Weight Loss : అధిక బరువు తగ్గించే…. గోరుచిక్కుడు
గోరు చిక్కుడు బరువు తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తుంది. ఊబకాయంతో బాధపడుతున్నవారు గోరుచిక్కుడు తినటం వల్ల సమస్యను తగ్గించుకోవచ్చు.

Beans
Weight Loss : అధిక బరువు సమస్య ఇటీవలి కాలంలో అందరిని కలవరపెడుతుంది. బరువును తగ్గించుకునేందుకు చాలా మంది రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. అధిక బరువు కారణంగా అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. బరువు, పెరిగిన పొట్ట తగ్గించుకునేందుకు వివిధ రకాల ఆహారాలను తీసుకుంటున్నారు. అయితే మనం తీసుకునే ఆహారాల్లో గోరుచిక్కుడు బరువును తగ్గించటంలో బాగా తోడ్పడుతుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. బరువు తగ్గాలనుకునే వారికి ఇది బెస్ట్ ఫుడ్ గా సూచిస్తున్నారు.
గోరు చిక్కుడు తినడం వలన బరువు కూడా అదుపులో ఉంటుంది. ఇందులో అనేక రకాల పోషకాలున్నాయి. ఇవి బరువు తగ్గించడమే కాకుండా.. మనసును ప్రశాంతంగా ఉంచుతాయి. గోరు చిక్కుడు బరువు తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తుంది. ఊబకాయంతో బాధపడుతున్నవారు గోరుచిక్కుడు తినటం వల్ల సమస్యను తగ్గించుకోవచ్చు. గోరుచిక్కుడులో క్యాలరీలు చాలా తక్కువగా ఉంటాయి. ప్రోటీన్స్, మినరల్స్, విటమిన్, ఫైబర్ వంటివి ఉన్నాయి. ఇవి బరువు తగ్గటంలో దోహదం చేస్తాయి. అలాగే గుండె సంబంధిత సమస్యలు రాకుండా కాపాడతాయి. మధుమేహ వ్యాధితో బాధపడుతున్న వారికి గోరుచిక్కుడు మంచి ఆహారంగా చెప్పవచ్చు. రక్తంలో హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచటంలో ఇది సహాయపడుతుంది. అంతేకాకుండా రక్తప్రసరణ సాఫీగా జరిగేలా చేస్తుంది.
మలబద్ధకం సమస్యతో బాధపడుతున్నవారు గోరుచిక్కుడును తీసుకోవటం వల్ల సమస్య నుండి బయటపడవచ్చు. సుఖ విరోచనం అవుతుంది. జీర్ణాశయ సమస్యలకు చెక్ పెట్టవచ్చు. దీనిలో ఉండే కాల్షియం ఎముకలను బలంగా మారుస్తుంది. కండరాలకు బలాన్నిస్తుంది. గర్భిణులు గోరుచిక్కుడు తీసుకుంటే శిశువు ఆరోగ్యానికి మంచిది. గోరుచిక్కుడులోని పొటాషియం, ఫైబర్ శరీరంలోని చెడు వ్యర్థాలను బయటకు వెళ్ళేలా చేస్తాయి.
గర్భిణీ స్త్రీలకు గోరుచిక్కుడు మంచి ఆహారంగా చెప్పవచ్చు. త్వరగా జీర్ణమౌతుంది. పిండం ఎదుగుదలకు తోడ్పడుతుంది. ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్స్ ఫ్రీరాడికల్స్ తోపోరాడి క్యాన్సర్ వంటి వాటి నుండి కాపాడతాయి. రక్తంలో కొలెస్ట్రాల్ స్ధాయిలు అధికంగా ఉన్నవారికి ఇది ఒక మంచి ఆహారంగా పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. చర్మ సంబంధిత వ్యాధులను దూరం చేయటంతోపాటు, ముడతలు, మచ్చలను నివారించటంలో ఉపకరిస్తుంది.