Pepper Spray : పెప్పర్ స్ప్రే కొంటున్నారా? ఈ విషయాలు ఖచ్చితంగా తెలుసుకోండి

మహిళలు తమ ఆత్మరక్షణ కోసం పెప్పర్ స్ప్రే వాడుతుంటారు. దీనిని కొనుగోలు చేసేముందు ఖచ్చితంగా కొన్ని విషయాలు తెలుసుకోవాలి.

Pepper Spray : పెప్పర్ స్ప్రే కొంటున్నారా? ఈ విషయాలు ఖచ్చితంగా తెలుసుకోండి

Pepper Spray

Updated On : September 3, 2023 / 12:12 PM IST

Pepper Spray : పెప్పర్ స్ప్రే అనేది ఆత్మ రక్షణ కోసం వాడే సాధనం. అత్యవసర సమయాల్లో మాత్రమే దీనిని వాడతారు. దీనిని కొనుగోలు చేసేటపుడు ఖచ్చితంగా కొన్ని విషయాలు అయితే తెలుసుకోవాలి.

Delhi Metro : ఢిల్లీ మెట్రోలో ఇద్దరు మహిళల మధ్య రచ్చ.. పెప్పర్ స్ప్రే ప్రయోగించిన మహిళ వీడియో వైరల్

పెప్పర్ స్ప్రే  ఎవరైనా మనకి  ప్రాణ హాని చేసినపుడు ఆత్మ రక్షణకి ఉపయోగపడుతుంది. భారతదేశంలో ఇది చట్టబద్ధమైనది. దీనిని కొనడానికి ఎటువంటి డాక్యుమెంటేషన్ అవసరం లేదు. అయితే దీనిని తయారు చేసేవారు మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వ లైసెన్స్ తీసుకోవాలి. పెప్పర్ స్ప్రే అనేది మిరియాలతో తయారు చేసే ఒక ఘాటైన స్ప్రే. ఇది చల్లగానే వెంటనే కళ్లు మండుతాయి. కొద్దిసేపటి వరకూ కళ్లు తెరవలేరు. శ్వాస తీసుకోవడం ఇబ్బంది అవుతుంది. ఘాటుకు తుమ్ములు వస్తాయి. ముక్కు నుంచి నీరు కారుతుంది. దగ్గు వస్తుంది. దీని ప్రభావం తగ్గడానికి అరగంట నుంచి గంట సమయం పడుతుంది. ఒకసారి స్ప్రే చేస్తే కళ్లకు ఎటువంటి హాని ఉండదు. కానీ ఉబ్బసం ఉన్న రోగులకు మాత్రం కొంచెం ఇబ్బందికరమైనది. ఈ పెప్పర్ స్ప్రే చేతిలో పట్టేంత సీసాల్లో దొరుకుతుంది. ముఖ్యంగా ఆకతాయిల నుంచి మహిళల ఆత్మ‌రక్షణ కోసం వీటిని మార్కెట్లోకి ప్రవేశపెట్టారు.

Women fighting on the road : నడిరోడ్డుపై లేడీస్ బ్యాచ్ ఫైటింగ్.. కంట్రోల్ చేయడానికి ఆ పోలీస్ ఏం చేశాడంటే?

పెప్పర్ స్ప్రే మెట్రోలో ప్రయాణిస్తున్నప్పుడు వెంట తీసుకెళ్లాలంటే కొన్ని నియమాలు ఉన్నాయి. వాటిని స్ధానిక మెట్రో అధికారుల నుంచి తెలుసుకోవాలి. అలాగే ఎంత పరిమాణంలో తీసుకువెళ్లాలి అనేది కూడా ఉంటుంది. పాకెట్‌లో సరిపోయే విధంగా కీచైన్ పరిమాణంలో తీసుకెళ్లవచ్చు. పెప్పర్ స్ప్రే కేవలం మనకు హాని చేసే మనుష్యులపైనే కాదు జంతువులపై కూడా ఉపయోగించి తమను తాము రక్షించుకునేందుకు వాడతారు. మన పాకెట్‌లో పెప్పర్ స్ప్రే ఉంటే సరిపోదు దానిని ఎలా ఉపయోగించాలి? దుర్వినియోగం చేయడం వల్ల ఎదురయ్యే ప్రమాదాలు ఏంటి? దీనిని ఎలా పరీక్షించాలి? ఇలాంటి జాగ్రత్తలు పెప్పర్ స్ప్రే క్యారీ చేసే వారు తప్పకుండా తెలుసుకోవాలి.