Stammering facts and causes : నత్తి ఉందని ఎత్తి చూపకండి .. చెప్పేది వినడానికి సమయం ఇవ్వండి

కొందరు చిన్నపిల్లలు తడబడుతూ మాట్లాడుతుంటారు. నత్తి అనేది 3 సంవత్సరాల వయసున్న పిల్లల్లో బయటపడుతుందట. నత్తి అనేది జన్యుపరంగా వచ్చే అవకాశాలు ఎక్కువని అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ సమస్యను సరైన సమయంలో గుర్తించడమే కాదు వైద్యుల సలహాలు తీసుకోవడం అవసరం.

Stammering facts and causes : నత్తి ఉందని ఎత్తి చూపకండి .. చెప్పేది వినడానికి సమయం ఇవ్వండి

Stammering facts and causes

Updated On : August 1, 2023 / 12:26 PM IST

Stammering facts and causes : చిన్న పిల్లల్లో ఎక్కువగా నత్తి సమస్య కనిపిస్తుంది. అంటే మాటలు తడబడుతుంటారు. నత్తి అనేది న్యూరో డెవలప్ మెంటల్ సమస్య. చిన్నపిల్లల్లో 2 నుంచి 6 సంవత్సరాల మధ్య సంభవిస్తుందట. ఇక పెద్దవారిలో ఈ తడబాటు అనేది 1% ఉంటుందట. అయితే నత్తిగా మాట్లాడటానికి ఇంకా ఎలాంటి కారణాలు ఉన్నాయి.

Zebra line On Road : వర్షాకాలంలో జీబ్రా లైన్ దాటేటప్పుడు బీ కేర్ ఫుల్ .. తెలుపురంగుపై ‘అడుగు’ జాగ్రత్త ఎందుకంటే..

కొంతమంది పిల్లలు మాట్లాడటానికి ప్రయత్నించినపుడు బాగా తడబడతారు. తాను చెప్పాలనుకున్నది అనర్గళంగా చెప్పలేరు. ఇది కుటుంబం నుంచి జన్యుపరంగా వచ్చే సమస్య. ఫ్యామిలీలో ఎవరికైనా ఈ సమస్య ఉంటే వారసత్వంగా ఈ సమస్య వచ్చే అవకాశాలు ఎక్కువట. అలాగని దీనిని అధ్యయనాలు పూర్తిగా స్పష్టం చేయలేదు. ఎందుకంటే కవలల్లో ఒకరికి నత్తి ఉంటే.. మరొకరికి ఉండకపోవచ్చు. నత్తి రావడానికి ఇంకా కొన్ని అంశాలు కూడా ముడిపడి ఉన్నాయి.

 

మామూలు వ్యక్తులకు నత్తిగా మాట్లాడేవారికి బ్రెయిన్ పనితీరులో కొన్ని స్వల్పమైన తేడాలు ఉన్నాయట. ఈ విషయాన్ని కొన్ని బ్రెయిన్ ఇమేజింగ్ అధ్యయనాలు చెబుతున్నాయి. మెదడులోని కొన్ని భాగాల నిర్మాణంలో చిన్నపాటి తేడాలు కూడా కారణమట. మూడు సంవత్సరాల వయసు ఉన్న పిల్లల్లో ఎక్కువగా నత్తి కనిపిస్తుంది. ఈ సమయంలోనే వారిలోని ఈ సమస్యను త్వరితగతిన గుర్తించాలి.

Stay Healthy During Monsoon : వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండాలంటే.. మీరు తెలుసుకోవాల్సిన విషయాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు!

నత్తి సమస్యతో ఇబ్బంది పడేవారు కొంచెం నెమ్మదిగా ఉంటారట. వేగంగా మాట్లాడలేరు. ఎందుకంటే వారి స్పీట్ మోటార్ సిస్టమ్‌పై చాలా ఒత్తిడి ఉంటుందట. అలాంటి సమయంలో వారు నెమ్మదిగా మాట్లాడుతుంటారు. ఎక్కువమంది జనం మధ్యలో ఉన్నప్పుడు తమ అభిప్రాయాలు చెప్పాల్సి వచ్చినపుడు కూడా ఒత్తిడి మరింత ఎక్కువై ఎక్కువగా తడబడతారు. అలాగని వారు ఆందోళన వల్ల తడబడరట. అయితే వారు పదాలను పలకడానికి కష్టపడుతుంటే కుటుంబ సభ్యులు వారిని ఇబ్బంది పెట్టకూడదు. వారు చెప్పాలనుకున్నది పూర్తి చేసేవరకు టైం ఇవ్వాలి. వేగంగా, లేదా నెమ్మదిగా మాట్లాడండి అని వారికి చెప్పకుండా వారు చెప్పేది వినడానికి సమయం ఇవ్వాలి.

 

నత్తిగా మాట్లాడటం పిల్లల్లో గమనించిన వెంటనే చైల్డ్ స్పెషలిస్ట్‌ని సంప్రదించాలి. డాక్టర్ సలహా మేరకు స్పీచ్ లేదా లాంగ్వేజ్ డిజార్డర్స్ స్పెషలిస్ట్‌కి చూపించవచ్చు. ఇక పెద్దవారిలో కూడా ఈ తడబాడు అనేది వస్తుంది. అందుకు కారణం స్ట్రోక్ లేదా న్యూరోలాజికల్ సమస్యలు కావచ్చు. లేదంటే ఏదైనా తీవ్రమైన మానసిక గాయం కూడా కావచ్చు. అటువంటి వారు కూడా స్పీచ్ థెరపిస్ట్‌ను సంప్రదించడం మేలు.

Vegetable Crops : వర్షాకాలంలో వేసుకోదగ్గ కూరగాయ పంటలు… చేపట్టాల్సిన యాజమాన్య చర్యలు