Carrier Success Tips : మీ చుట్టూ ఇలాంటి వారు ఉంటే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు

మనం సాధించే విజయంలో మన చుట్టూ ఉండే మనుష్యుల ప్రభావం కూడా ఉంటుంది. ఎలాంటి వారు మన చుట్టూ ఉంటే మనం సక్సెస్ ఫుల్‌గా ముందుకు వెళ్తాం? చదవండి.

Carrier Success Tips : మీ చుట్టూ ఇలాంటి వారు ఉంటే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు

Carrier Success Tips

Carrier Success Tips : ఆఫీసు, ఇల్లు ఎక్కడైనా మన చుట్టూ ఉండేవారి వల్ల కూడా మనం జీవితంలో సక్సెస్ అవుతాం. అలా ఎలా అంటారా? చదవండి.

Mamata Banerjee Workout: ట్రెడ్ మిల్‌పై కుక్కపిల్లతో మమతా బెనర్జీ వర్కౌట్లు.. అదనపు ప్రేరణ కావాలంటూ ట్వీట్..

ప్రతి వ్యక్తిలో కొత్త కొత్త ఆలోచనలు ఉంటాయి. ఆశయాలు ఉంటాయి. వాటిని షేర్ చేసుకోవాలి అంటే మనం చెప్పేది వినేవారు కూడా ఉండాలి. మన చుట్టు ఉన్నవారు మనం చెప్పే విషయాలు వినే వారై ఉండాలి. వాటిపై తమ అభిప్రాయం చెప్పి ప్రోత్సహించే వారు కూడా మన జీవితానికి ఎంతో అసవరం.

కొత్తగా ఏదైనా పని ప్రారంభించే ముందు ఇతరులతో పంచుకుంటాం. అలా పంచుకున్న సమయాల్లో మనల్ని వెన్ను తట్టి ప్రోత్సహించే వారు కూడా అవసరం. ఈ పని నువ్వు చేయగలవు.. అందులో విజయం సాధిస్తావు అంటూ ముందుకు నడిపించే వారు మన చుట్టూ ఉండటం వల్ల  ఏదో తెలియని కొత్త శక్తిని ఇస్తుంది. మనం సాధించిన విజయాన్ని ఎవరితో అయినా షేర్ చేసుకున్నప్పుడు అభినందిస్తూ చప్పట్లు కొట్టేవారి మధ్యలో ఉండటం కూడా మనలో తెలియని ఉత్సాహాన్ని నింపుతుంది.

Inspirational Story of Bharathi : కూలి పని చేస్తూ కెమెస్ట్రీలో PHD చేసిన సాకే భారతి స్ఫూర్తివంతమైన కథ

ఇతరులతో మనం ఏ విషయం పంచుకున్నా నమ్మకంతో షేర్ చేసుకుంటాం. మనల్ని మోసం చేయకుండా నిజాయితీగా ఉండేవారి చుట్టూ మనం ఉండాలి. తప్పు చేస్తే దానిని చెప్పి సరిదిద్దేవారు.. మంచి పనులు చేస్తే ప్రోత్సహించేవారి చుట్టూ ఉండాలి. ప్రేరణ కలిగించే వ్యక్తుల మధ్యలో ఉంటే మనలో కొత్త లక్ష్యాలు ఏర్పడతాయి. జీవితంలో ఏదైనా సాధించాలనే తపన కలుగుతుంది. ఓటమి ఎదురైనా పట్టించుకోని వారి మధ్యలో ఉండాలి. ఎలాంటి సవాల్ అయినా ధైర్యంగా ఎదుర్కునే వారితో ఉండాలి. అప్పుడే జీవితంలో కఠినమైన సమయాల్లో కూడా ధైర్యంగా ముందుకి వెళ్లగలుగుతాం.

అన్ని విషయాలు అందరికీ చెప్పలేం. అయినా మన ఫీలింగ్స్, ఎమోషన్స్ చెప్పకుండానే అర్ధం చేసుకునే వారి మధ్య ఉంటే వారిచ్చే ధైర్యం టానిక్ లా పనిచేస్తుంది. సో..ఇలాంటి వారి మధ్య ఉంటే జీవితంలో ఖచ్చితంగా విజయం సాధిస్తాం.

74-year-old Hasan Ali Story : 74 ఏళ్ల రుమాళ్ల వ్యాపారి హసన్ అలీ స్ఫూర్తివంతమైన కథనం చదవండి