Heart Disease : స్త్రీలలో గుండెపోటు, రక్తనాళాల జబ్బులు రాకుండా ఉండాలంటే!

గుండె జబ్బుల కారణంగా మృత్యువాతపడే ముప్పు మధుమేహం ఉన్న పురుషులకంటే కూడా మధుమేహం ఉన్న స్త్రీలకు చాలా ఎక్కువ. గర్భిణులకు హైబీపీ, మధుమేహం పెద్ద సమస్యగా చెప్పవచ్చు.

Heart Disease : స్త్రీలలో గుండెపోటు, రక్తనాళాల జబ్బులు రాకుండా ఉండాలంటే!

Heart Disease

Updated On : June 12, 2022 / 8:22 AM IST

Heart Disease : ఇటీవలి కాలంలో గుండె జబ్బులు, రక్తనాళాల సమస్యలతో మరణిస్తున్నమహిళ సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. అన్ని వయస్సుల వారు వీటి బారిన పడుతున్నారు. దైనందిన జీవితపు అలవాట్లు, తినే ఆహారం, పని ఒత్తిడి గుండె జబ్బులు, రక్తనాళాల వ్యాధులకు ప్రధాన కారణమౌతున్నాయి. ఆరోగ్యకరమైన జీవన విధానంతో ఈ జబ్బులను దరిచేరకుండా చూసుకోవచ్చు. ముందుగా గుర్తిస్తే వీటిని నివారించుకోవచ్చు. ఏమాత్రం అశ్రద్ధ చేసినా చివరకు ప్రాణాలకే ముప్పు వాటిల్లుతుంది.

గుండె జబ్బుల కారణంగా మృత్యువాతపడే ముప్పు మధుమేహం ఉన్న పురుషులకంటే కూడా మధుమేహం ఉన్న స్త్రీలకు చాలా ఎక్కువ. గర్భిణులకు హైబీపీ, మధుమేహం పెద్ద సమస్యగా చెప్పవచ్చు. పుట్టే బిడ్డలకు ఇవి ప్రాణసంకటంగా నిలుస్తాయి. పక్షవాతం, గుండె జబ్బులకు అతిపెద్ద కారకంగా హైబీపీని చెప్పవచ్చు. బీపీ ఎక్కువున్నా ఎటువంటి హెచ్చరికలూ, లక్షణాలూ, సంకేతాలూ ఉండవు. దీన్ని సైలెంట్‌ కిల్లర్‌ అంటారు. తరచూ బీపీని చూసుకుంటుండటం మంచిది. నెలసరి నిలిచిపోయిన స్త్రీలకు హైబీపీ ముప్పు ఎక్కువ. కాబట్టి వారు తరచూ బీపీ చూపించుకోవటం మంచిది.

పొగతాగే స్త్రీలకు పురుషుల కంటే కూడా పక్షవాతం ముప్పు ఎక్కువ. తాము తాగకున్నా ఇంట్లో ఇతరులు వదిలే పొగ పీల్చినా స్త్రీలకు గుండె జబ్బుల ముప్పు 15% పెరుగుతుంది. అధిక బరువు, వూబకాయం ఉన్నవారిలో మధుమేహం, గుండె జబ్బుల వంటివి వచ్చే అవకాశం మరింత అధికం. తీసుకునే ఆహారంలో కొన్ని జాగ్రత్తలు పాటిస్తే సమస్యలు దరిచేరకుండా చూసుకోవచ్చు. రకరకాల కూరగాయలతో వంటలు వండేలా చూసుకోవాలి. సాయంత్రం, రాత్రి ఆహారంలో ఉప్పు, చక్కెర, కొవ్వుల వంటివి బాగా తగ్గించి పండ్లు, కూరగాయలు ఉండేలా చూడాలి. శారీరక శ్రమకోసం రోజువారిగా వ్యాయామాలు చేయటం అలవాటు చేసుకోవాలి.