Allu Arjun : అల్లు అర్జున్ పాన్ ఇండియా స్పీచ్.. పాట్నా ఈవెంట్లో ఏం మాట్లాడాడు అంటే..

పుష్ప 2 ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో అల్లు అర్జున్ మాట్లాడుతూ..

Allu Arjun : అల్లు అర్జున్ పాన్ ఇండియా స్పీచ్.. పాట్నా ఈవెంట్లో ఏం మాట్లాడాడు అంటే..

Allu Arjun Pan India Speech in Pushpa 2 Movie Trailer Launch Event at Patna

Updated On : November 17, 2024 / 8:46 PM IST

Allu Arjun : నేడు పుష్ప 2 సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ బీహార్ రాజధాని పాట్నాలో ఘనంగా జరిగింది. దాదాపు లక్ష మందికి పైగా జనాలు, అభిమానుల మధ్య పుష్ప 2 ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్ కు అల్లు అర్జున్, రష్మిక మందన్న, పలువురు మూవీ యూనిట్ విచ్చేసారు. పలువురు బీహార్ ప్రముఖులు కూడా ఈవెంట్ కు వచ్చారు.

ఇప్పటికే పుష్ప సినిమాతో పాన ఇండియా స్టార్ డమ్ తెచ్చుకున్న బన్నీ ఇప్పుడు పుష్ప 2 ప్రమోషన్స్ ని పాన్ ఇండియా లెవల్లో గ్రాండ్ గా చేస్తున్నారు. నేడు పాట్నా నుంచే పుష్ప 2 ప్రమోషన్స్ మొదలుపెట్టారు. దీంతో నేడు ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో బన్నీ స్పీచ్ పై ఆసక్తి నెలకొంది. ఇక ఈ ఈవెంట్లో బన్నీ హిందీ, ఇంగీష్ భాషల్లో మాట్లాడాడు.

Also Read : Pushpa 2 Trailer : అల్లు అర్జున్ పుష్ప 2 ట్రైలర్ వచ్చేసింది.. పుష్ప అంటే నేషనల్ అనుకుంటిరా.. ఇంటర్నేషనల్..

పుష్ప 2 ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో అల్లు అర్జున్ మాట్లాడుతూ.. నమస్తే.. బీహార్ ప్రజలందరికీ నా నమస్కారం. బీహార్ అందిస్తున్న ప్రేమను నేను తట్టుకోలేకపోతున్నాను. నేను ఇదే తొలిసారిగా బీహార్ రావడం. పుష్ప ఎవరి దగ్గర తగ్గడు, కానీ మొదటిసారి మీ ప్రేమానురాగాలు ముందు తగ్గుతున్నాడు. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా.. ఇక నుండి వైల్డ్ ఫైర్. నా హిందీ కాస్త మీకు ఇబ్బందికరంగా ఉండొచ్చు. నన్ను క్షమించండి. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికీ నేను థ్యాంక్స్ చెబుతున్నాను. మీరు ఈ సినిమాపై చూపించిన ప్రేమకు థ్యాంక్యూ. దేశం మొత్తానికి థ్యాంక్యూ. ఈ సినిమాని గత మూడు సంవత్సరాలుగా మోస్ట్ యాంటిసిపేటెడ్ సినిమాగా నిలిపినందుకు థ్యాంక్యూ. ఇది నా గొప్పతనం కాదు. ఇదంతా మీ వల్లే సాధ్యమైంది. ఈ సందర్భంగా పుష్ప టీమ్ మొత్తానికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీ ప్రేమే ఈ సినిమా ఇంత గొప్పగా తీయడానికి, ఇంత గొప్పగా అందరికీ నచ్చడానికి కారణం. ‘పుష్ప’ను ఇంత సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. స్పాన్సర్స్‌కి, పోలీస్ సిబ్బందికి, అభిమానులందరికీ థ్యాంక్యూ. డిసెంబర్ 5న ఈ చిత్రం గ్రాండ్‌గా రిలీజ్ కాబోతుంది. థ్యాంక్యూ బీహార్. థ్యాంక్యూ పాట్నా అని అన్నారు. చివర్లో ‘పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా… ఫ్లవర్ కాదు..’ అంటూ డైలాగ్ చెప్పి ఫ్యాన్స్ ని అలరించాడు.