Allu Arjun : అతను లేకపోతే నా లైఫ్ ఇలా ఉండేది కాదు.. అల్లు అర్జున్!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నిన్న నిఖిల్ '18 పేజిస్' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి గెస్ట్‌గా హాజరయ్యాడు. ఇక ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అల్లు అర్జున్ మాట్లాడుతూ.. ప్రతి మనిషి లైఫ్ లో ఒక కీ పర్సన్ ఉంటాడు. అలా నా లైఫ్ లో...

Allu Arjun Emotional comments on sukumar
Allu Arjun : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నిన్న నిఖిల్ ’18 పేజిస్’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి గెస్ట్‌గా హాజరయ్యాడు. కార్తికేయ-2 వంటి పాన్ ఇండియా హిట్టు తరువాత నిఖిల్ నుంచి వస్తున్న మూవీ ఇది. లవ్ అండ్ రొమాంటిక్ థ్రిల్లర్ గా వస్తున్న ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తుంది. కుమారి 21ఎఫ్ తెరకెక్కించిన పల్నాటి సూర్యప్రతాప్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కథని అందిస్తున్నాడు.
Allu Arjun : టాలీవుడ్ నుంచి ఆ అవార్డు అందుకున్న మొదటి నటుడు అల్లు అర్జున్..
బన్నీ వాసు, సుకుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకి అల్లు అరవింద్ సమర్పికుడిగా వ్యవహరిస్తున్నాడు. గోపి సుందర్ సంగీతం అందిస్తున్నాడు. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అల్లు అర్జున్ మాట్లాడుతూ.. “ప్రతి మనిషి లైఫ్ లో ఒక కీ పర్సన్ ఉంటాడు. అలా నా లైఫ్ లో సుకుమార్. అతను లేకపోతే నా లైఫ్ ఇలా ఉండేది కాదు. దానికి నేను ఎప్పటికి ఋణపడి ఉంటా” అంటూ సుకుమార్ పై తన ప్రేమని వ్యక్తం చేశాడు.
అలాగే నిర్మాత అల్లు అరవింద్ గురించి మాట్లాడుతూ.. “మా నాన్న గారికి ఎన్నో ఆఫర్లు వస్తున్నాయి. సొంత ఓటిటి ప్లాట్‌ఫార్మ్ ఉంది కదా. సినిమాలను డైరెక్ట్ గా దానిలో రిలీజ్ చేసేమని. కానీ అయన థియేటర్ వ్యవస్థ నాశనం అవ్వకూడదు అనే ఉద్దేశంతో, ఆ ఆఫర్ల అన్నిటికి నో చెబుతూ వస్తున్నారు. సినిమా మీద ఇంత ప్రేమని చూపుతున్న మా నాన్న మరియు నిర్మాతకి నా కృతజ్ఞతలు” అని తెలియజేశాడు.