KP Chaudhary Drug Case : స్పందించిన సురేఖ వాణి, జ్యోతి.. అర్థం చేసుకోండి.. ఆరోపణలు చేయొద్దు ప్లీజ్
కబాలి తెలుగు సినిమా నిర్మాత సుంకర కృష్ణ ప్రసాద్ అలియాస్ కేపి చౌదరి (KP Chaudhary) ఇటీవల డ్రగ్స్ కేసులో అరెస్టు అయిన సంగతి తెలిసిందే. ప్రముఖంగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖ వాణి, జ్యోతి ల ఆరోపణలు వచ్చాయి.

Surekha vani and Jyothi responded over allegations
KP Chaudhary Drug Case : కబాలి తెలుగు సినిమా నిర్మాత సుంకర కృష్ణ ప్రసాద్ అలియాస్ కేపి చౌదరి (KP Chaudhary) ఇటీవల డ్రగ్స్ కేసులో అరెస్టు అయిన సంగతి తెలిసిందే. టాలీవుడ్‌కు చెందిన పలువురికి కేపీ చౌదరి డ్రగ్స్ విక్రయించినట్లుగా పోలీసులు జరుపుతున్న విచారణలో వెల్లడైంది. పోలీసులు అతడి ఫోన్‌ను పరిశీలించగా పలువురు నటీనటుల పేర్లు బయటపడ్డాయి. ప్రముఖంగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖ వాణి, జ్యోతి లపై ఆరోపణలు వచ్చాయి. వీళ్లు కూడా డ్రగ్స్ తీసుకున్నారనే రూమర్లు వినిపించగా తాజాగా వీటిపై వీరు స్పందించారు.
Kamal Haasan : ‘ప్రాజెక్ట్ K’లో కమల్ హాసన్.. పారితోషికం అన్ని కోట్లా..?
ఈ వార్తలను ఖండిస్తూ సురేఖ వాణి ఓ వీడియోను విడుదల చేశారు. గత కొంతకాలంగా తమపై వస్తున్న ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదన్నారు. దయచేసి ఆరోపణలు చేయడం ఆపేయాలని కోరారు. ఈ ఆరోపణల వల్ల తమ కుటుంబం, కెరీర్, పిల్లల భవిష్యత్తు నాశనం అవుతున్నాయని వీడియోలో సురేఖ వాణి ఆవేదన వ్యక్తం చేశారు.
SSMB 29 : మహేశ్-రాజమౌళి సినిమా క్లైమాక్స్ చెప్పేసిన విజయేంద్ర ప్రసాద్..! పండగే అంటున్న అభిమానులు
ఏ తప్పు చేయలేదు.. జ్యోతి
కేపీ చౌదరి తనకు మంచి స్నేహితుడు అని సినీ నటి జ్యోతి చెప్పారు. ఫ్యామిలీ బాండింగ్ తప్ప డ్రగ్స్‌తో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. ఎలాంటి విచారణకు అయినా తాను సిద్దం అని జ్యోతి పేర్కొన్నారు. అవసరం అయితే నార్కొటిక్ టెస్ట్ కూడా సిద్దమేనని చెప్పుకొచ్చారు. ఇక తాను ఏ తప్పు చేయలేదని, ఎవ్వరికి భయపడాల్సిన అవసరం లేదన్నారు. కేపీ చౌదరి హైదరాబాద్‌కు వచ్చినప్పుడు వాళ్ల అబ్బాయిని మా ఇంట్లో వదిలివెలుతాడన్నారు. కేపీ కుమారుడితో తన కుమారుడు ఆడుకుంటారని అంతకు మించి ఇంకేం లేదన్నారు. తాను ఎక్కువగా ఇంట్లోనే ఉంటానని, బయటకు చాలా తక్కువగా వెలుతుంటానని చెప్పారు. నిజా నిజాలు తెలుసుకోకుండా అసత్య ప్రచారం చేయొద్దని విజ్ఞప్తి చేశారు.
ఇదిలా ఉంటే.. శనివారంతో కేపీ చౌదరి కస్టడీ ముగిసింది. మరోసారి అతడిని కస్టడీకి తీసుకోవాలని పోలీసులు భావిస్తున్నారు. మరోసారి అతడిని విచారిస్తే మరిన్ని లింకులు బయటపడే అవకాశాలు ఉందంటున్నారు.