Peaceful Night’s Sleep : రాత్రిపూట ప్రశాంతమైన నిద్రకోసం ఎలాంటి ఆహారం తినాలంటే?

రాత్రి సమయంలో చికెన్ తీసుకుంటే అందులో ట్రిప్టోఫాన్ ఉంటుంది. ట్రిప్టోఫాన్ ఒక అమైనో ఆమ్లం, ఇది మీ శరీరం సెరోటోనిన్ (రిలాక్సింగ్ మూడ్ హార్మోన్) తయారు చేయడంలో సహాయపడుతుంది, శరీరం మెలటోనిన్ తయారు చేయడంలో సహాయపడుతుంది.

Peaceful Night’s Sleep : రాత్రిపూట ప్రశాంతమైన నిద్రకోసం ఎలాంటి ఆహారం తినాలంటే?

Food

Updated On : July 10, 2022 / 3:40 PM IST

Peaceful Night’s Sleep : రాత్రి సమయంలో నిద్రలేమి అత్యంత సాధారణ రుగ్మత, ప్రతి ముగ్గురిలో ఒకరు అప్పుడప్పుడు నిద్రలేమిని కలిగి ఉంటారని అధ్యయనాల్లో తేలింది. ప్రతి 10 మందిలో ఒకరు దీర్ఘకాలిక నిద్రలేమిని కలిగి ఉంటారట. ఒత్తిడి వంటి అనేక కారణాల వల్ల నిద్రలేమి సాధారణంగా ఒక దశవరకు ఎదుర్కోవాల్సి ఉంటుంది. నిద్రలేమిని సాధారణంగా అనేక సహజ పద్ధతులను అనుసరించటం ద్వారా పరిష్కరించవచ్చు. ఇందులో ముఖ్యమైనది మీరు రోజువారి రాత్రి సమయంలో తీసుకునే ఆహారాన్ని మార్చుకోవడం. దీని వల్ల నిద్రలేమిని సులభంగా, సహజమైన మార్గంలో పోగొట్టుకోవచ్చు. ప్రతి రాత్రి నిద్రను ప్రేరేపించే కొన్ని ఆహారాలను తినడం ద్వారా, మీరు మంచి నిద్రను పొందవచ్చు.

రాత్రి సమయంలో మితమైన ఆహారం, ఆరోగ్యకరమైన జీవనశైలితో కోరుకున్న గంటలు నిద్రను పొందవచ్చు. నిద్రపోవడానికి సహాయపడే అంశాలలలో రాత్రి సమయంలో ఎలాంటి ఆహారం తీసుకుంటరో వాటిపై అధారపడి ఉంటుంది. చాలామంది రకరకాల ఫుడ్స్‌ తిని అర్ధరాత్రి నిద్రపట్టక ఇబ్బందిపడుతుంటారు. జీర్ణక్రియకు భంగం కలిగించే ఆహారాన్ని తింటే ఉదయాన్నే పొట్టను క్లియర్ చేయడంలో సమస్య ఏర్పడుతుంది. దీనివల్ల మలబద్ధకం లేదా లూజ్ మోషన్ సమస్య వస్తుంది. సరైన ఆహారం ఎంచుకోకపోవడం వల్ల రాత్రిపూట నిద్ర పాడవుతుంది. అయితే రాత్రి ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసుకుందాం.

రాత్రి సమయంలో చికెన్ తీసుకుంటే అందులో ట్రిప్టోఫాన్ ఉంటుంది. ట్రిప్టోఫాన్ ఒక అమైనో ఆమ్లం, ఇది మీ శరీరం సెరోటోనిన్ (రిలాక్సింగ్ మూడ్ హార్మోన్) తయారు చేయడంలో సహాయపడుతుంది, శరీరం మెలటోనిన్ తయారు చేయడంలో సహాయపడుతుంది. అలాగే విటమిన్ B6 చేపలలో పుష్కలంగా ఉంటుంది, సాల్మన్, ట్యూనా మరియు హాలిబట్‌లు ఎక్కువగా ఉంటాయి. B6 అనేది మెలటోనిన్‌ను తయారు చేస్తుంది. రాత్రి భోజనం లో చేపలు తినడం ద్వారా, మెలటోనిన్‌ తయారై సుఖనిద్ర ప్రాప్తిస్తుంది. పెరుగు కూడా రాత్రి సమయంలో మంచి నిద్రపట్టేలా చేస్తుంది. ఇందులో ఉండే కాల్షియం నిద్ర పట్టేందుకు ఉపకరిస్తుంది. అలాగే భోజనంలో ఆకుకూరలను చేర్చుకోవచ్చు. వీటిలో ఉండే కాల్షియం నిద్ర హార్మోన్లు పని చేయడానికి తోడ్పడుతుంది.

అరటిపండ్లులో పొటాషియం అధికంగా ఉంటుంది, ఇది రాత్రంతా నిద్రపోయేలా చేస్తుంది. ఇందులో ట్రిప్టోఫాన్ మరియు మెగ్నీషియం కూడా ఉన్నాయి, ఇవి సహజమైన మత్తును కలిగించేందుకు తోడ్పడతాయి. తృణధాన్యాలు ఇన్సులిన్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తాయి, దీని ఫలితంగా మెదడులో ట్రిప్టోఫాన్ చర్య జరుగుతుంది. వాటిలో మెగ్నీషియం కూడా ఉంటుంది. నిద్రపోవడానికి సహాయపడుతుంది. మెగ్నీషియం స్థాయిలు చాలా తక్కువగా ఉన్నప్పుడు, రాత్రి సమయంలో మేల్కొనే అవకాశం ఉంది.

తేనె, వాల్‌నట్‌లు, అవిసె గింజలు, గుమ్మడికాయ గింజలు మరియు పొద్దుతిరుగుడు విత్తనాలు ఇవన్నీ మెగ్నీషియం మరియు ట్రిప్టోఫాన్ కలిగి ఉండటం ద్వారా సెరోటోనిన్ స్థాయిలను పెంచుతాయి. గుడ్లు బాగా ప్రాచుర్యం పొందాయి. అవి ట్రిప్టోఫాన్ కలిగి ఉండటం వల్ల మీకు నిద్ర పట్టేలా చేస్తాయి. రాత్రి భోజనానికి బదులుగా అల్పాహారం తీసుకోవడానికి ప్రయత్నించండి. వైట్ రైస్ అధిక గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగి ఉంటుంది. ఇది మీకు రక్తంలో చక్కెర , ఇన్సులిన్ స్థాయిలలో సహజమైన పెరుగుదలను ఇస్తుంది. ఇది మెదడులో ట్రిప్టోఫాన్ వేగంగా పని చేయడానికి సహాయపడుతుంది.