My Dear Donga Teaser : హీరోగా మరో సినిమా తీసుకు వచ్చేస్తున్న అభినవ్.. ‘మై డియర్ దొంగ’ టీజర్ సూపర్..

‘మస్తు షేడ్స్ ఉన్నాయిరా’ అంటూ హీరోగా పరిచయమైన అభినవ్ గోమఠం.. ఇప్పుడు 'మై డియర్ దొంగ' అంటూ మరో సినిమాని తీసుకు వచ్చేస్తున్నారు.

My Dear Donga Teaser : హీరోగా మరో సినిమా తీసుకు వచ్చేస్తున్న అభినవ్.. ‘మై డియర్ దొంగ’ టీజర్ సూపర్..

Abhinav Gomatam Shalini Kondepudi My Dear Donga Teaser released

Updated On : March 4, 2024 / 4:49 PM IST

My Dear Donga Teaser : కమెడియన్స్‌గా ఆడియన్స్ ని అలరించిన నటులు.. హీరోగా కూడా ప్రేక్షకుల ముందుకు రావడం తరుచుగా జరుగుతూనే ఉంటుంది. ఈక్రమంలోనే ప్రస్తుతం ఉన్న కమెడియన్స్ కూడా వరుసపెట్టి హీరోలుగా ఆడియన్స్ ముందుకు వచ్చి హిట్స్ ని అందుకుంటున్నారు.

‘ఈ నగరానికి ఏమైంది’ సినిమాతో కమెడియన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు అభినవ్ గోమఠం.. ‘మస్తు షేడ్స్ ఉన్నాయిరా’ సినిమాతో ఇటీవలే హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ఫిబ్రవరి 23న రిలీజైన ఈ చిత్రం.. ఆడియన్స్ ని బాగానే ఆకట్టుకుంది. ఇక హీరోగా మొదటి సినిమాని రిలీజ్ చేసి రెండు వారాలు కూడా పూర్తీ కూడా కాలేదు, అప్పుడే రెండో సినిమాని ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చేందుకు సిద్ధం చేస్తున్నారు.

Also read : Gaami : విశ్వక్ సేన్ ‘గామి’ నుంచి.. ‘శివమ్’ సాంగ్ రిలీజ్..

‘మై డియర్ దొంగ’ అంటూ ఓ కామెడీ ఎంటర్టైనర్ రెడీ చేశారు. తాజాగా ఆ మూవీ టీజర్ ని రిలీజ్ చేశారు. ఈ సినిమాలో అభినవ్ దొంగగా కనిపించబోతున్నారు. షాలిని కొండేపూడి హీరోయిన్ గా నటిస్తున్నారు. రిలీజ్ చేసిన టీజర్ చాలా ఎంటర్టైనింగ్ గా ఉంది. ఒకప్పటి వెంకటేష్ ‘రాజా’ సినిమాని గుర్తుకు చేస్తుంది. అయితే పాయింట్ అది అయ్యనప్పటికీ కంప్లీట్ డిఫరెంట్ కంటెంట్ అని తెలుస్తుంది. మరి ఆ టీజర్ వైపు మీరు ఓ లుక్ వేసేయండి.

కాగా ఈ మూవీ ఆహా ఒరిజినల్ కంటెంట్ గా రాబోతుంది. డైరెక్ట్ ఓటీటీలోనే ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. ఇక ఆహా విషయానికి వస్తే.. ఇటీవల భామాకలాపం 2, ది గ్రేట్ ఇండియ‌న్ సూసైడ్, కరీంనగర్స్ మోస్ట్ వాంటెడ్ వంటి ఒరిజినల్ కంటెంట్స్ తో ఆడియన్స్ ని అలరిస్తూ వస్తుంది. ఇప్పుడు ఈ ‘మై డియర్ దొంగ’ కూడా అదే రకంగా అలరిస్తుందా లేదా చూడాలి.