Impress Your Love: ఆమె/అతనితో మొదటిసారి మాటలు కలపాలంటే..

మామూలు మాటలేముంది.. ఎలా అయినా ఎప్పుడైనా మాట్లాడేయొచ్చు. కానీ, మనసుకు నచ్చిన వాళ్లతో మాటామంతీ కలపాలంటే కాస్త బెరుకు సాధారణమే. ఫస్ట్ ఇంప్రెషన్ ఉండాలి నెగెటివ్‌గా అనిపించకూడదు.

Impress Your Love: ఆమె/అతనితో మొదటిసారి మాటలు కలపాలంటే..

Impres Your Love

Updated On : December 23, 2021 / 1:13 PM IST

Impress Your Love: మామూలు మాటలేముంది.. ఎలా అయినా ఎప్పుడైనా మాట్లాడేయొచ్చు. కానీ, మనసుకు నచ్చిన వాళ్లతో మాటామంతీ కలపాలంటే కాస్త బెరుకు సాధారణమే. ఫస్ట్ ఇంప్రెషన్ ఉండాలి నెగెటివ్‌గా అనిపించకూడదు. సంభాషణ పేలవం కాకూడదని తాపత్రయపడేవాళ్లకి ఈ సూచనలు బాగా పనిచేయొచ్చు.

ఓపెన్ అవండి..
మీ కంటికి నచ్చిన ప్రొఫైల్ అనిపించినప్పుడు మీరు కూడా ఓపెన్ గా ఉండండి. అవతలి వ్యక్తికి మీరేంటో తెలిసినప్పుడే ఎదురుచూస్తున్న క్వాలిటీని ఎంపిక చేసుకోగలుగుతారు.

న్యూ ఇయర్ రిసొల్యూషన్:
ప్రతి ఒక్కరూ రిసొల్యూషన్ సెలక్ట్ చేసుకుంటారు. కానీ ఫాలో అవరు. కాకపోతే దాని గురించి మాట్లాడి ఒక పాజిటివ్ ఫీలింగ్ అయితే తీసుకురావచ్చు.

ఇష్టమైన.. ఇష్టం కాని పాటలు
సెలవు సమయాల్లో మ్యూజిక్ ప్లేలిస్టులు అరేంజ్ చేసుకుని స్పెషల్ మ్యూజిక్ వింటుండండి. దానిని బట్టి మీకు నచ్చేవి, నచ్చనివి తెలిసిపోతాయి.

కాంప్లిమెంట్స్ ఇస్తూ ఉండండి:
ఎదుటి మనిషిలో మీకు నచ్చిన చిన్నపాటి విషయమైనా చెప్పేసేయండి. ఎదుటివ్యక్తి నుంచి వచ్చే కాంప్లిమెంట్లు సంభాషణను మరింత ముందుకుతీసుకెళ్తాయి.

వాళ్ల హాలీడే ప్లాన్ అడగండి:
ఎలా ఎంజాయ్ చేస్తారని అడగండి.. వీలైతే మీరు జరుపుకునే పార్టీకి ఇన్వైట్ చేయండి. ఫ్యామిలీ పార్టీలేమైనా ఉంటే వాటిలో ప్రత్యేకత గురించి చర్చించండి.

ఫస్ట్ చేసిన పనులు:
లైఫ్ లో చేసిన మొదటి పనుల గురించి మాట్లాడండి. మొదట చూసిన సినిమా, ఫస్ట్ అందుకున్న గిఫ్ట్, వేకేషన్ కు వెళ్లిన ప్రదేశం, మీ ఫస్ట్ సక్సెస్ లాంటివి షేర్ చేసుకోండి.

సర్‌ప్రైజ్ ఇవ్వండి
ఎదుటివాళ్లు ఊహించని ఏదో ఒక విషయం చేసి ఆశ్చర్యపరచండి.

పాజిటివ్ గా మాట్లాడండి:
మన గురించి అన్నీ తెలియాలనుకుని నెగెటివ్ విషయాలు కూడా చెప్పేయకండి. కొన్నిసార్లు ఎదుటివారి మనసుని కించపరిచే అవకాశం ఉంది.