Allu Arjun : డార్క్ మోడ్ లో బన్నీ మూవీ.!

అల్లు అర్జున్‌ హీరోగా (Allu Arjun ) లోకేశ్‌ కనగరాజ్‌ దర్శకత్వంలో ఓ మూవీ రాబోతోంది.

Allu Arjun : డార్క్ మోడ్ లో బన్నీ మూవీ.!

Allu Arjun sets sights on a darker cinematic universe with Lokesh Kanagaraj

Updated On : January 19, 2026 / 2:42 PM IST

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా లోకేశ్‌ కనగరాజ్‌ దర్శకత్వంలో ఓ మూవీ రాబోతోంది. ఆ పిక్చర్‌పై అధికారిక ప్రకటన వచ్చేసింది. అనిరుధ్‌ రవిచంద్రన్‌ ఈ మూవీకి మ్యూజిక్‌ అందించనున్నారు. త్వరలోనే షూటింగ్‌ కూడా స్టార్ట్ కానుంది. మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్స్‌పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

అల్లుఅర్జున్‌ ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో ఓ మూవీలో యాక్ట్ చేస్తున్నాడు. ఈ క్రమంలోనే బన్సీ నెక్స్ట్‌ ప్రాజెక్ట్‌పై అనౌన్స్‌మెంట్‌ వచ్చింది. కూలీ తర్వాత లోకేశ్‌ తన సినిమాటిక్‌ యూనివర్స్‌లో భాగంగా అల్లుఅర్జున్‌తో సినిమాను ప్రకటించాడు. ఈ సినిమాకు సంబంధించి కథ ఇప్పటికే లాక్‌ అవ్వగా, స్క్రిప్ట్‌ వర్క్‌ క్లైమాక్స్‌కు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ ఏడాది సమ్మర్‌లో ఈ మూవీ సెట్స్‌పైకి వెళ్లే అవకాశం ఉందట. ఓ సరికొత్త యాక్షన్ డ్రామాగా తీర్చిదిద్దుతారట. గత చిత్రాలకు పూర్తి భిన్నమైన క్యారెక్టరైజేషన్‌తో అల్లుఅర్జున్‌ కనిపించనున్నారని టాక్‌.

Chiranjeevi : మెగాస్టార్ – శ్రీకాంత్ ఓదెల సినిమాపై అప్డేట్ ఇచ్చిన నిర్మాత.. పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ అంటూ..

అయితే ఈ మూవీపై ఇండస్ట్రీలో ఇంట్రెస్టింగ్‌ గాసిప్ చక్కర్లు కొడుతోంది. ఈ సినిమా డార్క్ వరల్డ్‌లో సాగుతుందని, స్టోరీ మొత్తం నైట్ టైమ్‌లోనే జరుగుతుందని అంటున్నారు. అంతేకాదు ఖైదీ సినిమా లాంటి ఫార్మాట్‌లో ఫారెస్ట్ నేపథ్యంలో ఇంటెన్స్ యాక్షన్, డార్క్ థీమ్స్‌తో లోకేశ్‌ స్టైల్‌లో పూర్తిగా నైట్ టైమ్‌ స్టోరీ అంటూ ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

అనౌన్స్‌మెంట్ వీడియోలోనే ఫారెస్ట్ సెట్టింగ్, తోడేళ్లు, గుర్రాలు, డార్క్ టోన్ చూస్తే ఈ గాసిప్‌కు బలం చేకూరుతోంది. లోకేశ్‌ కనగరాజ్ మార్క్, వైలెంట్ వరల్డ్‌లో బన్నీ ఎలాంటి లుక్‌లో కనిపిస్తాడో చూడాలని ఫ్యాన్స్ ఈగర్లీగా వెయిట్ చేస్తున్నారు. ఈ డార్క్ మాస్ ఎంటర్‌టైనర్ థియేటర్లలో రచ్చ చేయడం ఖాయమే అనే ఎక్స్‌పెక్టేషన్స్‌ ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా ఉంది.