Akhil Agent Movie : అయ్యగారి సినిమా వచ్చి ఏడాది అయింది.. అయినా ఇంకా ఓటీటీకి రాని ఏజెంట్..

సినిమా రిలీజయి నేటికి సంవత్సరం అవుతున్నా ఏజెంట్ ఇంకా ఓటీటీలోకి రాలేదు.

Akhil Agent Movie : అయ్యగారి సినిమా వచ్చి ఏడాది అయింది.. అయినా ఇంకా ఓటీటీకి రాని ఏజెంట్..

Akhil Agent Movie Completed one Year Theatrical Release but still no OTT Release

Akhil Agent Movie : అఖిల్ అక్కినేని(Akhil Akkineni) రకరకాల కథలతో సినిమాలు చేస్తున్నా భారీ హిట్ కొట్టలేకపోతున్నాడు. లవ్ సినిమాలు వర్కౌట్ అవ్వలేదని మొదటి సారి ఫుల్ మాస్, యాక్షన్, స్పై రోల్ లో చేసిన సినిమా ఏజెంట్. అఖిల్, సాక్షి వైద్య(Sakshi Viadya) జంటగా, మమ్ముట్టి(Mammootty) ముఖ్య పాత్రలో సురేందర్ రెడ్డి(Surendar Reddy) దర్శకత్వంలో అనిల్ సుంకర నిర్మాణంలో దాదాపు 70 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఏజెంట్ సినిమా గత సంవత్సరం ఏప్రిల్ 28న రిలీజయింది.

ఏజెంట్ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈసారైనా అఖిల్ హిట్ కొడతాడు అనుకున్నారు. కానీ అఖిల్ గత సినిమాల కంటే కూడా ఏజెంట్ దారుణంగా పరాజయం పాలైంది. ఈ సినిమా వల్ల దాదాపు 50 కోట్ల నష్టం నిర్మాతకు వచ్చినట్టు సమాచారం. అంతేకాక నిర్మాతకు – వైజాగ్ డిస్ట్రిబుట్యూటర్ కి ఉన్న వివాదం వల్ల కూడా సినిమాకి ఎఫెక్ట్ అయిందని తెలుస్తుంది. ఏజెంట్ సినిమాని సోనీ లివ్ ఓటీటీ స్ట్రీమింగ్ చేయడానికి ఒప్పుకున్నా, ఆల్రెడీ డేట్ అనౌన్స్ చేసినా చివరి నిమిషంలో క్యాన్సిల్ చేశారు.

Also Read : Renu Desai : కూతురితో డాన్స్ వీడియో షేర్ చేసిన రేణు దేశాయ్.. నా బెస్ట్ డాన్సింగ్ పార్ట్నర్ అంటూ పోస్ట్..

మొదట 2023 మే 19న ఏజెంట్ సినిమా సోనీ లివ్ ఓటీటీలో స్ట్రీమింగ్ చేస్తామన్నారు, ఆ తర్వాత సెప్టెంబర్ 29 అన్నారు. కానీ సినిమా రిలీజయి నేటికి సంవత్సరం అవుతున్నా ఏజెంట్ ఇంకా ఓటీటీలోకి రాలేదు. దీంతో నేడు ఏజెంట్ సినిమాని మరోసారి తలుచుకుంటూ అక్కినేని ఫ్యాన్స్, నెటిజన్లు సోషల్ మీడియాలో ఏజెంట్ ని వైరల్ చేస్తున్నారు. సినిమా ఫ్లాప్ అయినా ఓటీటీలోకి వస్తే చూడని వాళ్ళు ఒక్కసారైనా చూస్తారు అని కామెంట్స్ చేస్తున్నారు.

అయితే నిర్మాతకు – వైజాగ్ డిస్ట్రిబ్యూటర్ మధ్య జరుగుతున్న వివాదం కోర్టులో ఉండటంతో దీని వల్లే ఏజెంట్ సినిమా ఓటీటీకి ఇంకా రాలేదని టాలీవుడ్ సమాచారం. మరి అఖిల్ ఏజెంట్ సినిమాకి ఓటీటీ మోక్షం ఎప్పుడు కలుగుతుందో చూడాలి. ఇక అఖిల్ ప్రస్తుతం అనిల్ కుమార్ అనే కొత్త దర్శకుడితో యూవీ క్రియేషన్స్ నిర్మాణంలో భారీ బడ్జెట్ తో ఓ పీరియాడిక్ సబ్జెక్టు సినిమా చేయబోతున్నట్టు సమాచారం.