Wheat Grass Juice : క్యాన్సర్ కారక కణాలను నశింప చేసే గోధుమ గడ్డి జ్యూస్!
గోధుమ గడ్డి రసం గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచదు. స్థూలకాయం నుండి బయటపడాలనుకునే వారికి ఈ జ్యూస్ ఉపకరిస్తుంది. ఎందుకంటే ఇందులో కేలరీలు తక్కువగా ఉంటాయి. ఫైబర్ ఎక్కువగా ఉంటుంది.

Wheatgrass Juice
Wheat Grass Juice : గోధము గడ్డి జ్యూస్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. గ్లాసు గోధుమ గడ్డి జ్యూస్ లో ఎ , బి కాంప్లెక్స, సి, ఇ, కె విటమిన్లు, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, ఫాస్పరస్, పొటాషియం, సెలీనియమ్, సోడియం, సల్ఫర్, కోబాల్ట్, జింక, క్లోరోఫిల్ ఉంటాయి. దీనిలో కొలెస్ట్రాల్ ఉండదు. ఈ జ్యూస్ లో అమినో యాసిడ్స్ ఫైబర్ ఎంజైమ్స్ ఉంటాయి. రక్తహీనతను చాలా వేగంగా తగ్గిస్తుంది.
శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచే అద్భుతమైన గుణాలు పుష్కలంగా ఉన్నాయి. మధుమేహం వంటి తీవ్రమైన వ్యాధులని తగ్గించడమే కాకుండా ఆరోగ్యాన్నిమెరుగుపరుస్తుంది. రక్తంలో చక్కెర స్థాయి అదుపులో ఉంటుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులు దీన్ని క్రమం తప్పకుండా తీసుకోవటం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఈ జ్యూస్ ప్రతిరోజూ తాగితే శరీరంలో పోషకాల లోపం తీరుతుంది. గోధుమ గడ్డి రసంలో రక్తవృద్ధికి తోడ్పడే పోషకాలు ఎక్కువగా ఉంటాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.
గోధుమ గడ్డి రసం గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచదు. స్థూలకాయం నుండి బయటపడాలనుకునే వారికి ఈ జ్యూస్ ఉపకరిస్తుంది. ఎందుకంటే ఇందులో కేలరీలు తక్కువగా ఉంటాయి. ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఈ జ్యూస్ తాగడం వల్ల కడుపు నిండినట్లుగా ఉంటుంది. క్రమంగా బరువు తగ్గుతారు. గోధుమ గడ్డి రసంలో క్లోరోఫిల్ ఉంటుంది. దీని కారణంగా శరీరంలోని టాక్సిన్స్ బయటకు వస్తాయి. బాడీ డిటాక్స్ కావడం వల్ల కాలేయం సక్రమంగా పనిచేసి జీర్ణక్రియ మెరుగ్గా ఉంటుంది.
శరీరంలో వాపులను తగ్గించటంలో గోధుమ గడ్డి జ్యూస్ ఉపకరిస్తుంది. ఊపిరితిత్తులకు గాలి సరఫరాను క్రమబద్దీకరిస్తాయి. ఆస్తమా వంటి శ్వాసకోశ వ్యాధులు తగ్గుతాయి. బ్యాక్టీరియాను నివారించి శరీరానికి నూతనోత్తేజం కలిగిస్తుంది. ఈ జ్యూస్ లో యాంటీ ఆక్సిడెంట్స్, ఫైటో న్యూట్రియంట్స్, బీటా కెరోటిన్, బయో ఫ్లావో నాయిడ్, బి, సి, ఇ విటమిన్ల కారక క్యాన్సర్ కణాలను నశింపచేస్తుందని పలు అధ్యయానాల్లో తేలింది.