Mega 158: మెగాస్టార్ మెగా మూవీ.. భార్యగా ప్రియమణి.. కూతురుగా ఎవరు చేస్తున్నారో తెలుసా?
మెగాస్టార్ చిరంజీవి- బాబీ కొల్లి కాబోలో రాబోతున్న మూవీ(Mega 158) రెగ్యులర్ షూటింగ్ ఫిబ్రవరి నుంచి మొదలుకానుంది.
Actress Priyamani will be playing Chiranjeevi's wife in mega 158 movie.
- ఫిబ్రవరిలో మెగాస్టార్ కొత్త సినిమా స్టార్ట్
- వయసుకు తగ్గ పాత్రలో చిరంజీవి
- భార్యగా ప్రియమణి, కూతురిగా కృతి శెట్టి
Mega 158: మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ఫుల్ జోష్ లో ఉన్నాడు. ఆయన హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ మన శంకర వరప్రసాద్ గారు సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. కేవలం వారం రోజుల్లోనే రూ.300 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది ఈ సినిమా. అది కూడా అతి తక్కువ రోజుల్లోనే ఇండస్ట్రీ హిట్ గా నిలిచి మరో రికార్స్డ్ క్రియేట్ చేసింది ఈ సినిమా.
సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు ఫ్యామిలీ ఆడియన్స్ చాలా కనెక్ట్ అయ్యారు. ఇక రానున్న రోజుల్లో కూడా ఈ సినిమా రికార్డ్ కలెక్షన్స్ రాబట్టనుంది అంటూ ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. ఇక ఈ సినిమా తరువాత తన నెక్స్ట్ సినిమా కోసం సిద్ధం అవుతున్నాడు మెగాస్టార్ చిరంజీవి. ఈ ప్రాజెక్టు కోసం ఆయన దర్శకుడు బాబీ కొల్లి(Mega 158)తో జత కట్టాడు. కలకత్తా బ్యాక్డ్రాప్ లో మాఫియా డాన్ గా ఈ సినిమాలో చిరంజీవి కనిపించనున్నాడట. ఫిబ్రవరి నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుందని సమాచారం.
Satya Sri: అనగనగా ఒక రాజు సక్సెస్ టూర్.. ఫొటోలు షేర్ చేసిన నటి సత్య శ్రీ
తాజాగా ఈ సినిమా నుంచి మరో క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అదేంటంటే, ఈ సినిమాలో చిరంజీవి భార్య, కూతురు ఉన్న పాత్రలో కనిపించనున్నాడట. ఇందులో ఆయన భార్యగా ప్రియమణి నటించనుందని తెలుస్తోంది. కూతురిగా ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి నటించనుందట. ఇప్పటికే దీనికి సంబంధించి చర్చలు కూడా ముగిశాయని సమాచారం.
ఇదే గనక నిజం అయితే చాలా కాలం తరువాత మెగాస్టార్ తన ఏజ్ కి తగ్గ పాత్రలో మెప్పించడం ఖాయం. ఇక ఈ సినిమాలో యాక్షన్ తోపాటు ఎమోషన్ కూడా ఒక రేంజ్ లో ఉండబోతుందని తెలుస్తోంది. ఇక చిరంజీవి- బాబీ కొల్లి కాంబోలో గతంలో వాల్తేరు వీరయ్య సినిమా వచ్చిన విషయం తెలిసిందే. మాస్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఇప్పుడు మరోసారి అదే కాంబోలో సినిమా వస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. మరి ఈ సినిమా ఎలాంటి రికార్డ్స్ ను క్రియేట్ చేస్తుందో చూడాలి.
