Drinking Water: ఉదయాన్నే బ్రష్ చేయకుండా నీళ్లు తాగొచ్చా..

మనలో చాలామంది ఉదయాన్నే వేడి కప్పుతో చాయ్ తాగి రోజు ఆరంభిస్తాం. అది కూడా బ్రష్ చేసుకున్న తర్వాతే.. కానీ, సర్టిఫైడ్ యోగా ఇన్‌స్ట్రక్టర్, హోమియోపతి డాక్టర్ అయిన డా. నూపర్ రోహ్‌తగి ప్రతి ఉదయాన్ని గ్లాసు నీళ్లతో మొదలుపెట్టాలని చెబుతున్నారు. ఆయుర్వేద సూచిస్తున్న దానిని బట్టి మంచినీళ్లు తాగి రోజు ఆరంభించాలట.

Drinking Water: ఉదయాన్నే బ్రష్ చేయకుండా నీళ్లు తాగొచ్చా..

What Happens If You Drink Too Much Water Overhydration Symptoms (1)

Updated On : July 13, 2022 / 6:57 PM IST

Drinking Water: మనలో చాలామంది ఉదయాన్నే వేడి కప్పుతో చాయ్ తాగి రోజు ఆరంభిస్తాం. అది కూడా బ్రష్ చేసుకున్న తర్వాతే.. కానీ, సర్టిఫైడ్ యోగా ఇన్‌స్ట్రక్టర్, హోమియోపతి డాక్టర్ అయిన డా. నూపర్ రోహ్‌తగి ప్రతి ఉదయాన్ని గ్లాసు నీళ్లతో మొదలుపెట్టాలని చెబుతున్నారు. ఆయుర్వేద సూచిస్తున్న దానిని బట్టి మంచినీళ్లు తాగి రోజు ఆరంభించాలట.

“రోజూ ఉదయం లేవగానే నీళ్లు తాగండి. అది మీరు బ్రష్ చేయకపోయినా సరే” అని ఇన్‌స్టాగ్రామ్ వేదికగా డా. రోహ్‌తగి వెల్లడించారు.

రోజు మొత్తానికి సరిపడ నీరు తీసుకోవడం చాలా ముఖ్యం. నీరు ఒక్కటే.. హైడ్రేట్ గా ఉంచి శరీర ఉష్ణోగ్రతను కంట్రోల్ లో ఉంచుతుంది. అలా వేస్టేజ్ ను కిడ్నీల నుంచి బయటకు పంపేస్తుంది. సెలైవాను క్రియేట్ చేయడం, పలు శరీర భాగాలకు న్యూట్రియంట్లను అందుబాటులో ఉంచుతుంది.

Read Also: నీరు అధికంగా తాగడం వల్ల వచ్చే అనర్థాలు

నిద్రపోయినప్పుడు నోటిలో బ్యాక్టీరియా ఏర్పడుతుంది. ఆ బ్యాక్టీరియాను మనం మింగడం ద్వారా ఇమ్యూనిటీ పెరుగుతుందట.

దాని వల్ల జీర్ణ క్రియ పెరిగి.. అరుగుదల లేకపోవడాన్ని అరికడుతుంది కూడా.

అధిక రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది.

అలా ఖాళీ కడుపుతో నీరు తాగడం వల్ల నోటి ఆరోగ్యంతో పాటు చెడు శ్వాసను కూడా దూరం చేస్తుంది.

సెలైవాను ఉత్పత్తి చేసి నోరు పొడిబారిపోకుండా రీహైడ్రేట్ అయ్యేందుకు హెల్ప్ అవుతుంది.

ఫిట్‌నెస్ నిపుణులు సోనియా బక్షి కూడా రోజూ లేవగానే కనీసం గ్లాసు నీళ్లు తాగాలి. అలా అనారోగ్యం నుంచి కాపాడి ఇమ్యూన్ సిస్టమ్ మెరుగయ్యేలా చేస్తుంది.

ఎలాంటి నీరు తాగాలంటే..
నిపుణులు చెప్పిన దాని ప్రకారం.. ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీరు తాగడం బెటర్. లేచిన వెంటనే వీలైనంత త్వరగా కనీసం రెండు గ్లాసుల నీళ్లు తాగండి. అది కూడా కూర్చొని సిప్పుల రూపంలో తాగాలి.