Loud music in bars : బార్లలో లౌడ్ మ్యూజిక్ ఎందుకు ప్లే చేస్తారో తెలుసా?
బార్లలో లౌడ్ మ్యూజిక్ ప్లే చేస్తారు. చాలామంది కస్టమర్లను యాక్టివ్‌గా ఉంచడానికి బార్ యజమానులు అలా చేస్తారని అనుకుంటారు. బార్ నిర్వాహకులు ఆ ట్రిక్ ఎందుకు ప్లే చేస్తారంటే?

Loud music in bars
Loud music in bars : బార్లలో, పబ్‌లలో సంగీతం ప్లే అవుతుంటుంది. అయితే చాలా బిగ్గరగా సంగీతం ప్లే చేస్తుంటారు. బార్‌కి వచ్చే వాళ్లలో ఉత్సాహాన్ని పెంచడానికి కాబోలు అనుకుంటారు చాలామంది. అయితే బార్ యజమానులు ఈ ట్రిక్ ఎందుకు ప్లే చేస్తారో చాలామందికి తెలియకపోవచ్చు.
Elderly man song viral : పాత్రపై సంగీతం వాయిస్తూ పెద్దాయన పాడిన పంజాబీ పాట వినండి
మ్యూజిక్ ప్లే చేయని బార్‌లు ఉండవేమో.. ఎందుకంటే సంగీతం ప్లే చేయని బార్లలో తాగడానికి చాలామంది ఇష్టపడకపోవచ్చు. ఎప్పుడైతే మ్యూజిక్ ప్లే చేయడం మొదలుపెడతారో.. ఇక మద్యం విపరీతంగా తాగడం మొదలుపెడతారు. సంగీతానికి, మద్యానికి లింక్ ఏంటి? అనుకుంటున్నారా? స్పీడ్‌గా ప్లే అయ్యే సంగీతం వింటే దానికి తగ్గట్లుగా అంతే వేగంగా ఎక్కువగా డ్రింక్ చేస్తారట. అధ్యయనాల్లో ఈ విషయం తేలింది. మ్యూజిక్ టెంపోని బట్టి చాలా స్పీడ్‌గా తాగాలనే కోరిక పెరిగి ఎక్కువ మొత్తంలో మద్యం తాగుతారట. యూనివర్శిటీ డి బ్రెటాగ్నే-సుడ్ పరిశోధకుడు గుగెన్ ఈ విషయన్ని వివరించారు. మూడు వారాల వ్యవధిలో రెండు వేర్వేరు బార్లలో జరిగిన పరిశోధనలో ఈ విషయం తేలిందట.
Listen Music : గుండె ఆరోగ్యానికి సంగీతం వినటం మంచిదేనా? రోజులో ఒక్క అరగంట సంగీతం వింటే!
ఆహారం, పానీయాలపై సంగీతం ప్రభావం చూపిస్తుందని.. లౌడ్ మ్యూజిక్ ఉద్రేకాన్ని కలిగించడంతో వేగంగా తాగడానికి, తినడానికి ఆర్డర్ చేయడానికి దారి తీసిందని పరిశోధకుడు పేర్కొన్నాడు. మీడియం లెవెల్లో సంగీతం ప్లే చేయడాన్ని బార్ నిర్వాహకులు ప్రోత్సహించాలని, లేదంటే మద్యం ప్రభావం కస్టమర్లపై చాలా ఎక్కువగా ఉంటుందని గుగెన్ తెలిపాడు.