట్రాక్ట్ చేస్తున్నాయి. మొబైల్ ఫోన్ ఉపయోగించి స్కాన్ చేస్తే యూ ట్యూబ్‌లో ప్రముఖ కార్టూన్ పాత్రలతో కూడిన యానిమేషన్ చిత్రాలు కనిపించడంతోపాటు పాటలు కూడా వినిపిస్తాయి. డోరేమాన్, భీమ్, గణేష్, కృష్ణుడు వంటి డిజైన్లలో ఈ రాఖీలు లభ్యమవుతున్నాయి. పిల్లలు ఇష్టపడే 3D రాఖీలు కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ డిజైన్లలో మోటూ పత్లూ, భీమ్, బాల గణేశ్ వంటి పాత్రలు, డిజైన్లు అందుబాటులో ఉన్నాయి.

Rakhi For Soldiers : 21 మంది వీరజవాన్ల చిత్రాలతో 27 అడుగుల రాఖీ .. భారత్‌కు రక్షణ కవచంలా నిలిచే సైనికుల కోసం

రాఖీ పండుగ అంటే అందరూ కొత్తరకం రాఖీలు కొనడానికి.. కట్టడానికి ఇష్టపడతారు. ఈసారి ఓంకారపు రాఖీలు, స్వస్తిక్ రాఖీలు, పిల్లల కోసం టెడ్డీ బేర్, లైటింగ్ రాఖీలు కూడా కనిపిస్తున్నాయి. అల్వార్‌లో ఏడాది పొడవునా చాలామంది రాఖీలు తయారు చేస్తుంటారు. సుమారు 5 వేల కుటుంబాలు వీటిని తయారు చేయడమే జీవనోపాధిగా ఎంచుకున్నారు. ఇదే వారికి ప్రధాన ఆదాయ వనరుగా మారింది. అన్నాచెల్లెళ్లు, అక్కా తమ్ముళ్ల అనుబంధానికి గుర్తుగా జరుపుకునే రాఖీ పండుగను ఈసారి ఆగస్టు 30 వ తేదీన జరుపుకోబోతున్నారు.