Gabbar Singh – Akira Nandan : ‘గబ్బర్ సింగ్’ రీ రిలీజ్ లో పవన్ తనయుడు అకిరా నందన్ సందడి.. అరుస్తూ, పేపర్లు ఎగరేస్తూ..
సాధారణంగానే అకిరా నందన్ తన తండ్రి సినిమాలు థియేటర్స్ లో ఫస్ట్ రోజే చూస్తాడు.

Akira Nandan Enjoying in Gabbar Singh Re Release Videos goes Viral
Gabbar Singh – Akira Nandan : నిన్న పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా గబ్బర్ సింగ్ సినిమా రీ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. చాలా మంది ఫ్యాన్స్ థియేటర్స్ లో గబ్బర్ సింగ్ రీ రిలీజ్ కి రచ్చ చేసారు. అయితే పవన్ తనయుడు అకిరా నందన్ కూడా గబ్బర్ సింగ్ రీ రిలీజ్ థియేటర్లో చూసి హంగామా చేసాడు.
సాధారణంగానే అకిరా నందన్ తన తండ్రి సినిమాలు థియేటర్స్ లో ఫస్ట్ రోజే చూస్తాడు. రీ రిలీజ్ సినిమాలు కూడా హైదరాబాద్ లోని సింగిల్ స్క్రీన్ థియేటర్స్ లో చూసి ఎంజాయ్ చేస్తాడు. చాలా వరకు అకిరా తన తండ్రి ఫ్యాన్స్ తో కలిసే సినిమాలు చూస్తాడు. ఈ క్రమంలో నిన్న రిలీజయిన గబ్బర్ సింగ్ సినిమాని కూడా హైదరాబాద్ లోని ఓ సింగిల్ స్క్రీన్ థియేటర్ లో ఫ్యాన్స్ తో కలిసి చూసి ఎంజాయ్ చేసాడు అకిరా.
Also Read : Sneha – Pawan Kalyan : రీల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్ లో కూడా.. పవన్ పై స్నేహ వ్యాఖ్యలు..
తెరపై పవన్ కళ్యాణ్ కనిపిస్తుంటే పేపర్లు ఎగరేసి, అరుస్తూ మాములు ఫ్యాన్స్ లాగే హంగామా చేసాడు అకిరా. దీంతో అకిరా నందన్ అరుస్తూ, పేపర్లు ఎగరేస్తూ రచ్చ చేసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పవన్ ఫ్యాన్స్ ఈ వీడియోని మరింత షేర్ చేస్తున్నారు. తండ్రి సినిమాకు తనయుడు ఈ మాత్రం ఎంజాయ్ చేయకపోతే ఎలా.
#AkiraNandan At #GabbarSingh4K Re release 🔥#HappyBirthdayPawanKalyan#gabbarsingh
— Trivikram JSP (@Trivikram_Pavan) September 2, 2024
#AkiraNandan At #GabbarSingh4K Re release 🔥#HappyBirthdayPawanKalyan pic.twitter.com/zF6FqRH5nR
— PawanKalyan Cult Fans™ (@PawanKalyanCF) September 2, 2024