Sharwanand : ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ ట్రైలర్ లాంచ్.. చీఫ్ గెస్టులుగా ఆ ఇద్దరు హీరోయిన్స్

ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరగనుంది. అయితే ఈ ఈవెంట్ కి చీఫ్ గెస్టులుగా ఇద్దరు హీరోయిన్స్ ని పిలవడం విశేషం. సాధారణంగా సినిమా ఈవెంట్స్ కి చీఫ్ గెస్టులుగా.....

Sharwanand :  ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ ట్రైలర్ లాంచ్.. చీఫ్ గెస్టులుగా ఆ ఇద్దరు హీరోయిన్స్

Adavallu Miku Joharlu

Updated On : February 25, 2022 / 8:59 AM IST

 

Aadavallu Meeku Joharlu :  శర్వానంద్ హీరోగా, రష్మిక మందన్న హీరోయిన్ గా తిరుమల కిషోర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం “ఆడవాళ్లు మీకు జోహార్లు”. శ్రీ లక్ష్మి వేంకటేశ్వర సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి ఈ సినిమాని నిర్మించారు. ఈ సినిమా మార్చి 4న విడుదల కాబోతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్, సాంగ్స్ కి మంచి ఆదరణ లభించింది. ఆడవాళ్ళ గొప్పతనాన్ని ప్రస్తావిస్తూ ఈ కథ ఉంటుందని గతంలోనే డైరెక్టర్ తెలిపారు. ఇందులో మాజీ హీరోయిన్లు, సీనియర్ నటీమణులు ఖుష్బు, రాధిక శరత్‌కుమార్, ఊర్వశిలు నటిస్తున్నారు. అంతేకాక ఫేమస్ లేడీ ఆర్టిస్టులు చాలా మంది ఈ సినిమాలో ఉన్నారు.

 

తాజాగా ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరగనుంది. అయితే ఈ ఈవెంట్ కి చీఫ్ గెస్టులుగా ఇద్దరు హీరోయిన్స్ ని పిలవడం విశేషం. సాధారణంగా సినిమా ఈవెంట్స్ కి చీఫ్ గెస్టులుగా హీరోలనో, లేదా స్టార్ డైరెక్టర్స్ నో లేదా అప్పుడప్పుడు పొలిటికల్ నాయకులని పిలుస్తారు. చాలా తక్కువ సందర్భాలలో హీరోయిన్స్ ని పిలుస్తారు. ఇటీవల ‘వరుడు కావలెను’ సినిమా ఈవెంట్ కి పూజా హెగ్డేని పిలిచి అందర్నీ ఆశ్చర్యపరిచారు. హీరోయిన్స్ ఏం తక్కువ కాదు అంటూ ఇప్పుడు హీరోయిన్స్ వైపు మొగ్గు చూపుతున్నారు. తాజాగా ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి కూడా ఇద్దరు హీరోయిన్లని చీఫ్ గెస్టులుగా పిలిచారు.

Bheemla Nayak : ఏపీలో డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ యాజమాన్యాల కోసం పవన్ ఫ్యాన్స్ విరాళాల సేకరణ

ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఫిబ్రవరి 27న హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో జరగనుంది. ఈ వేడుకకు ముఖ్య అతిధులుగా హీరోయిన్లు కీర్తి సురేష్, సాయి పల్లవి రానున్నారు. ఈ మేరకు అధికారికంగా పోస్టర్ ని రిలీజ్ చేశారు. సాయి పల్లవికి ప్రస్తుతం చాలా క్రేజ్ ఉంది తెలుగు రాష్ట్రాల్లో. ఇక కీర్తి ‘సర్కారు వారి పాట’ సినిమాతో మరోసారి వార్తల్లో నిలుస్తుంది. దీంతో ఈ ఇద్దర్ని పిలిస్తే సినిమాకి మరింత ప్లస్ అవుతుందని భావించారు చిత్ర యూనిట్. ఇక సాయి పల్లవి, కీర్తి సురేష్ అభిమానులు కూడా ఈ విషయం తెలిసి ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ వేదిక మీద రష్మిక, కీర్తి, సాయి పల్లవి ఇలా ముగ్గురు హీరోయిన్స్ ని ఒకేసారి చూడొచ్చు.