Alia Bhatt : నా పాత్రపై విమర్శలు.. బ్రహ్మాస్త్ర బాగా ఆడుతుంది.. సినిమాలో పాజిటివ్ అంశాలని చూడండి..

బ్రహ్మాస్త్ర సినిమాలో కథ, కథనంతో పాటు అలియా భట్ పాత్రపై కూడా విమర్శలు వస్తున్నాయి. తన పాత్ర నిడివి చాలా తక్కువ ఉందని, ఉన్న కొద్ది సేపు కూడా పర్ఫార్మెన్స్ కి స్కోప్ లేదని, ఒకటే డైలాగ్ రిపీట్ గా..............

Alia Bhatt : నా పాత్రపై విమర్శలు.. బ్రహ్మాస్త్ర బాగా ఆడుతుంది.. సినిమాలో పాజిటివ్ అంశాలని చూడండి..

Alia Bhatt responds on trolls about Brahmastra

Updated On : September 17, 2022 / 1:24 PM IST

Alia Bhatt :  అలియా భట్- రణబీర్ కపూర్ జంటగా అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో వచ్చిన బాలీవుడ్ సినిమా బ్రహ్మాస్త్ర పాన్ ఇండియాగా రిలీజ్ అయి మంచి విజయం సాధించింది. సినిమా విజువల్స్, గ్రాఫిక్స్ ని అందరూ అభినందిస్తున్నారు కానీ సినిమా కథ, కథనంపై మాత్రం విమర్శలు వస్తున్నాయి. విజువల్స్, గ్రాఫిక్స్ బాగుండటంతో ప్రేక్షకులు సినిమాకి వస్తున్నారు. కలెక్షన్స్ కూడా బాగానే వస్తున్నాయి.

బ్రహ్మాస్త్ర సినిమాలో కథ, కథనంతో పాటు అలియా భట్ పాత్రపై కూడా విమర్శలు వస్తున్నాయి. తన పాత్ర నిడివి చాలా తక్కువ ఉందని, ఉన్న కొద్ది సేపు కూడా పర్ఫార్మెన్స్ కి స్కోప్ లేదని, ఒకటే డైలాగ్ రిపీట్ గా ఇచ్చారని విమర్శలు వస్తున్నాయి. నెటిజన్లు ఈ విషయంలో అలియాని ట్రోల్ చేస్తున్నారు.

Sudheer Babu : అందుకే బ్రహ్మాస్త్ర సినిమా వదులుకున్నాను..

అయితే తాజాగా నిర్వహించిన ఓ సక్సెస్ మీట్ లో అలియా ఈ విమర్శలపై స్పందిస్తూ.. ”ఏదైనా మనం చూసేదాన్ని బట్టే ఉంటుంది. సినిమా చాలా బాగా ఆడుతుంది. నా పాత్రపై వచ్చే విమర్శలు నేను గౌరవిస్తాను. కానీ సినిమాలో ఇంకా చాలా పాజిటివ్ అంశాలు ఉన్నాయి. వాటిపై దృష్టి పెట్టండి. సినిమా ఇంకా బాగుంటుంది” అని తెలిపింది.