Tamannaah Bhatia : ఫ్యామిలీతో టెంపుల్‌లో తమన్నా ప్రత్యేక పూజలు .. పెళ్లి కోసమేనా?
తమన్నా-విజయ్ వర్మ పెళ్లికి సిద్ధమవుతున్నారా? తమన్నా కుటుంబంతో కలిసి గుడిలో పూజలు నిర్వహించడం చూసి ఈ జంట గుడ్ న్యూస్ చెబుతారని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.

Tamannaah Bhatia
Tamannaah Bhatia : తమన్నా-విజయ్ వర్మ డేటింగ్‌లో ఉన్న విషయం తెలిసిందే. తాజాగా వీరిద్దరూ పెళ్లికి రెడీ అయ్యారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. తమన్నా తన కుటుంబంతో కామాఖ్యా ఆలయంలో ప్రత్యేక పూజలు చేయడం అందుకు బలాన్ని చేకూరుస్తోంది.
Sukriti Veni : డైరెక్టర్ సుకుమార్ కూతుర్ని చూశారా? సుకృతి బర్త్‌డే సెలబ్రేషన్స్ ఫొటోలు..
హ్యాపీడేస్ సినిమాతో తెలుగులో అరంగేట్రం చేసిన తమన్నా తెలుగులో టాప్ హీరోయిన్‌గా ఎదిగారు. ఆ తర్వాత తమిళ, హిందీ సినిమాల్లో పాపులర్ అయ్యారు. లస్ట్ స్టోరీస్ 2 టైమ్‌లో తమన్నా-విజయ్ వర్మ ప్రేమలో పడ్డారు. ఇద్దరూ ఒకరిపై ఒకరికి ఉన్న ఇష్టాన్ని పబ్లిక్‌గా ఒప్పుకున్నారు కూడా. కాగా వీరిద్దరూ త్వరలో పెళ్లికి సిద్ధమవుతున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా తమన్నా ఇంట్లో పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో తమన్నా అస్సాం గౌహతీలోని నీలాచల్ హిల్స్‌లోని ప్రసిద్ధ కామాఖ్యా ఆలయంలో కుటుంబంతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దీనిని బట్టి త్వరలోనే తమన్నా విజయ్ వర్మతో పెళ్లి వార్త చెప్పబోతున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి.
Filmfare Awards 2024 : 69వ ఫిలింఫేర్ అవార్డ్స్.. టెక్నికల్ అవార్డుల ప్రకటన.. యానిమల్, జవాన్ హవా..
తమన్నాకి తెలుగులో ప్రస్తుతం ఏ సినిమా చేయడం లేదు. తమిళంలో కూడా ఒక ప్రాజెక్టు మాత్రమే ఉంది. అయితే ఆ మధ్య వచ్చిన జైలర్ లోని ‘కావాలయ్యా’ పాట మాత్రం ఒక ఊపు ఊపింది. విజయ్ వర్మ సూర్య 43 లో నటిస్తున్నారు. త్వరలోనే వీరిద్దరూ అధికారికంగా పెళ్లికబురు చెబుతారేమో చూడాలి.
View this post on Instagram