రెయిన్ కోట్స్, హెల్మట్లతోనే కరోనాతో పోరాడతున్న డాక్టర్లు

  • Published By: sreehari ,Published On : April 1, 2020 / 06:03 AM IST
రెయిన్ కోట్స్, హెల్మట్లతోనే కరోనాతో పోరాడతున్న డాక్టర్లు

Updated On : April 1, 2020 / 6:03 AM IST

కరోనా వైరస్ (Covid-19) రోజురోజుకీ విజృంభిస్తోంది. కరోనాను కట్టడి చేసేందుకు దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతోంది. అయినప్పటికీ కరోనా కొత్త కేసులు నమోదు అవుతూనే ఉన్నాయి. ఇప్పటికే ధ్రువీకరించిన కరోనా పాజిటీవ్ కేసుల బాధితులకు డాక్టర్లు ట్రీట్ మెంట్ అందిస్తున్నారు.

తమ ప్రాణాలను సైతం రిస్క్ లో పెట్టి కరోనా బాధితుల కోసం రాత్రింబవళ్లూ చికిత్స అందిస్తున్నారు. కరోనా బారిన పడకుండా ఉండాలంటే అత్యంత జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో గంటల తరబడి కరోనా బాధితుల మధ్యే ఉంటూ వారికి చికిత్స అందిస్తున్న వైద్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

దేశంలో ప్రధానంగా ప్రొటెక్టివ్ హెల్త్ గేర్ (రక్షణ కవచ దుస్తులు) కొరత వైద్యులను ఆందోళనకు గురిచేస్తోంది. ప్రొటెక్టివ్ హెల్త్ గేర్ కొరత కారణంగా తప్పని పరిస్థితుల్లో డాక్టర్లు రెయిన్ కోట్స్, మోటార్ బైక్ హెల్మట్లు ధరించి కరోనాతో పోరాటం చేస్తున్నారు. దేశంలో రాష్ట్ర ప్రజా ఆరోగ్య వ్యవస్థ పటిష్టంగా లేకపోవడమే ఇందుకు కారణంగా చెప్పవచ్చు. కరోనా మహమ్మారి తీవ్రంగా ప్రబలుతున్న సమయంలో పబ్లిక్ హెల్త్ సిస్టమ్ బలహీనంగా ఉండటం మరింత ఆందోళనకు గురిచేస్తోంది. 
doctorss

సౌత్ కొరియా, చైనా నుంచి సేకరణకు యత్నం :
ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తి సమయంలో వైద్యుల సంరక్షణ కోసం అవసరమైన కరోనా ప్రొటెక్టివ్ గేర్ కొరత కనిపిస్తోంది. ఈ కొరతను అధిగమించేందుకు సౌత్ కొరియా, చైనా నుంచి భారీ పరిమాణంలో ప్రొటెక్టివ్ గేర్ దుస్తులను సేకరించేందుకు భారత్ ప్రయత్నిస్తోందని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు. కానీ, డజన్లకు పైగా డాక్టర్లు కరోనా వైద్యం అందిస్తున్నారు. ఇప్పటివరకూ దేశంలో 1,251 మందికి కరోనా సోకగా, మరో 32 మంది మృతిచెందారు. సరైన మాస్క్ లు, కవరాల్స్ లేకపోవడం కారణంగానే వైద్యులు సైతం కరోనా బారినపడుతున్నారని రాయిటర్స్ పేర్కొంది. 

అంచనా ప్రకారం.. కరోనా వైరస్ వ్యాప్తి పెరిగిపోతోంది.. ఇదే పరిస్థితి కొనసాగితే… మే నెల మధ్యలోగా లక్షకు పైగా మంది ప్రజలకు కరోనా సోకే అవకాశం ఉంది. భారత ఆరోగ్య వ్యవస్థ పూర్తి స్థాయిలో పటిష్టంగా లేకపోవడంతో పాట వైద్యుల కొరత కారణంగా తీవ్రంగా శ్రమించాల్సి వస్తోంది. 
coats

చినిగిన ప్లాస్టిక్ రెయిన్ కోట్స్ :
కోల్ కత్తాలోని ప్రధాన కరోనా చికిత్స విభాగం ఉన్న బెలిఘాటా ఇన్ఫెక్షియస్ డిసీజ్ ఆస్పత్రిలో జూనియర్ వైద్యుల పరిస్థితి అధ్వన్నంగా మారింది. కరోనా బాధితులకు చికిత్స అందించే వైద్యులు చినిగిన ప్లాస్టిక్ రెయిన్ కోట్స్ ధరించాల్సి వస్తోంది. ఇక్కడి వైద్యులకు గతవారం కరోనా రోగులను చినిగిన ప్లాస్టిక్ రెయిన్ కోట్స్ పరీక్షించాల్సి వచ్చింది. దీనికి సంబంధించి ఇద్దరు వైద్యులు, వారి ఫొటోలను రాయిటర్స్ నివేదించింది. 
masks

దెబ్బతిన్న ప్రొటెక్టివ్ మాస్క్‌లు :
హర్యాణాలో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. కరోనా సోకిన వారికి చికిత్స అందించే ESI ఆస్పత్రిలో వైద్యులకు N95 మాస్క్‌లు అందుబాటులో లేవు. గత్యంతరం లేని పరిస్థితుల్లో మోటార్ బైక్ హెల్మట్లతోనే కరోనా పేషెంట్లకు ట్రీట్ మెంట్ అందిస్తున్నారు. దీనిపై అక్కడి వైద్యుల్లో డాక్టర్ సందీప్ గార్గ్ మాట్లాడుతూ.. మాకు N95 మాస్క్ లు లేవు. అందుకే నేను హెల్మట్ పెట్టుకున్నాను. ముందుభాగంలో హెల్మట్ కవచం అడ్డుగా ఉండటంతో నా ముఖమంతా మూసివేసి ఉంటుంది.. దీనికితోడుగా మరో సర్జికల్ మాస్క్ కూడా ఉందని చెప్పారు. 
doctors

వైద్యులకు తప్పని దుస్థితి :
కరోనా పేషెంట్లకు ట్రీట్ మెంట్ చేస్తున్న వైద్యుల దుస్థితి బాధాకరంగా కనిపిస్తోంది. మహమ్మారితో అధిక భారం కలిగిన ప్రజారోగ్య వ్యవస్థ కొన్నిఏళ్లుగా నిధులు వినియోగంలో సమగ్రంగా లేదు. భారత జిడిపిలో 1.3% ప్రజారోగ్యం కోసం ఖర్చు చేస్తుంది. ఇది ప్రపంచంలోనే అతి తక్కువని చెప్పవచ్చు. మరోవైపు చాలామంది జూనియర్ వైద్యులు తగిన భద్రతా పరికరాలు లేకుండా కరోనా పేషెంట్లకు చికిత్స చేసేందుకు నిరాకరిస్తున్నారు.

Also Read | చైనాను మించి : అమెరికాలో 4వేలు దాటిన కరోనా మరణాలు…ఒక్కరోజే 865మంది మృతి