ఒకేరోజు మూడు ఇండస్ట్ర్రీ హిట్స్..

  • Published By: Mahesh ,Published On : April 29, 2020 / 06:30 AM IST
ఒకేరోజు మూడు ఇండస్ట్ర్రీ హిట్స్..

Updated On : April 29, 2020 / 6:30 AM IST

ఏప్రిల్ 28.. తెలుగు సినిమా చరిత్రలో మూడు ఇండస్ట్రీ హిట్స్ అందించిన రోజు.. విశ్వవిఖ్యాత నటసార్వభౌమ, నటరత్న ఎన్టీఆర్, దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు కలయికలో తెరకెక్కిన బ్లాక్ బస్టర్, ఇండస్ట్రీ హిట్ ‘అడవి రాముడు’ చిత్రం 1977 ఏప్రిల్ 28న విడుదలైంది. 2020 ఏప్రిల్ 28నాటికి 43 సంవత్సరాలు పూర్తి చేసుకుంటోంది.

సూపర్ స్టార్ మహేష్ బాబు, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబోలో తెరకెక్కిన ‘పోకిరి’ కూడా ఇదే తేదీన రిలీజ్ అయి ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. నేటితో 14 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంది ‘పోకిరి’. అలాగే యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి-ది బిగినింగ్’ సీక్వెల్ ‘బాహుబలి-ది కన్‌‌క్లూజన్’ 2017 ఏప్రిల్ 28న విడుదలైంది. ఇవాళ్టికి 3ఏళ్లు పూర్తవుతుంది.

అప్పటివరకు ఉన్న రికార్డులన్నిటిని తుడిచిపెట్టి, తెలుగు సినిమా రికార్డులు ‘బాహుబలి’కి ముందు ‘బాహుబలి’కి తర్వాత అనేంతగా సరికొత్త రికార్డులు నెలకొల్పడమే కాక తెలుగు సినిమా సత్తా ఏంటో ప్రపంచానికి చాటిచెప్పింది. ఈ మూడు సినిమాలూ ఓకే రోజు రిలీజవడం, ఇండస్ట్రీ హిట్స్‌గా నిలవడం విశేషం.