కరోనా కష్టంతో బాధపడుతున్న 30ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ

డైరక్టర్ కృష్ణ వంశీ తీసిన సినిమా ఖడ్గం అందులో డైలాగ్ అతని పేరుకే అలంకారం అయిపోయింది. 30 ఇయర్స్ ఇండస్ట్రీ అనే మాటంటే గుర్తొచ్చేది పృథ్వీనే. అయితే అతనికి కరోనా కష్టమొచ్చిందట. 10 రోజులుగా అస్వస్థతకు గురవుతున్నానని.. జ్వరంతో బాధపడుతుండటంతో వైద్యుల సూచన మేరకు హాస్పిటల్లో జాయిన్ అయ్యానని స్వయంగా వీడియో ద్వారా వెల్లడించాడు.
అన్ని వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత డాక్టర్లు చెప్పినట్లుగా క్వారంటైన్‌లో ఉంటున్నట్లు తెలిపారు. పది రోజులు తాత్కాలిక ట్రీట్ మెంట్ తీసుకుంటుండగా శ్వాసకు ఇబ్బందిగా మారింది. ప్రస్తుతం క్వారంటైన్ లో ఉంటున్న పృథ్వీకి పైపుల ద్వారా చికిత్స అందిస్తున్నారు. అనారోగ్యం నుంచి కోలుకోవడానికి మీ అందరి ఆశీస్సులు కావాలని.. కోరారు.