World ORS Day 2023 : ORS డే ఎందుకు జరుపుతారో తెలుసా?
మన శరీరానికి తగిన నీరు అందకపోతే డీహైడ్రేషన్‌కి గురవుతాం. అతిసారం వల్ల చనిపోయే వృద్ధులు, పిల్లలు తీవ్రమైన డీహైడ్రేషన్ కారణంగా ద్రవాలు కోల్పోయి మరణిస్తున్నారట. ఈ రోజు 'ప్రపంచ ORS డే' .. దీని ప్రాముఖ్యతను తెలుసుకుందాం.

World ORS Day 2023
World ORS Day 2023 : మన శరీరంలో అవయవాలు సరిగ్గా పనిచేయాలంటే శరీరానికి నీటి కంటెంట్ చాలా అవసరం. శరీరం నుంచి నీరు కోల్పోతే డీహైడ్రేషన్‌కి గురవుతాం. ముఖ్యంగా పసిపిల్లల విషయంలో ఇది తీవ్రమైన సమస్యగా మారుతుంది. ORS (ఓరల్ రీహైడ్రేషన్ సాల్ట్స్) అనేది చక్కెర, ఉప్పు మరియు నీరు కలసిన మిశ్రమం. ఇది డీహైడ్రేషన్ బారి నుంచి కాపాడుతుంది. శిశువుల ఆరోగ్యం, వారి శ్రేయస్సుకి ORS అమృతంలా పనిచేస్తుంది. ప్రతి సంవత్సరం జూలై 29 న ‘ప్రపంచ ORS దినోత్సవాన్ని’ జరుపుకుంటాం. అయితే దీని ప్రాముఖ్యతను కూడా తెలుసుకోవాలి.
Infertility Risk Factors : పురుషులు, స్త్రీలలో వంధ్యత్వానికి దారితీసే కారకాలు !
ప్రతి సంవత్సరం జూలై 29న ORS దినోత్సవాన్ని నిర్వహిస్తారు. 1800, 1900 లలో కలరా, అతిసారంతో చాలామంది మరణించారట. ఈ వ్యాధులు అప్పట్లో ప్రజల్లో చాలా ఆందోళన కలిగించేవి. ORS అనేది వీటిపై పోరాడటానికి సహాయపడే నివారణిగా ఉపయోగపడుతుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం ఐదు సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లల మరణాలకు అతిసార సంబంధ వ్యాధులు కారణం. ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా 1.7 బిలియన్ల మంది పిల్లలను అతిసారం ప్రభావితం చేస్తోందట. డయేరియా కారణంగా ఏటా 5.25 లక్షల మంది చిన్నారులు చనిపోతున్నారు. అతిసారం వల్ల చనిపోయే వృద్ధులు, పిల్లలు తీవ్రమైన డీహైడ్రేషన్ కారణంగా ద్రవాలు కోల్పోయి మరణిస్తున్నారట. ORS అనేక వ్యాధుల వల్లే ఏర్పడే డీహైడ్రేషన్ నుంచి కాపాడుతుంది.
Dehydration In Winter : చలికాలంలో డీహైడ్రేషన్ సమస్యా? ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉంటుందా?
ORS కోల్పోయిన ద్రవాలను నీరు, చక్కెర మిశ్రమంతో భర్తీ చేస్తుంది. ఇది ఎలక్ట్రోలైట్లను గ్రహించడానికి ప్రేగులకు సాయం చేస్తుంది. డీహైడ్రేషన్‌ను నిరోధించి దానిని రివర్స్ చేస్తుంది. డయేరియాతో బాధపడే వారిలో 90 నుంచి 95% మంది రోగులకు ORS పని చేస్తుంది. రెండు సంవత్సరాల లోపు పిల్లలకు 50-100 ml , రెండు నుంచి పది సంవత్సరాల మధ్య పిల్లలకు 100-200 ml, పెద్దలు వారు కోరుకున్నంత పరిమాణంలో ORS తీసుకోవచ్చు. సూచించిన మోతాదులో మాత్రమే ORS ఇస్తే ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవు. ORSని 24 గంటల వరకు ఫ్రిజ్‌లో ఉంచవచ్చు. ఒక గ్లాసు వేడి చేసినా లేదా ఫిల్టర్ అయిన నీటిలో (200ml) 5 గ్రాముల చక్కెర, కొద్దిగా ఉప్పు వేసి బాగా కలిపి పిల్లలకు డ్రాపర్ లేదా స్పూన్‌తో తాగించండి. పెద్దలు నేరుగా తాగండి. ORS పెద్దలు మరియు పిల్లలకు అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తుంది.