Actor Sriram : నేను తప్పు చేశాను.. నా ఇద్దరి పిల్లల భవిష్యత్తు ఏంటి? హీరో శ్రీరామ్ తీవ్ర ఆవేదన..!
Actor Sriram : నటుడు శ్రీరామ్ డ్రగ్స్ కేసులో అరెస్టు అయ్యాడు. నేను తప్పు చేశానంటూ తన కుటుంబ భవిష్యత్తు గురించి ఆందోళన వ్యక్తం చేశాడు.

Actor Sriram
Actor Sriram : కోలివుడ్ హీరో శ్రీరామ్ ఇటీవలే డ్రగ్స్ కేసులో అరెస్టు అయిన సంగతి తెలిసిందే. అయితే, ఈ కేసులో తాను జైలుకు వెళ్లడంతో తన కుటుంబ పరిస్థితి పట్ల (Actor Sriram) ఆందోళన వ్యక్తం చేశాడు. “కొకైన్ వాడటం చట్టవిరుద్ధమని నాకు తెలియదు. తెలియకుండానే నేను తప్పు చేశాను.
ఇప్పుడు నన్ను అరెస్టు చేసి జైలులో పెట్టారు. నా కొడుకు, కూతురి విద్య, భవిష్యత్తు దెబ్బతింటుందని భయపడుతున్నాను. నేను తప్పు చేసినప్పుడు.. ఇంత ప్రభావం చూపుతుందని నేను ఎప్పుడూ అనుకోలేదు. నా కొడుకు గురించి ఆలోచించినప్పుడు చాలా బాధగా అనిపిస్తుంది. నేను లేకుండా జీవించలేడు” అని పోలీసులతో హీరో శ్రీరామ్ చెప్పినట్టు సమాచారం.
తొలి సినిమా విజయం, సవాళ్లు :
శ్రీరామ్‌కు ఎలాంటి సినిమా నేపథ్యం లేదు. 2002లో దర్శకుడు శశి దర్శకత్వం వహించిన ‘రోజా కూట్టం’ చిత్రంతో సినీరంగ ప్రవేశం చేశాడు. ఆ మూవీతో శ్రీరామ్‌కు మంచి పేరును తెచ్చిపెట్టింది. ఆ తర్వాత ‘ఏప్రిల్ మఠం’, ‘మనసెల్లం’, ‘పార్తిబన్ కనవు’ వంటి అనేక చిత్రాల్లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ‘వర్ణజలం’, ‘బోస్’, ‘కాన కండెన్’, ‘పంబరకన్నలే’ వంటి చిత్రాలు మంచి ఆదరణ అందుకున్నాయి. ఆపై నటించిన చాలా సినిమాలు అంతగా ఆడలేదు.
ప్రేమకథ.. 2008లో వివాహం :
కోలివుడ్ హీరో శ్రీరామ్‌కు వ్యక్తిగత జీవితంలోనూ అనే సవాళ్లు ఎదురయ్యాయి. చెన్నైకి చెందిన వందనను ప్రేమించి రహస్యంగా వివాహం చేసుకున్నాడు. 3 నెలలు కలిసి జీవించిన తర్వాత వందనపై ఆరోపణలు వచ్చాయి. సుదీర్ఘ పోరాటం తర్వాత తీర్పు వందనకు అనుకూలంగా వచ్చింది. దాంతో రెండు కుటుంబాలు రాజీపడ్డాయి. శ్రీరామ్, వందన 2008లో మళ్లీ వివాహం చేసుకున్నారు. దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు.