Eshwar Prasad : అమెరికా నుంచి వచ్చి.. పాన్ ఇండియా సినిమాతో రాబోతున్న నటుడు ఈశ్వర్..
త్వరలో ఈశ్వర్ పాన్ ఇండియా సినిమాతో రాబోతున్నట్టు సమాచారం.

4 Letters Movie Hero Eshwar Prasad Coming with Pan India Movie Announcement Soon
Eshwar Prasad : 4 లెటర్స్ సినిమా ద్వారా తెలుగులో హీరోగా పరిచయం అయ్యాడు ఈశ్వర్ ప్రసాద్. 2019లో రొమాంటిక్ కామెడీ కాన్సెప్ట్ తో వచ్చిన సినిమా పర్వాలేదనిపించింది. ప్రస్తుతం ఈశ్వర్ తమిళ్ లో రెండు సినిమాలతో బిజీగా ఉన్నాడు. అయితే త్వరలో ఈశ్వర్ పాన్ ఇండియా సినిమాతో రాబోతున్నట్టు సమాచారం. జూలై 11 తన బర్త్ డే సందర్భంగా తెలుగులో పీకాక్ ఇండియన్ సినిమా బ్యానర్ పై భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా సినిమాను మొదలుపెట్టబోతున్నట్టు తెలిపారు ఈశ్వర్ ప్రసాద్.
Also Read : Kiran Abbavaram : ‘క’ అంటున్న కిరణ్ అబ్బవరం.. సింగిల్ లెటర్‌తో 20 కోట్ల పాన్ ఇండియా సినిమా..
తిరుపతికి చెందిన ఈశ్వర్ ప్రసాద్ అమెరికాలో సెటిల్ అయ్యాడు. కాని సినిమాల మీద ఫ్యాషన్ తో ఫిలిం ఇండస్ట్రీకి వచ్చి 4లెటర్స్ సినిమాతో హీరోగా మారి కరోనా గ్యాప్ తర్వాత ఇప్పుడు వరుస సినిమాలు చేస్తున్నారు. మరి రాబోయే సినిమాలతో ఎలా మెప్పిస్తాడో చూడాలి. మరోవైపు మెరిట్ విద్యార్థులకు ఫీజులు పే చేస్తూ పలు సేవా కార్యక్రమాల్లో కూడా పాల్గొంటున్నాడు.