Skin Freshness : అసౌకర్యం కలిగించే వేసవి చెమటలు! చర్మం తాజాదనం కోసం?

రాత్రి నిద్రించడానికి ముందు కీరదోసకాయ రసాన్ని ముఖానికి అప్లై చేస్తే అధిక చెమట సమస్యను తగ్గించుకోవచ్చు. వేసవి సీజన్ లో రాత్రుల్లో ఇలా క్రమం తప్పకుండా చేస్తుంటే చెమట నుండి ఉపశమనం పొందవచ్చు.

Skin Freshness : అసౌకర్యం కలిగించే వేసవి చెమటలు! చర్మం తాజాదనం కోసం?

Summer Sweats

Updated On : April 7, 2022 / 11:53 AM IST

Skin Freshness : వేసవిలో అత్యధిక ఉష్ణోగ్రతలు పెరగటంతో శరీరంలో అనేక మార్పులు సంభవిస్తాయి. ముఖ్యంగా వేసవి వేడి కారణంగా చెమటలు విపరీతంగా పోస్తుంటాయి. చెమటలు పోయటం వల్ల చికాకు కలుగుతుంది. అరచేతుల్లో,కాళ్లలో , ముఖంలో చెమటలతోపాటు , బాడీ మొత్తం చెమటలతో ఇబ్బంది, అసౌకర్యం కలుగుతుంది. చెమటల కారణంగా వచ్చే అసౌకర్యాన్ని నివారించుకునేందుకు చాలా మంది పదేపదే స్నానం చేస్తుంటారు. ముఖాన్ని శుభ్రం చేసుకుంటుంటారు. అయినప్పటికీ ఏమాత్రం ఫ్రెష్ గా కనబడరు. వేసవి కాలంలో అంతా ఇలాంటి సమస్యనే ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖంలో చెమటలు పడితే ఆసమయంలో చర్మం కోసం తగిన జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. ఎక్కువ చెమటలు పట్టడం వల్ల చర్మం జిడ్డుగా, ఆయిలీగా కనబడుతుంది. ఎంత మేకప్ వేసుకున్నా ప్రయోజనం ఉండదు. వేసవిలో చెమటలు తగ్గించుకోవడం అంత సులభం కాదు . అయితే ఇంట్లో ఉండే కొన్ని హోం రెమెడీస్ తో ఈ సమస్యను నివారించుకోవచ్చు. కొన్ని చిట్కాలను ప్రతిరోజు పాటించటం వల్ల మంచి ఫలితం ఉంటుంది. వేసవి సీజన్ లో ముఖంలో చెమటలు పట్టకుండా సహాయపడే కొన్ని ఫేషియల్స్ గురించి తెలుసుకుందాం..

రోజులో రెండు మూడు సార్లు చల్లటి నీటితో ముఖం శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చర్మం రంద్రాల నుండి ఎక్కువ చెమట పట్టకుండా ఉంచుతుంది. సమ్మర్ సీజన్ లో కోల్డ్ వాటర్ ఎక్కువగా ఉపయోగించి ముఖం శుభ్రపరుచుకోవడం వల్ల నేచురల్ గా హీట్ తగ్గించుకోవచ్చు. ఫేషియల్ స్వెట్టింగ్ కూడా తగ్గించుకోవచ్చు .

వేసవి సీజన్ లో ఎక్కువగా మేకప్ ప్రొడక్ట్స్ ను ఉపయోగించడం, మేకప్ వేసుకుని ఎండలో తిరగడం , రాత్రుల్లో మేకప్ తొలగించుకుండా అలా నిద్రించడం వంటి పనులు చేయడం వల్ల చెమటలు మరింత ఎక్కువ అవుతాయి. చెమటలతో పాటు, చర్మ సమస్యలు కూడా అధికమవుతాయి. వేసవి సీజన్ లో మేకప్ వేసుకోకపోవడమే మంచిది.

రాత్రి నిద్రించడానికి ముందు కీరదోసకాయ రసాన్ని ముఖానికి అప్లై చేస్తే అధిక చెమట సమస్యను తగ్గించుకోవచ్చు. వేసవి సీజన్ లో రాత్రుల్లో ఇలా క్రమం తప్పకుండా చేస్తుంటే చెమట నుండి ఉపశమనం పొందవచ్చు. ఆయిల్ బేస్డ్ క్రీమ్స్, ప్యాక్స్, మేకప్ ప్రొడక్ట్స్ కు దూరంగా ఉండాలి. ఈ స్కిన్ ప్రొడక్ట్స్ వల్ల చర్మ రంద్రాలు బ్లాక్ అవుతాయి. దాంతో ఆ ప్రదేశంలో మురికి చేరుతుంది. దాంతో చెమట ఎక్కువ అవుతుంది. అందువల్ల ఆయిల్ ప్రొడక్ట్స్ కు దూరంగా ఉండాలి.

యాపిల్ సైడర్ వెనిగర్ లో ఆల్కలైన్ లక్షణాలు అధికంగా ఉన్నాయి. ఇది అనేక బెనిఫిట్స్ ను అందిస్తుంది. ముఖ్యంగా వేసవి సీజన్ లో ఆపిల్ సైడర్ వెనిగర్ చర్మానికి అప్లై చేయడం వల్ల చర్మ రంద్రాలు శుభ్రపడతాయి. చర్మ సమస్యలను నివారించుకోవచ్చు.  గుప్పెడు ఐస్ క్యూబ్స్ తీసుకుని, శుభ్రమైన వస్త్రంలో ఐస్ క్యూబ్స్ పెట్టి, చుట్టాలి. తర్వాత ముఖం మీద మర్ధన చేయాలి. ఈ పద్దతిని తరచూ ఫాలో అవుతుంటే ఎఫెక్టివ్ గా ముఖానికి చెమటను నివారించుకోవచ్చు .

టాల్కమ్ పౌడర్ త్వరగా చెమటను గ్రహిస్తుంది. ఇంటి నుండి బయట వెళ్లడానికి ముందుగా కొద్దిగా టాల్కమ్ పౌడర్ ను ముఖం, మెడ, గొంతు భాగంలో అప్లై చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల వేసవిలో అధిక చెమట, అసౌకర్యాన్ని తగ్గించుకోవచ్చు.