Hair : ఒత్తైన జుట్టుకోసం ఇలా చేసి చూడండి…
ఇటీవలి కాలంలో తలకు నూనె రాయకుండా వదిలేయటం ఫ్యాషన్ గా మారింది. అయితే ఇలా చేయటం ఏమాత్రం మంచిది కాదు. తలకు నూనె రాయకపోవటం వల్ల జుట్టు దెబ్బతింటుంది.

Hair
Hair : జుట్టు విషయంలో చాలా మంది నిర్లక్ష్యం వహిస్తుంటారు. మరికొందరు కేశ సంపదపై ప్రత్యేకమైన దృష్టిని కేంద్రీకరిస్తారు. ముఖ్యంగా మహిళలు జుట్టు విషయంలో ప్రత్యేక మైన శ్రద్ధ చూపుతుంటారు. ఆరోగ్యవంతమైన జుట్టు కోసం అనేక చిట్కాలను పాటిస్తుంటారు. అయితే జీవన శైలిలో మార్పుల కారణంగా ఆరోగ్యవంతమైన, ఒత్తైన జుట్టును మీ సొంతం చేసుకోవచ్చు. ముఖ్యంగా చలికాలంలో జుట్టు ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
చలికాలంలో చాలా మంది వేడి నీటితో స్నానం చేస్తుంటారు. అలా చేయటం మీజుట్టుకు ఏమంత శ్రేయస్కరం కాదు. వేడి నీటితో స్నానం చేయటం వల్ల ఆప్రభావం కుదుళ్లపై పడుతుంది. చర్మంలో ఉండే తేమ పోతుంది. జుట్టు రాలిపోయే అవకాశాలు ఉంటాయి. అయితే తల స్నానం చేయాల్సి వస్తే గోరు వెచ్చని నీటిని మాత్రమే వాడుకోవాలి.
ఇటీవలి కాలంలో తలకు నూనె రాయకుండా వదిలేయటం ఫ్యాషన్ గా మారింది. అయితే ఇలా చేయటం ఏమాత్రం మంచిది కాదు. తలకు నూనె రాయకపోవటం వల్ల జుట్టు దెబ్బతింటుంది. కుదుళ్లు బలహీనంగా మారుతాయి. వారానికి మూడు సార్లు జుట్టుకు నూనె తప్పనిసరిగా రాయాలి. ఇలా చేయటం వల్ల జుట్టు ఆరోగ్యవంతంగా పెరుగుతుంది. కుదుళ్లు బలంగా మారతాయి. తలనొప్పి వంటి సమస్యలు దూరమవ్వటంతోపాటు జుట్టు తెల్లబడే సమస్య తగ్గుతుంది.
జుట్టు చివర్లను అప్పుడప్పుడు ట్రిమ్ చేసుకోవటం వల్ల జుట్టు లావుగా మారే అవకాశాలు ఉంటాయి. దీని వల్ల జుట్టు చివర్లు చిట్లకుండా కాపాడుకోవచ్చు. జుట్టును దువ్వే సమయంలో చాలా మంది అనుసరించే విధానం వల్ల జుట్టు ఊడిపోతుంది. అలాగే దువ్వటానికి వినియోగించే దువ్వెనలు ప్రభావం కూడా జుట్టుపైన ఉంటుంది. తలస్నానం చేసిన వెంటనే జుట్టును ఆరబెట్టుకోవాలి. జుట్టు అందంకోసం చాలా మంది కర్లింగ్ చేయిస్తుంటారు. ఇలా చేయటం వల్ల జుట్టు బలహీనంగా మారే ఛాన్స్ ఉంటుంది. స్టైలింగ్ కోసం వినియోంచే టూల్స్ వల్ల జుట్టు దెబ్బతింటుంది.
అంతేకాకుండా జుట్టు అందంగా, ఒత్తుగా పెరగాలంటే మంచి ఆహారం తీసుకోవటం చాలా ముఖ్యం. పోషకాలు కలిగిన ఆహారాన్ని రోజువారి తీసుకుంటే జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది. గుడ్లు, పాలు, చేపలు, దుంపలు, ఆకు కూరలు వంటివి జుట్టుకు ఎంతో మేలు చేస్తాయి. పోషకాహారం తీసుకోవటం వల్ల జుట్టు రాలే సమస్యతోపాటు జుట్టు తెల్లబడే సమస్యను దూరం చేసుకోవచ్చు.