Garuda 2.0 : ఆహా ఓటీటీలో నెంబర్ 1గా దూసుకుపోతున్న ఐశ్వర్య రాజేష్ సినిమా సినిమా..

గరుడ 2.0 ఆహా ఓటీటీలో గత కొన్ని రోజులుగా టాప్ 1 గా ట్రెండింగ్ అవుతుంది.

Garuda 2.0 : ఆహా ఓటీటీలో నెంబర్ 1గా దూసుకుపోతున్న ఐశ్వర్య రాజేష్ సినిమా సినిమా..

Updated On : May 25, 2025 / 7:54 PM IST

Garuda 2.0 : తమిళ్ లో ఐశ్వర్య రాజేష్ నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా ఆరత్తు సీనం ఇటీవల తెలుగులో డబ్బింగ్ తో రిలీజయింది. అరివాజగన్ వెంకటాచలం దర్శకత్వంలో డిమోంటి కాలనీ హీరో అరుళ్ నీతి తమిళరాజు, ఐశ్వర్య రాజేష్, ఐశ్వర్య దత్త మెయిన్ లీడ్స్ లో తెరకెక్కిన క్రైమ్ థ్రిల్లర్ సినిమా ఆరత్తు సీనం తెలుగులో గరుడ 2.0 పేరుతో ఆహా ఓటీటీలో రిలీజ్ చేసారు.

క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాగా విడుదలైన గరుడ 2.0 ఆహా ఓటీటీలో గత కొన్ని రోజులుగా టాప్ 1 గా ట్రెండింగ్ అవుతుంది. ఆహా ఓటీటీలో సినిమా విజయవంతంగా నడుస్తూ నిర్మాతకు కాసుల వర్షం కురిపిస్తోంది. ఈ సినిమాని హనుమాన్ మీడియా బ్యానర్ పై నిర్మాత బాలు చరణ్ డబ్బింగ్ చేసి ఆహా ఓటీటీలో రిలీజ్ చేసారు.

Also Read : Sumanth : తాతయ్య చనిపోయినప్పుడు బాధపడలేదు.. 19 ఏళ్లకే మా అమ్మ చనిపోయింది.. నేను అమెరికాలో.. సుమంత్ ఎమోషనల్..

గతంలో హనుమాన్ మీడియా పతాకంపై సూపర్ మచ్చి, శాకాహారి, కాళరాత్రి, నేనే నా, కాజల్ కార్తీక, టీనేజ్‌ర్స్, కథ కంచికి మనం ఇంటికి.. లాంటి పలు సినిమాలు రిలీజ్ చేసి ఆహా ఓటీటీలో సక్సెస్ కొట్టారు. తమిళ్ లో 50 కోట్లు వసూలు చేసి రికార్డు సృష్టించిన ఆరత్తు సీనం తెలుగులో కూడా గరుడ 2.0 గా ప్రేక్షకుల ముందుకు వచ్చి సక్సెస్ అయింది.

ఈ సినిమా కథ విషయానికొస్తే.. పోలీస్ ఆఫీసర్ అరవింద్(అరుళ్ నీతి) ఓ రౌడీ షీటర్ ని ఎన్ కౌంటర్ చేయడానికి వెళ్లినా పై ఆఫీసర్స్ వల్ల ఆపేయాల్సి వస్తుంది. కొన్నాళ్ల తర్వాత అరుళ్ నీతి భార్య(ఐశ్వర్య రాజేష్), పాప చనిపోవడంతో ముందుకు బానిస అవుతాడు. అలాంటి సమయంలో వరుసగా మగవాళ్ళు హత్యకు గురవుతూ ఉంటారు. ఈ కేసుని తీసుకొమ్మని ఓ సీనియర్ ఆఫీసర్ అరవింద్ ని అడగడంతో మొదట ఒప్పుకోకపోయినా తర్వాత కేసు టేకప్ చేస్తాడు. అసలు ఆ హత్యలు ఎవరు చేస్తున్నారు? అరవింద్ ఈ కేసుని ఎలా డీల్ చేసాడు? ఆ మగవాళ్లందరికి కనెక్షన్ ఏంటి? అరవింద్ భార్య, పాప ఎలా చనిపోయారు తెలియాలంటే ఆహా ఓటీటీలో సినిమా చూడాల్సిందే.

Also Read : Allu Aravind : మరి గత చీఫ్ మినిస్టర్ ని ఎందుకు కలిశారు? పవన్ కళ్యాణ్ – థియేటర్స్ ఇష్యూ పై అల్లు అరవింద్ కామెంట్స్..