Anasuya : నాకు నచ్చిన బట్టలు వేసుకుంటే నేను విలువలు కోల్పోయినట్టు కాదు.. విమర్శలకు అనసూయ కౌంటర్ ట్వీట్..

తాజాగా అనసూయ చేసిన ఓ ట్వీట్ వైరల్ గా మారింది.

Anasuya : నాకు నచ్చిన బట్టలు వేసుకుంటే నేను విలువలు కోల్పోయినట్టు కాదు.. విమర్శలకు అనసూయ కౌంటర్ ట్వీట్..

Anasuya

Updated On : July 30, 2025 / 7:25 PM IST

Anasuya : యాంకర్, నటి అనసూయ తన సినిమాలు, షోలతోనే కాకుండా ట్వీట్స్, ఎవరికో ఒకరికి కౌంటర్లు ఇస్తూ వైరల్ అయ్యేది. కానీ ఇదంతా గతం. గత కొంత కాలంగా అనసూయ వివాదాలకు దూరంగా ఉంటుంది. అయితే తాజాగా అనసూయ చేసిన ఓ ట్వీట్ వైరల్ గా మారింది.

అనసూయ తన ట్వీట్ లో.. ప్రస్తుతం నేను ఇతరులు నాపై ఏదైనా వ్యాఖ్యలు చేస్తే మౌనంగానే ఉండే స్థితిలో ఉన్నాను. కానీ నా పర్సనల్ జీవితంపై కామెంట్స్ చేస్తే మాత్రం నేను కోపం లేకుండా స్పష్టంగా మాట్లాడతాను. ఇటీవల కొన్ని సోషల్ మీడియా ఛానల్స్ నన్ను టార్గెట్ చేసి కొంతమంది లేడీ స్పీకర్స్ ని పెట్టుకొని నాపై విమర్శలు చేస్తున్నారు. అసలు వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు. నా గురించి వాళ్లకు తెలియదు. కానీ వాళ్ళు నన్ను వ్యక్తిగతంగా కామెంట్స్ చేస్తున్నారు. నేను ఒక తల్లినే, భార్యనే. కానీ నేను వేసుకునే దుస్తులు నా పర్సనల్. గ్లామర్, స్టైల్ అనేవి నా గుర్తింపులో భాగం. కొంతమంది తల్లిగా ఉంటే ఇలా ఉండకూడదు అని అంటారు. తల్లిగా ఉంటే మన నిజమైన స్వభావాన్ని వదులుకోవాలా? నా భర్త, నా పిల్లలు నాకు సపోర్ట్ చేస్తారు. వాళ్ళు నను ప్రేమిస్తారు. నా పిల్లలు ఒక ధైర్యవంతురాలైన స్త్రీ ని చూసి పెరుగుతున్నారు. కొంతమంది ఇంత ఓపెన్ గా ఉండలేకపోవువచ్చు. అది మీ ఇష్టం. అంతే కానీ ఒకరి ఎంపికని మీరు నెగిటివ్ గా చూడొద్దు. నాకు నచ్చిన బట్టలు వేసుకుంటే నేను విలువలు కోల్పోయినట్టు కాదు. నేను ఇది ఎవర్ని ఫాలో అవ్వమని అడగట్లేదు. ఎవరి ఇష్టం వాళ్ళది. నేను నాకు నచ్చిన మార్గంలో జీవిస్తున్నాను. ఇక్కడ ఎవరి అభిప్రాయం వాళ్ళది. నేను ఎవర్ని తప్పు పట్టను. అలాగే వేరే వాళ్ళ జీవితాలకు కూడా మీరు మర్యాద ఇస్తారని ఆశిస్తున్నా అంటూ రాసుకొచ్చింది.

Also Read : Nivita : పవన్ కళ్యాణ్ కోసం క్లోజ్ రిలేటివ్ తో గొడవ పెట్టుకున్నా.. రోడ్ మీద కార్ దిగేసి వెళ్ళిపోయా..

కొంతమంది ఇటీవల సోషల్ మీడియాలో అనసూయ ఇద్దరు పిల్లలకు తల్లి అయినా ఇష్టమొచ్చిన బట్టలు వేసుకుంటుందని, తన పిల్లల ముందే తన అంగ ప్రదర్శన చేసే విధంగా ఉన్న బట్టలు వేసుకుంటుందని విమర్శలు చేస్తున్నారు. ఆ విమర్శలకు అనసూయ ఇలా స్పందించిందని తెలుస్తుంది. దీంతో అనసూయ చేసిన ట్వీట్ వైరల్ గా మారింది.

 

Also Read : Raviteja : రవితేజ థియేటర్ రెడీ.. ఎక్కడో తెలుసా? విజయ్ దేవరకొండ సినిమాతోనే ఓపెనింగ్..