బాఫ్టా అవార్డ్స్‌లో సత్తా చాటిన ‘1917’
బాఫ్టా అవార్డ్స్‌లో ఏకంగా ఏడు అవార్డులు గెలుచుకుని సత్తా చాటిన వార్ ఎపిక్ డ్రామా.. ‘1917’..

బాఫ్టా అవార్డ్స్‌లో ఏకంగా ఏడు అవార్డులు గెలుచుకుని సత్తా చాటిన వార్ ఎపిక్ డ్రామా.. ‘1917’..
రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్, ఆంబ్లిన్ పార్టనర్ సంస్థలు మొదటి ప్రపంచ యుద్ధం నేపథ్యంలో నిర్మించిన ‘1917’ చిత్రం ఇటీవల దేశవ్యాప్తంగా విడుదలైంది. సామ్ మెండెస్ (స్కై ఫాల్) ఫేమ్ దర్శకత్వంలో రూపొందిన ఈ వార్ ఎపిక్ డ్రామా ఇప్పటికే పలు అవార్డులను గెలుచుకుంది. 92వ అకాడమీ అవార్డులకు 10 నామినేషన్లు పొందింది. అలాగే బఫ్టా అవార్డ్స్ ఈ సంవత్సరం 9 నామినేషన్లు పొందింది. ఇవికా 77వ గోల్డెన్ గ్లోబ్ అవార్డుల్లో ‘1917’ ఉత్తమ చిత్రం అవార్డును గెలుచుకుంది.
అలాగే దర్శకుడు సామ్ ఉత్తమ దర్శకుడిగా అవార్డు గెలుచుకున్నారు. తాజగా జరిగిన బాఫ్టా అవార్డ్స్‌లో ఏకంగా ఏడు అవార్డులు గెలుచుకుని సత్తా చాటిందీ చిత్రం.. బ్రిటిష్ అకాడీమి ఆఫ్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ పురస్కారాల ప్రధానోత్సవం లండన్‌లో అంగరంగ వైభవంగా జరిగింది. ‘1917’ మూవీకి ‘బెస్ట్ ఫిల్మ్’, ‘అవుట్ స్టాండింగ్ బ్రిటిష్ ఫిల్మ్’, ‘డైరెక్టర్’, ‘సినిమాటోగ్రఫీ’, ‘ప్రొడక్షన్ డిజైనింగ్’, ‘సౌండ్’, ‘స్పెషల్ విజువల్ ఎఫెక్ట్స్’.. కేటగిరీల్లో అవార్డులు లభించాయి.
‘1917’ అమెరికా, యు.కె.ల్లో కలెక్షన్ల పరంగా కొత్త రికార్డులు సృష్టించింది. ఈ రెండు దేశాల్లో ఓపెనింగ్ కలెక్షన్స్‌లో నెం.1గా నిలిచింది. అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. డ్రీమ్ వర్క్స్ పిక్చర్స్, రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ సమర్పణలో న్యూ రిపబ్లిక్ పిక్చర్స్, నీల్ స్ట్రీట్ ప్రొడక్షన్.. మొగాంబో ఈ చిత్రాన్ని నిర్మించారు. జార్జ్‌మెక్‌కే, డీన్ చార్లెస్ చాప్‌మేన్, కొలిన్‌ఫెర్త్, బెనెడిక్ట్ కుంబర్‌బ్యాచ్ తదితరులు ఈ సినిమాలో ముఖ్యపాత్రలు పోషించారు. జనవరి 17న రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ ద్వారా ‘1917’ భారతదేశంలో విడుదలైంది.