Fatty Liver : కాలేయానికి కొవ్వుతో ముప్పు

ఫ్యాటీ లివర్ సమస్య ఉత్పన్నమైన సందర్భంలో పొట్టలో బరువుగా ఉంటుంది. ఆకలి తగ్గిపోతుంది. పొట్ట పైభాగంలో నొప్పిగా ఉంటుంది.

Fatty Liver : కాలేయానికి కొవ్వుతో ముప్పు

Liver

Updated On : March 1, 2022 / 11:52 AM IST

Fatty Liver : మానవ శరీరంలో అతిముఖ్యమైన, కీలకమైన అవయవం కాలేయం. శరీరంలోని కొవ్వును వివిధ భాగాలకు పంపిణీ చేయటంలో లివర్ ప్రధానపాత్ర పోషిస్తుంది. శరీరంలోకి వివిధ రూపాల్లో వచ్చిన కొవ్వులన్నీ కాలేయంలో నుంచి వచ్చిన ఎంజైమ్స్‌తోనే జీర్ణమవుతాయి. శరీరానికి, గుండె వంటి కొన్ని అవయవాలకు కొంత ఫ్యాటీ యాసిడ్స్ అవసరమవుతాయి. అధిక మొత్తంలో కొవ్వు వచ్చి చేరినపుడు శరీరంలో పేరుకుపోతుంది. దీని వల్ల కాలేయ కణాలలో కొవ్వు పేరుకుపోతుంది. ఈ అవయవంలో కొవ్వు అధికంగా చేరితే ఫ్యాటీలివర్ సమస్య వస్తుంది. నిర్లక్ష్యం చేస్తే లివర్ సిర్రోసిస్‌గా మారే అవకాశం ఉంటుంది. అల్ట్రాసౌండ్ పరీక్షల్లో ద్వారా ఈ ఫ్యాటీలివర్ సమస్యను గుర్తించవచ్చు.

ఫ్యాటీ లివర్ సమస్య ఎక్కువగా ఆల్కహాల్ తీసుకునే వారిలో కనిపిస్తోంది. నూనె పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం, చిప్స్, బర్గర్స్ వంటి జంక్‌ఫుడ్స్ తినడం, ఉదయం అల్పాహారం తీసుకోకపోవడం, సమయపాలనలేని భోజనం, ఆహారపు అలవాట్లలో మార్పులు కాలేయవాపుకు కారణమవుతున్నాయి. డయాబెటిస్ మూలంగా కాలేయంలో కొవ్వు పేరుకుపోయే అవకాశం ఉంది. ఈ సమస్యను నిర్లక్ష్యం చేస్తే కాలేయ కణాలు ఉబ్బి పగిలిపోతాయి. దీంతో ఆ ప్రదేశంలో వాపు వస్తుంది. ఆల్కహాల్ ఎక్కువ మెతాదులో తీసుకోవడం వల్ల ఈ సమస్య వచ్చినట్లయితే ఆల్కహాలిక్ హెపటైటిస్ అంటారు. ఆహారపు అలవాట్ల వల్ల వచ్చినట్లయితే నాన్ఆల్కహాలిక్ హెపటైటిస్ అంటారు. వైరస్‌ల వల్ల వచ్చినట్లయితే వైరల్ హెపటైటిస్ అని పిలుస్తారు. చికిత్స తీసుకోకపోతే లివర్ పూర్తిగా కుచించుకుపోయి చివరకు లివర్ సిర్రోసిస్ కు దారి తీసే ప్రమాం ఉంటుంది.

ఫ్యాటీ లివర్ సమస్య ఉత్పన్నమైన సందర్భంలో పొట్టలో బరువుగా ఉంటుంది. ఆకలి తగ్గిపోతుంది. పొట్ట పైభాగంలో నొప్పిగా ఉంటుంది. కామెర్లు వస్తాయి. రక్తస్రావం , రోగనిరోధక శక్తి తగ్గిపోవటం, ఇన్ ఫెక్షన్స్ రావటం, లివర్ పనితీరు మందగించటం, పొట్ట, కాళ్ళలో నీరు చేరటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. క్రమేపి శరీరంలోని అవయవాలు దెబ్బతినటం ప్రారంభిస్తాయి. కొంతమందిలో అసలు లక్షణాలే కనిపించవు. కారణాన్ని తెలుసుకుని అందుకు తగిన చికిత్స తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. అల్ట్రాసౌండ్ అబ్డామిన్ స్కానింగ్‌ను చేస్తే కాలేయ పనితీరును తెలుసుకోవచ్చు. లివర్ ఫంక్షన్ టెస్ట్ వల్ల కనుక్కోవచ్చు.

ఫ్యాటీ లివర్ సమస్యను మందులతో పూర్తిగా తగ్గించవచ్చు. ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకోవడం, బరువును తగ్గించుకోవడంతో పాటు మందులు వాడాల్సి ఉంటుంది. 70 శాతం లివర్‌పాడైపోయినా మిగతా బాగున్నలివర్ దెబ్బతినకుండా చికిత్స ఇవ్వడం జరుగుతుంది. పూర్తిగా లివర్ సిర్రోసిస్‌కు దారితీస్తే బాగుచేయటం కుదరదు. అంతేకాకుండా గాల్ బ్లాడర్ లో స్టోన్స్ ఏర్పడటానికి కొలెస్ట్రాల్ కారణమవుతుంది. శరీరంలో కొవ్వు శాతం ఎక్కువయినపుడు కాలేయంలో కొవ్వు శాతం పెరిగిపోతుంది. అప్పుడు కాలేయం దాన్ని బయటకు పంపించేస్తుంది. ఇది గాల్‌బ్లాడర్‌లోకి వెళ్లి చివరకు గట్టిపడి స్టోన్స్‌గా మారిపోతుంది.