18 Pages: 18 పేజెస్ ట్రైలర్.. ఫీల్‌గుడ్ లవ్‌స్టోరీతో వస్తున్న నిఖిల్, అనుపమ
యంగ్ హీరో నిఖిల్ నటిస్తున్న తాజా చిత్రం ‘18 పేజెస్’ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఈ సినిమాలో అందాల భామ అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటిస్తుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక ఈ సినిమా పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ఇప్పటికే ఈ అంచనాలను రెట్టింపు చేశాయి.

18 Pages Trailer Assures A Feel Good Love Story
18 Pages: యంగ్ హీరో నిఖిల్ నటిస్తున్న తాజా చిత్రం ‘18 పేజెస్’ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఈ సినిమాలో అందాల భామ అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటిస్తుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక ఈ సినిమా పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ఇప్పటికే ఈ అంచనాలను రెట్టింపు చేశాయి.
18 Pages : ’18 పేజీస్’ లెక్క చూస్తా అంటున్న పుష్ప రాజ్..
కాగా, తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఈ ట్రైలర్ ఆద్యంతం ఫీల్ గుడ్ రొమాంటిక్ సీన్స్‌తో నింపేశారు చిత్ర యూనిట్. ఇక ఈ సినిమాలో నిఖిల్, అనుపమల మధ్య జరిగే లవ్ ట్రాక్ సరికొత్తగా ఉండబోతున్నట్లు ఈ ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ఈ ట్రైలర్‌లో నిఖిల్, అనుపమల మధ్య కెమిస్ట్రీని చాలా అందంగా చూపెట్టారు. ‘‘ప్రేమించడానికి రీజన్ ఉండకూడదు.. ఎందుకు ప్రేమిస్తున్నాం అంటే ఆన్సర్ ఉండకూడదు’’ అనే డైలాగ్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది.
18 Pages: 18 పేజీస్ సెన్సార్ పూర్తి.. నిఖిల్ సినిమాకి కూడానా..?
ఇక రొమాన్స్‌తో పాటు యాక్షన్, సస్పెన్స్ కూడా ఈ సినిమాలో ఉండబోతున్నట్లు చిత్ర ట్రైలర్‌లో చూపెట్టారు. ఈ సినిమాను దర్శకుడు సూర్యప్రతాప్ అద్భుతమైన ప్రేమకావ్యంగా మలిచిన తీరు ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. కాగా, ఈ సినిమాను బన్నీ వాస్ ప్రొడ్యూస్ చేయగా, మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పిస్తున్నారు. ఇక ఈ సినిమాకు గోపీసుందర్ సంగీతం అదనపు ఆకర్షణగా మారనుంది. డిసెంబర్ 23న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది.