అమీర్ ఖాన్ ఇంట్లో కరోనా.. ఏడుగురికి పాజిటివ్

దేశవ్యాప్తంగా పెరుగుతున్న కరోనా వైరస్ కేసులు ఆందోళనలు కలిగిస్తుండగా.. లేటెస్ట్‌గా బాలీవుడ్‌ని కరోనా భయపెడుతుంది. బాలీవుడ్‌కు చెందిన పలువురు ఇప్పటికే కరోనా బారిన పడగా.. లేటెస్ట్‌గా స్టార్ హీరో అమిర్ ఖాన్ స్టాఫ్‌కు కూడా ఏడు మందికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. ఈ సందర్భంగా ట్విట్టర్ ద్వారా అమీర్ ఖాన్ ఒక సుదీర్ఘ లేఖను పోస్ట్ చేశారు.
‘నా సిబ్బందిలో కొందరు సభ్యులు కరోనా పాజిటివ్ బారిన పడ్డారు. అందులో అమీర్ ఖాన్ డ్రైవర్, అతని ఇద్దరు భద్రతా సిబ్బంది మరియు ఒక కుక్ కూడా ఉన్నారు. కరోనా పాజిటివ్ అని తెలిసిన వెంటనే అందరినీ క్వారంటైన్ చేశారు. సకాలంలో అత్యంత వేగంగా స్పందించి నా స్టాఫ్‌కు వైద్య సదుపాయాలను కల్పించిన బీఎంసీ (బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్)కి ధన్యవాదాలు. నా సిబ్బంది పట్ల చాలా కేర్ తీసుకున్నారు. అంతేకాకుండా చుట్టుపక్కల ప్రాంతాలను స్టెరిలైజ్ చేశారు.
నా సిబ్బందిలోని మిగిలిన వారికి మాత్రం నెగెటివ్ అని తేలింది. టెస్ట్ చేయించుకోమని మా అమ్మకు చెపుతున్నా. మాకు సంబంధించిన వ్యక్తుల్లో ఆమే చివరి వ్యక్తి. ఆమెకు నెగెటివ్ రావాలని భగవంతుడిని ప్రార్థించండి. కోకిలాబెన్ ఆసుపత్రికి కూడా పెద్ద థ్యాంక్స్. డాక్టర్లు, నర్సులు, ఇతర సిబ్బంది అందిస్తున్న సేవలు చాలా గొప్పవి. టెస్టింగ్ విషయంలో వారు చాలా జాగ్రత్తగా, ప్రొఫెషనల్ గా వ్యవహరిస్తున్నారు. అందరూ సురక్షితంగా ఉండండి. గాడ్ బ్లెస్ యూ’ అంటూ అమీర్ ట్వీట్ చేశారు.